E-Paper
Advertisement

ఓ ఇంటి వాడైన ఎక్స్ప్రెస్ హరి.. ఇటుకలతో కట్టిన ఇల్లు కాదంటూ!

ఓ ఇంటి వాడైన ఎక్స్ప్రెస్ హరి.. ఇటుకలతో కట్టిన ఇల్లు కాదంటూ!
Advertisement

Express Hari:సొంత ఇంటి కల ప్రతి ఒక్కరి డ్రీమ్.. ఆ కలను నెరవేర్చుకోవడానికి సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక బుల్లితెర కమెడియన్ తన కల నెరవేరిందని ఎమోషనల్ అవుతూ ఒక పోస్టు పంచుకున్నారు. ఆయన ఎవరో కాదు ఎక్స్ప్రెస్ హరి.. జబర్దస్త్, మా పరివారం వంటి షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన తాజాగా తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేసిన హరి.. అనంతరం పాలు పొంగించి.. గృహప్రవేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మధ్య తరగతి వాడి ఆశలతో నిండిన కల..

ఈ మేరకు తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ..”సొంత ఇల్లు.. ఇది నాలుగు పునాదుల మీద కట్టిన.. మూడు గదుల ఇల్లు మాత్రమే కాదు.. ఒక మధ్య తరగతి వాడి ఎన్నో ఆశలతో నిండిన కల.. దాచుకున్న ప్రతి రూపాయికి, పడిన ప్రతి కష్టానికి ఫలితం.. నాది అని చెప్పుకోవడానికి, వాడి జీవితానికి ఉన్న చిరునామా.. సాధించాం అనే సంతోషం.. సంపాదించుకున్నాం అనే గౌరవం.. ఇవన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకంగా మారిందే సొంతిల్లు.. అది ఇప్పుడు నా జీవితంలోకి వచ్చింది, ఈ ఇంట్లో పడిన ప్రతి అడుగు ఆశీర్వాదంగా మారింది.. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.. మీ అభిమానం, ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే నాపై ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఒక ఎమోషనల్ పోస్టు పంచుకున్నారు హరి. ఇక హరి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు హరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు.. ఆత్మగౌరవంతో నిండిన కష్టానికి తగిన ప్రతిఫలం అంటూ చేసిన ఈ కామెంట్లు అందరినీ కంటితడి పెట్టిస్తున్నాయి.

గృహప్రవేశ వేడుకలో సందడి చేసిన తారలు..

Advertisement

ఇకపోతే ఎక్స్ప్రెస్ సరి నూతన గృహప్రవేశానికి పలువురు బుల్లితెర తారలు వచ్చి సందడి చేశారు. అందులో ముఖ్యంగా అషూ రెడ్డి, శివ జ్యోతి, అలాగే ముక్కు అవినాష్, ప్రముఖ యాంకర్ కం నటి శ్రీముఖి తోపాటు మరి కొంతమంది సెలబ్రిటీలు సందడి చేశారు.

also read:Sing geetham OTT: నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతున్న మ్యూజికల్ ఫాంటసీ డ్రామా ‘సింగ్ గీతం’!

ఎక్స్‌ప్రెస్ హరి కెరియర్..

Advertisement

స్టాండప్ కమెడియన్ గా కెరియర్ ను మొదలు పెట్టిన హరి.. పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్ షోలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కమెడియన్ గానే కాకుండా రైటర్ గా కూడా సత్తా చాటారు హరి. ప్రస్తుతం పలు రియాల్టీ టీవీ షో లతో సందడి చేస్తున్న హరి.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కుకు విత్ జాతి రత్నాలు వంటి షో లతో బిజీగా మారారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×