E-Paper
Advertisement

బుల్లితెర నటికి ఘోర అవమానం.. పిలిచి మరి అవమానించిన బుల్లెట్ భాస్కర్!

బుల్లితెర నటికి ఘోర అవమానం.. పిలిచి మరి అవమానించిన బుల్లెట్ భాస్కర్!
Advertisement

Sridevi Drama Company: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇలా బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఒకటి. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటి ఇంద్రజ(Indraja) జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరించగా పలువురు బుల్లితెర నటినటులతో పాటు జబర్దస్త్ కమెడియన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఇంద్రసేనారెడ్డిగా హైపర్ ఆది ..

ఇలా ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా ప్రస్తుతం మామిడి పళ్ళ సీజన్ కావడంతో మామిడిపళ్ళకు సంబంధించిన స్కిట్లు ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో గ్యాస్ కష్టాలకు సంబంధించి ఇంద్ర సినిమాలోని ఒక సన్నివేశాన్ని స్పూఫ్ చేశారు. ఇంద్రసేనారెడ్డిగా హైపర్ ఆది నటించిన విలన్ పాత్రలో బుల్లెట్ భాస్కర్ స్నేహ రెడ్డి పాత్రలో బుల్లితెర నటి ఐశ్వర్య నటించారు.

డైలాగులు మర్చిపోయిన ఐశ్వర్య..

Advertisement

సీమలో గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో మా భూములు మొత్తం ఇచ్చేస్తున్నాము. మిగిలింది స్నేహ రెడ్డి గారి నిర్ణయమే అంటూ బుల్లెట్ భాస్కర్ ఐశ్వర్య తో మాట్లాడగా ఐశ్వర్య మాత్రం అప్పుడు చెప్పాల్సిన డైలాగ్ మర్చిపోతుంది. ఇందాక మీరు ఏదో చెప్పారు కదా అర్థం కాలేదు అంటూ ఐశ్వర్య చెప్పగా అర్థం కాలేదా? అదేంటండి అంతసేపు అక్కడ ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థం కాలేదని చెప్పడం ఏంటి అంటూ కాస్త సీరియస్ అయ్యారు.

Advertisement

బుల్లెట్ భాస్కర్ ఇలా మాట్లాడటంతో వెంటనే ఐశ్వర్య నేను కూడా ఆర్టిస్టు నేనండీ అని చెప్పగా డైలాగులు చెబితేనే ఆర్టిస్టులు అంటూ మాట్లాడారు. ఇలా వీరిమధ్య కొంతసేపు వాదోపవాదములు జరిగాయి దీంతో ఐశ్వర్య అసలు ఏంటి పిలిపించి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిజంగానే వీరిద్దరి మధ్య గొడవ జరిగిందా ?లేకపోతే ప్రోమో హైలెట్ కోసమే ఇలా గొడవ పడినట్టు చూపించారా? అనేది తెలియాలి అంటే ఆదివారం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఐశ్వర్య అగ్నిసాక్షి అనే సీరియల్ ద్వారా గౌరీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. కస్తూరి అనే సీరియల్ లో కూడా ఈమె మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఐశ్వర్య కేవలం తెలుగు సీరియల్స్ మాత్రమే కాకుండా కన్నడ సీరియల్స్ లో కూడా నటిస్తూ గుర్తింపు పొందారు.

Also Read: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ కావ్య రెడ్డి పసుపు దంచుడు వేడుక!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×