E-Paper
Advertisement

Chiraiya Web Series OTT : దివ్య దత్తా సోషల్ డ్రామా వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Chiraiya Web Series OTT : దివ్య దత్తా సోషల్ డ్రామా వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడు, ఎక్కడ  చూడచ్చో తెలుసా ?
Advertisement

Chiraiya Web Series OTT : భారతీయ వివాహాలకు ప్రపంచంలోనే గొప్ప స్థానం ఉంది. ఒకప్పుడు రోజుల తరబడి జరుపుకునే ఈ వేడుక, ఇప్పుడు ఒక్క రోజులో ముగించేస్తున్నారు కూడా. అలాగే వైవాహిక జీవితాలు కూడా రోజులలనే విడాకుల బాట కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక కొత్త సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. ఇది వైవాహిక జీవితంలో జరిగే అన్యాయాలను లేవనెత్తుతుంది. ఈ సిరీస్ టీజర్ కి మంచి స్పందన కూడా వస్తోంది. ముఖ్యంగా మహిళలపై జరిగే హింసను చూపిస్తూ ఆడియన్స్ ను ఆలోచనలో పడేయనుంది ఈ కథ. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

శశాంత్ షా దర్శకత్వం వహించి, SVF ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్ పేరు ‘చిరయ్య’ (Chiraiya). ఇందులో దివ్య దత్తా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంజయ్ మిశ్రా, సిద్ధార్థ్ షా, ప్రసన్న బిష్ట్, ఫైసల్ రషీద్, టిన్ను ఆనంద్, సరితా జోషి వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ 2026, March 8 నుంచి జియో హాట్‌స్టార్‌ JioHotstar లో ప్రీమియర్ అవుతుంది. వైవాహిక అత్యాచారం అనే సున్నితమైన సమస్యను ఈ సిరీస్ చర్చిస్తుంది. మరి ఈ సిరీస్ ను చూడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

టీజర్ లోనే అసలు మ్యాటర్

Advertisement

ఈ సిరీస్ పెళ్లి చూపులతో ప్రారంభమవుతుంది, వధువు పూజ భవిష్యత్తులో ఎన్నో ఆశలతో తన కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది. కానీ ఆమె అనుకున్నట్లు మాత్రం జీవితం ఉండదు. గుండెను మెలిపెట్టే సంఘటనలు జరుగుతాయి. ఆమె ముఖంపై కన్నీళ్లు కారుతూ, ఆమె శరీరంపై కనిపించే గాయాల గుర్తులతో వధువు టెర్రస్‌పై ఉన్నట్లు చూపించారు. ఇది వివాహం తర్వాత భర్త భార్యపై బలవంతం చేయడం వంటి వికృత నేరాలపై ప్రశ్నలను సంధిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి హింసలను మహిళలు మౌనంగా
భరిస్తూ వచ్చారు. ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘటనలపై ఈ సిరీస్ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ? ఈ సిరీస్ లో పూజ ఎలాంటి హింసకు గురవుతుంది ? దీని నుంచి ఎలా బయట పడుతుంది ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత ఓటీటీలోకి మెడికల్ డ్రామా… 10 సీజన్లు వచ్చినా తగ్గని క్రేజ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×