E-Paper
Advertisement

Actress Suhashini : నటి సుహాసిని సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Actress Suhashini : నటి సుహాసిని సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Actress Suhashini : సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు.. నటనపై ఆసక్తి ఉండడం మాత్రమే కాదు.. అదృష్టం కూడా వరించాలి. అప్పుడే వరుసగా సినీ అవకాశాలు మన తలుపు తడతాయి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. కొంతమంది పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు.. అయితే ఇంకొంతమంది మాత్రం సినిమాలు చేసి ప్రస్తుతం సీరియల్స్ లతో బిజీ అవుతున్నారు. అలాంటి వారిలో సీరియల్ నటి సుహాసిని ఒకరు. తెలుగులో ఎన్నో సినిమాలు సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఒకప్పుడు సినిమాలతో బాగా బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు పలు సీరియస్లలో హీరోయిన్గా నటిస్తుంది.. ఈమె సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో అని తెలుసుకోవాలని నెటిజన్లు ఆత్రుత కనబరుస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

సుహాసిని బ్యాగ్రౌండ్…

హీరోయిన్ సుహాసిని ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. నెల్లూరు జిల్లా లోనే చదువును పూర్తిచేసుకుని ఆ తర్వాత నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో అటుగా అడుగులు వేసింది. 2003లో చంటిగాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి ఆడిషన్ కి సెలెక్ట్ అయిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. కేవలం ఒకటి రెండు సినిమాలతో ఈమె క్రేజీ బాగా పెరిగింది. కెరియర్ మంచి పిక్స్ లో ఉండగానే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై తన నటనతో ఆకట్టుకుంటుంది. సీరియల్లో హీరోయిన్గా మాత్రమే కాదు.. సీరియల్స్ ని నిర్మిస్తూ వస్తుంది. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న సుహాసిని తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఇకపోతే సీరియల్స్ మాత్రమే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తూ జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది.

Advertisement

Also Read :రోహిణి ప్లాన్ ఫెయిల్.. పిల్లల కోసం బాలు ప్లాన్.. శివ వీడియో బయటపడుతుందా..?

సుహాసిని నటించిన సినిమాలు…

వెండి తెరపై హీరోయిన్గా అవకాశాలు రావడం మామూలు విషయం కాదు.. తెలుగులో ఒకప్పుడు సినిమాల్లో కథానాయికగా నటించింది. 2003లో బి.జయ దర్శకత్వం వహించిన చంటిగాడు మూవీ తో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి మెప్పించింది. ఇక ఈమె తెలుగులో మాత్రమే కాదు. తమిళం, కన్నడ, భోజ్ పురి చిత్రాల్లో నటించింది. తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో నెమ్మదిగా బుల్లితెరపై అడుగుపెట్టింది.. 2010లో అపరంజి అనే సీరియల్ ద్వారా బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అనుబంధాలు, అలాగే అష్టా చమ్మా, శివ శంకరి, దేవత, మామగారు వంటి సీరియల్స్లలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. కుర్ర హీరోలతో పోటీపడి ఆమె నటించడంతో ఆమె క్రేజ్ మరింత పెరుగుతుంది.. ఈ మధ్యకాలంలో చాలా మంది సీరియల్ హీరోయిన్లు సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ కూడా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×