E-Paper
Advertisement

CP Sajjanar: మీ ఫోన్‌లో గ్రూపులపై పోలీసులు ప్రత్యేక నిఘా.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!

CP Sajjanar: మీ ఫోన్‌లో గ్రూపులపై పోలీసులు ప్రత్యేక నిఘా.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!
Advertisement

CP Sajjanar: స్వేచ్ఛ బ్యూరో: ఐపీఎల్ క్రికెట్​ సీజన్​ మొదలైన నేపథ్యంలో క్రికెట్​ బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్​ హెచ్చరించారు. క్రికెట్​ ను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో చెలగాటాలాడుకునే వారిని ఉక్కుపాదంతో అణచి వేస్తామని స్పష్టం చేశారు. యాప్ లపై నిషేధం విధించినా బెట్టింగ్ మాఫియా టెలిగ్రామ్​, వాట్సాప్​, ఇన్​ స్టాగ్రామ్​ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా కొత్త వెబ్ సైట్లను సృష్టించి కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు.

వారిపై ప్రత్యేక నిఘా..

ఆన్ లైన్​ లో మాత్రమే కాకుండా నివాస గృహాలు, ఫార్మ్ హౌస్​ లు, రహస్యంగా ఏర్పాటు చేసుకున్న అడ్డాల నుంచి మొబైల్ ఫోన్ల ద్వారా ఆఫ్​ లైన్ బెట్టింగులు నిర్వహిస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు చెప్పారు. లోకల్​ గా ఉండే బుకీలు దండిగా డబ్బు సంపాదించుకోవచ్చంటూ జనాన్ని బెట్టింగ్​ ఉచ్చులోకి దింపుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.

Advertisement

Also Read: Ration Rice: రేషన్ డీలర్ల గుబులు.. లబ్ధిదారులు ఖుషీ ఖుషీ.. ఎండల దెబ్బకు కేంద్రం కీలక నిర్ణయం

అత్యాశ కన్నీళ్లే మిలిస్తుంది..

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చన్న అత్యాశ చివరకు కన్నీళ్లే మిగిలిస్తుందని కమిషనర్​ సజ్జనార్ చెప్పారు. బెట్టింగుల్లో గెలిచేది కేవలం నిర్వాహకులు మాత్రమే అని పేర్కొన్నారు. ఆడినవారు సర్వస్వం కోల్పోవటం ఖాయమని చెప్పారు. ఒక్కసారి ఈ వ్యసనానికి అలవాటు పడితే దాని నుంచి బయట పడలేరన్నారు. క్రికెట్ ను ఒక ఆటగా మాత్రమే ఆస్వాదించాలని చెప్పారు. బెట్టింగ్ భూతాన్ని రూపుమాపే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ఎక్కడైనా బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే డయల్ 1‌‌0‌‌0కు ఫోన్​ చేయాలని కోరారు. దాంతోపాటు 94906 16555 నెంబర్ పై వాట్సాప్​ కూడా చేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామని చెప్పారు.

Advertisement

Also Read: IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్ భూతం.. కోటీశ్వరులను సైతం రోడ్డున పడేసే యాప్స్ ఇవే..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×