E-Paper
Advertisement

నమ్మకద్రోహం భరించలేకపోయా.. కచ్చితంగా కర్మ అనుభవించే పోతావ్ -సుమన్ శెట్టి

నమ్మకద్రోహం భరించలేకపోయా.. కచ్చితంగా కర్మ అనుభవించే పోతావ్ -సుమన్ శెట్టి
Advertisement

Kissik Talks: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ నటుడు సుమన్ శెట్టి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానంటూ చేసిన ఎమోషనల్ కామెంట్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో నెలకి 30 రోజులు పని చేస్తూ బిజీగా గడిపిన సుమన్ శెట్టి.. అవకాశాలు లేక బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి చేసి అభిమానులకు దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అందరినీ అలరిస్తున్న ఈయన.. అందులో భాగంగానే తన కెరియర్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఎమోషనల్ అయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు సుమన్ శెట్టి. ఈ నేపథ్యంలోనే తనను నమ్మించి మోసం చేసిన వారి గురించి అలాగే దేవుడు ఉంటే కర్మ తగులుతుంది అనే విషయాలపై స్పందించారు.

ఖచ్చితంగా కర్మ అనుభవించే పోతావ్..

లైఫ్ లో ఎవరైనా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? అనే ప్రశ్నకు సుమన్ శెట్టి మాట్లాడుతూ.. “ఆ వెన్నుపోటు వల్ల ఇప్పటికీ కోలుకోలేకపోయాను. కానీ చాలామందే ఉన్నారంటారు అందరూ.. అందరినీ నమ్మేస్తావు నువ్వు అని అంటారు.. నా నేచరే అంత. అందరినీ నేను నమ్ముతాను. కానీ వాళ్ళు నాకు ద్రోహం చేస్తే.. ఇక నేను ఏం చేయగలను . నాలాంటి మంచి ఫ్రెండును వాడు మిస్ చేసుకోవడం వాడి కర్మ. దేవుడు ఉంటే ఖచ్చితంగా కర్మ ఉంటుంది. వచ్చే జన్మ వచ్చే జన్మ అంటారు అది కాదు ఈ జన్మలోనే నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా.. ఈ జన్మలోనే అనుభవించి పోతావ్. ఎంత సమస్య ఉన్నా సరే మనిషి అన్నాక స్ట్రగుల్స్ రావడం సహజమే.. అప్పులు ఉండడం సహజమే.. ఈఎంఐలు ఉండడం సహజమే.. అవి లేకపోతే మనిషే కాదు.. ఇంకెంత హ్యాపీగా ఉంటామా. ఎన్ని కోట్లు ఉన్నా సరే సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు సుమన్ శెట్టి.

Advertisement

also read:మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనే.. పోస్ట్ వైరల్!

సుమన్ శెట్టి కెరియర్..

హాస్యనటుడిగా కెరియర్ ప్రారంభించిన ఈయన తెలుగు, తమిళ్ భాషలలో కలుపుకొని సుమారుగా 300 పైగా చిత్రాలలో నటించారు . విశాఖపట్నం సినీ రచయిత సత్యానంద్ ఈయనలోని నటుడిని గుర్తించి సినిమాలలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అలా దర్శకుడు తేజ ఈయనను జయం చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం చేశారు . ప్రత్యేకమైన సంభాషణలు.. భావ ప్రకటన ఈయనకు సినిమాలలో అవకాశాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలోనే నివాసం ఉంటున్నారు.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×