E-Paper
Advertisement

దువ్వాడలో ఆ క్వాలిటీ చూసి పడిపోయానన్న మాధురి .. తన కాలి గోటికి సరిపోరంటూ!

దువ్వాడలో ఆ క్వాలిటీ చూసి పడిపోయానన్న మాధురి .. తన కాలి గోటికి సరిపోరంటూ!
Advertisement

Big Tv Kissik Talks: దివ్వెల మాధురి పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) భార్యగా మాధురి అందరికీ ఎంతో సుపరిచితమే. ఇన్ని రోజులపాటు రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్న మాధురి ఇటీవల సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈమె తెలుగు బిగ్ బాస్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు .ఈ కార్యక్రమం తర్వాత మాధురి బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే వెండితెర సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇకపోతే తాజాగా మాధురి బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు.

నా ధైర్యం శ్రీనివాస్ గారే..

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు తన సినీ కెరియర్ కి సంబంధించిన అంశాల గురించి అలాగే రాజకీయాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్ గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే వర్ష మాధురిని ప్రశ్నిస్తూ అసలు ఇంత అందంగా ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటూ ప్రశ్న వేయడంతో వెంటనే మాధురి నేను ధైర్యం పక్కనే ఉన్నాను కాబట్టి అంటూ సమాధానం ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ అంటే టైగర్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా అంటూ ఈమె సమాధానం చెప్పారు.

సమాజంతో ఫైట్ చేశాను..

Advertisement

శ్రీనివాస్ గారు అంటే మీకు ఎంత ప్రేమ అంటూ వర్ష అడగడంతో ఆయన అంటే నాకు ఎంత ప్రేమ అంటే ఆయన కోసం ఈ సమాజంతోనే నేను ఫైట్ చేశాను ఈ విషయంలో ప్రపంచమంతా ఒకవైపు ఉంటే నేనొక్కటే ఒకవైపు ఉన్నానని తెలిపారు. ఇక ఈమె ప్రస్తుతం బిజినెస్ లో బిజీగా ఉంటూనే మరోవైపు కొన్ని సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నానని తెలిపారు .త్వరలోనే ఒక సినిమా కూడా విడుదల కాబోతుందని మాధురి తెలియచేశారు. ఇక సినిమా షూటింగ్ గురించి కూడా మాధురి మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.
షూటింగ్ లో బిజీగా ఉన్నారు సర్ ను మిస్ అవ్వలేదా అంటూ ప్రశ్న వేయడంతో సర్ తో పాటు కలిసి నేను షూటింగ్ కి వెళ్తున్నానని తెలిపారు.

Advertisement

ఇక మొదటి రోజు షూటింగ్లో భాగంగా తనకు కొంచెం భయం వేసిందని ఆ సమయంలో మా ఆయన నాకు ఎంతో ధైర్యం ఇచ్చారని తెలిపారు. మీరు దువ్వాడ గారి అందం చూసి పడిపోయారా ?లేక ధైర్యం చూసి పడిపోయారా? అంటూ ప్రశ్న వేయడంతో నేను ఆయన ధైర్యం చూసి పడిపోయానని మాధురి తెలిపారు. ఆయన ఒక రాజకీయ నాయకుడుగా ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ఇలాంటి పరిస్థితులలో ఒక ఆడదాని కోసం ధైర్యంగా ముందుకొచ్చే నిలబడే మగాడు ఎవరు ఉండరు. ఆయన మాత్రమే ముందు నిలబడ్డారు తన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు ఆయన గురించి ఎవరు ఎలాంటి నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లు కనీసం ఆయన కాలిగోటికి కూడా సరిపోరని మాధురి తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చాలా ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారని నాకున్న ధైర్యం మొత్తం మా ఆయన శ్రీనివాస్ గారే అంటూ మాధురి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: శివయ్య ఆశీస్సులతో కొడుకుకు పేరు పెట్టిన ఆది సాయికుమార్..ఎంత క్యూట్ గా ఉందో!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×