E-Paper
Advertisement

Iran: ఇరాన్ చేతికి అణు బాంబు.. ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?

Iran: ఇరాన్ చేతికి అణు బాంబు.. ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?
Advertisement

Iran: ఇరాన్‌తో యుద్ధానికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఇప్పటికే అణ్వాయుధాలు ఉన్నాయ్. రెండు అణ్వాయుధ దేశాలు కలిసి.. ఇరాన్‌ని న్యూక్లియర్ వెపన్స్ తయారుచేయొద్దని దాడులు చేస్తున్నాయ్. అయితే, భవిష్యత్ మనుగడ కోసం.. ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను వదులుకోకపోవచ్చనే ఆందోళన కూడా ఉంది. ఇరాన్ స్వయంగా తమకు అణు బాంబు కావాలని గానీ, తమ దగ్గర బాంబు ఉందని గానీ ప్రకటించలేదు. కానీ, ఇరాన్ మొదలుపెట్టిన న్యూక్లియర్ ప్రోగ్రామ్, మిసైల్ కెపాసిటీ, ఇజ్రాయెల్, అమెరికా నుంచి పదేపదే వస్తున్న బెదిరింపులతో.. న్యూక్లియర్ క్వశ్చన్ మళ్లీ రైజ్ అయింది. ఒకవేళ.. ఇరాన్‌ గనక సొంతంగా అణు బాంబును తయారుచేసుకోగలిగితే.. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ లాంటి మిడిల్‌ఈస్ట్‌లోని దాని ప్రత్యర్థులు మరోసారి ఆలోచనలో పడతారనే ప్రశ్న తలెత్తింది.

ఉక్రెయిన్ చేసిన చారిత్రక పొరపాటు?

అణ్వాయుధ చర్చల్లో ఉక్రెయిన్ స్టోరీనే బిగ్ ఎగ్జాంపుల్. రష్యాతో ఏళ్ల తరబడి యుద్ధం సాగుతోంది. దాంతో.. సోవియట్ కాలం నాటి ఆయుధాగారాన్ని వదులుకోవడం.. తాము చేసిన చారిత్రక తప్పిదమని చాలా మంది ఉక్రెయిన్ ప్రజలు భావిస్తున్నారు. అయినప్పటికీ, 2014లో రష్యా క్రిమియా స్వాధీనం, 2022లో తమ దేశంపై దాడిని ఉక్రెయిన్ ఆపలేకపోయింది. చాలా మంది ఇప్పుడు 1994 బుడాపెస్ట్ ఒప్పందాన్ని పెద్ద పొరపాటుగా చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్‌ దగ్గర అణ్వాయుధాలుండటం గానీ, నాటో లాంటి బలమైన కూటముల్లో భాగంగా ఉండాలని.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ పదే పదే వాదిస్తున్నారు.

అణ్వాయుధాలే అంతిమ భీమా?

Advertisement

ఉక్రెయిన్, సౌతాఫ్రికా, బెలారస్, కజకిస్తాన్ కథలు చూస్తే, అణుబాంబుల కంటే ఒప్పందాలు, దౌత్యం, హామీల ద్వారానే భద్రత లభిస్తుందని.. ఆ దేశాలు బలంగా నమ్మినట్లు అర్థణవుతోంది. కానీ ఇరాన్ యుద్ధం, ఉక్రెయిన్‌పై.. రష్యా దాడి, అమెరికా కమిట్‌మెంట్‌లు బలహీనపడతాయనే భయాలు మొదలయ్యాయ్. కేవలం.. న్యూక్లియర్ వెపన్స్ తమ దగ్గర ఉంటేనే.. సురక్షితంగా ఉంటామా? అని అనేక దేశాల్లో ప్రశ్నలు మొదలయ్యాయ్. ప్రతి కొత్త యుద్ధం, దురాక్రమణకు వ్యతిరేకంగా అణ్వాయుధాలే అంతిమ భీమా అనే వాదన బలపడుతోంది. ఇందుకు.. ఇరానే బిగ్ ఎగ్జాంపుల్. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు.. అణు శక్తి ఒక్కటే మార్గమని ఆ దేశం భావిస్తోంది.

ప్రపంచ రాజకీయాల్లో కొత్త వాదన

శత్రువు దాడి చేయకుండా భయపెట్టడానికి న్యూక్లియర్ బాంబు కావాలనే ధోరణిలో ఆలోచిస్తున్నాయ్ కొన్ని దేశాలు. మన దగ్గర బాంబు ఉంటే, అవతలి వాడు యుద్ధానికి రావాలంటే వెయ్యిసార్లు ఆలోచిస్తాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. పైగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు దేశాలు అణ్వాయుధాలు కలిగినవే. అంటే, అణు బాంబు ఉంటేనే ప్రపంచ వేదికపై గౌరవం ఉంటుందనే భావన కూడా పెరిగింది. లిబియా తన న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని వదులుకున్నాక.. గడాఫీ అధికారం కోల్పోయి చనిపోయారు.

ఇజ్రాయెల్-అమెరికా వ్యూహం

Advertisement

ఇరాక్‌ దగ్గర అణ్వాయుధాలు లేవు కాబట్టే, అమెరికా సులభంగా దాడి చేసిందని.. ఇరాన్ లాంటి దేశాలు నమ్ముతున్నాయ్. అయితే, అణ్వాయుధం అనేది రెండు అంచుల కత్తి. అది చేతిలో ఉంటే రక్షణ ఉంటుందనేది ఎంత వాస్తవమో, దానిని ప్రయోగిస్తే సర్వనాశనం తప్పదనేది అంతే నిజం. ఏదేమైనా, ఇప్పుడు నడుస్తున్న ఇరాన్ యుద్ధం.. అనేక దేశాలను అణ్వాయుధాల వైపు ప్రేరేపిస్త్తోందనేది మాత్రం నిజం. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్, అమెరికా చేస్తోంది కేవలం యుద్ధం కాదు. భవిష్యత్తులో అణ్వాయుధాల వ్యాప్తిని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నం. కానీ, ఈ ప్రయత్నమే.. మరో భారీ యుద్ధానికి దారి తీస్తే.. అది మానవాళికే ప్రమాదం!

Also Read: ఒకే రాజధాని.. మూడు గ్రోత్ ఇంజిన్లు.. ఏపీ అభివృద్ధికి బాబు ‘మాస్టర్ ప్లాన్’!

Story by: Anup, Big Tv

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×