E-Paper
Advertisement

PDS Rice: హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం దందా కలకలం

PDS Rice: హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం దందా కలకలం
Advertisement

PDS Rice: స్వేచ్చ బ్యూరో: హుజూరాబాద్ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కావడంతో నిఘా తక్కువగా ఉంటుందనే అంచనాతో అక్రమ నిల్వలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న మార్కెట్ రోడ్డులోని ‘క్యాస రమేష్ కిరాణం’ దుకాణంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు బ్లూకోట్స్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది.

బ్లూకోట్స్ పోలీసులు..

ఈ నమ్మకమైన సమాచారం మేరకు పోలీసులు సదరు కిరాణా షాపుపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో దుకాణంలో దాచి ఉంచిన సుమారు రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్లూకోట్స్ పోలీసులు హుజూరాబాద్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినోద్‌కు సమాచారం అందించారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ సమాచారం అందుకున్న వెంటనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినోద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించి, వాటిని సీజ్ చేశారు. అనంతరం ఆ బియ్యాన్ని భద్రపరచడం కోసం స్థానికంగా ఉన్న సమీప రేషన్ డీలర్ షాపునకు తరలించారు.

Advertisement

Also read: Hyderabad Metro: ఢిల్లీ కేంద్ర మంత్రులకు.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అధికారులు విచారణ..

పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు నిల్వ చేశారా? లేదా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. సీజ్ చేసిన బియ్యం నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Advertisement

Also read: Fertility Centres: కార్పోరేట్ ఫెర్టిలిటీ సెంటర్ల పై సర్కార్ నయా స్కెచ్.. ఇకపై వరుస దాడులు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×