E-Paper
Advertisement

మత్స్యకారుల ఆశీస్సులు జగన్‌కే.. 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఖాయం!

మత్స్యకారుల ఆశీస్సులు జగన్‌కే.. 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఖాయం!
Advertisement

Vasupalli Ganesh: విశాఖపట్నం రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మత్స్యకార వర్గాల ప్రయోజనాల విషయంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల తీరును పోలుస్తూ ఆయన సంచలన విమర్శలు చేశారు. చంద్రబాబుకు మత్స్యకారులంటే గౌరవం లేదని, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి తీరా అధికారం వచ్చాక విస్మరించడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.

గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేస్తూ.. ‘మత్స్యకారుల తోలు తీస్తా’ అని బాబు హెచ్చరించిన తీరును వాసుపల్లి తీవ్రంగా ఖండించారు. గంగవరం జెట్టీ విషయంలో మత్స్యకారులను మోసం చేశారని, కనీసం ఒక్క జెట్టీ కూడా కట్టని చరిత్ర బాబుదని విమర్శించారు. చంద్రబాబు నమ్మి మోసపోయిన వర్గాల్లో మత్స్యకారులు ముందు వరుసలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

మరోవైపు, వైఎస్ జగన్ పాలనలో మత్స్యకారులకు జరిగిన మేలును ఆయన కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారని, కరోనా వంటి కష్టకాలంలో కూడా జువ్వలదిన్నెలో అద్భుతమైన హార్బర్‌ను నిర్మించి చూపారని ప్రశంసించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధికి గతంలో చంద్రబాబు 15 కోట్ల గ్రాంట్ ఇవ్వడానికి నిరాకరిస్తే, జగన్ ఏకంగా 150 కోట్లు కేటాయించి హార్బర్‌ రూపురేఖలు మార్చారని గుర్తుచేశారు.

ముఖ్యంగా విశాఖ హార్బర్‌లో బోట్లు అగ్నిప్రమాదానికి గురైనప్పుడు, జగన్ గంటల వ్యవధిలోనే స్పందించి బాధితులకు పరిహారం అందించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని వాసుపల్లి పేర్కొన్నారు. లోకేష్ వ్యవహారశైలి చంద్రబాబు రాజకీయ పతనానికి కారణమవుతుందని వ్యాఖ్యానిస్తూ.. 2029లో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, మత్స్యకార వర్గాలన్నీ వైఎస్సార్సీపీ వెంటే ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: రాత్రి పూట ఐస్‌క్రీమ్ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×