E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాహుల్ ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి

Brahmamudi Serial Today November 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాహుల్ ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి
Advertisement

Brahmamudi serial today Episode:  

తన పేరు మీద కంపెనీ పెడుతున్నారా..? ఇదంతా అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడాను నన్ను క్షమించు రాజ్‌ అంటూ ఎమోషనల్‌ అవుతాడు రాహుల్ . దీంతో రాజ్ రేయ్‌ ఏంట్రా ఇదంతా నీ మారావు.. ఒక్క అవకాశం వస్తే జీవితంలో ఎదగడానికి ట్రై చేస్తున్నావు అందుకే నీకో చాన్స్‌ ఇవ్వమని కావ్య చెప్పింది.. అందుకే నీకు ఈ అవకాశం  ఇచ్చాము.. నిలబెట్టుకోవాలి..  అని చెప్తాడు. నిలబెట్టుకుంటాను రాజ్‌ మీ అందరి చేత శభాష్‌ అనిపించుకుంటాను మాటల్లోనే కాదు నేనేంటో చేతల్లో చూపిస్తాను.. అంటాడు.

ఇంతలో ఇంద్రాదేవి కోపంగా రుద్రాణి విన్నావా..?  ఇప్పటికైనా అర్థం అయిందా..? రాజ్‌, కావ్య అంటే ఏంటో..? గతంలో మీరు ఎన్ని తప్పులు చేసినా ఎన్నెన్ని నిందించినా నా మనవడు మనవరాలు మాత్రం మీరు బాగుండాలనే కోరుకున్నారు.. ఈ రోజు నీ కొడుకుని ఒక కంపెనీకి ఓనర్‌ను చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రవర్తించు అంటుంది. నా కొడుకు కోడలు ఎప్పటికీ తప్పు చేయరు.. తప్పుల్ని సరిదిద్దుతారు. ఇది మనసులో పెట్టుకుని అందరి బాగు కోరుకో రుద్రాణి ఇప్పటికైనా మనిషిగా మారు అంటుంది అపర్ణ. కావ్య మాత్రం అత్తయ్య ఈరోజు మీ పెళ్లి రోజు అందరం సంతోషంగా గడపాల్సిన రోజు ఇలాంటి సందర్భంలో ఇవన్నీ ఎందుకు వదిలేయండి అత్తయ్య.. అక్కా ఇప్పుడు నీకు సంతోషమే కదా అంటూ అడగ్గానే..  స్వప్న చాలా సంతోషంగా ఉంది కావ్య థాంక్యూ సో మచ్‌ అంటూ చెప్తుండగానే.. ప్రకాష్‌ అమ్మా కావ్య ఆకలి వేస్తుందమ్మా అని అడగ్గానే.. అయితే పదండి అందరం భోజనం చేద్దామని వెళ్లిపోతారు.

Advertisement

తర్వాత సీతారామయ్య, రాజ్‌, కావ్యలతో గార్డెన్‌లో మాట్లాడుతుంటాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదురా అంటాడు. రాజ్‌ ఏమైంది తాతయ్య ఇప్పుడు అని అడగ్గానే.. ఇన్నేళ్లలో ఈ దుగ్గిరాల కుటుంబంలో ఏ రోజు ఎవ్వరూ చేయని పని చేశారు. ఎవ్వరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబం అంటే ఇసుక ఇటుకలతో కట్టిన నాలుగు అంతస్థులు కాదురా..? నలుగురు తలదాచుకునే గూడు కాదు. మనుషులు, మమతలు, అప్యాయతలు అనుబంధాలు అన్ని కలగలుపుకుని ఎదిగిన ఒక చెట్టురా.. ఆ చెట్టు నీడలో బతికే ఎవరైనా కష్టాన్ని పంచుకోవాలి. నష్టాన్ని భరించాలి. ఇష్టాన్ని పెంచుకోవాలి స్వార్థాన్ని తుంచుకోవాలి అంటూ సీతారామయ్య చెప్తుంటాడు. కానీ ఈ రోజు మీరు చేసిన పని వల్ల ఈ కుటుంబంలో మనిషైనా రాహుల్ మరో చెట్టు నీడకు వెళ్లినట్టే కదరా..?

ఇప్పుడొకరు పక్కకు వెళ్లారు.. రేపు ఒకరు.. ఇలా ఒక్కోక్కరిగా వెళ్లిపోతే ఈ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది కదా అని అడగ్గానే.. రాజ్‌ మేము ఇవాల ఇలా చేయకపోతే ఈ కుటుంబం మీరన్నట్టే విడిపోయేది అని చెప్తాడు. అంతే కాదు తాతయ్య గారు ఈ ఇంటి కోడళ్లుగా నాకు అప్పుకు మీరు ఎంతో స్థానాన్ని ఇచ్చారు కానీ మా అక్కకు ఇంకా ఆ స్థాన దక్కలేదు. కారణం తను కట్టుకున్న భర్త. ఆ భర్త స్థానం పెరిగితేనే మా అక్కకు కూడా మాతో సమానమైన గౌరవం ఇస్తారని అనుకున్నాను.. ఇకపై ఈ ఇంటికి ఏ సమస్య వచ్చినా తను కూడా మాతో పాటు నిలబడుతుందని అనుకుంటున్నాను తాతయ్య అని చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన కుటుంబం కలిసికట్టుగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము తాతయ్య అని రాజ్‌ చెప్పగానే.. అది జరిగితే నాకు సంతోషమే కానీ ఎటువంటి గొడవలు రాకుండా మీరే చూసుకోవాలి అని చెప్పి సీతారామయ్య వెళ్లిపోతాడు.

Advertisement

రుద్రాణి, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి నా కొడుకు కూడా ఒక కంపెనీకి చైర్మన్‌ అవుతున్నాడని ఫోజుల కొట్టగానే.. నీ కొడుకు కోటీశ్వరుడని విర్రవీగిపోకు రేపు ఆస్తులు పంచుకుంటే వారసులు నా కొడుకు కళ్యాణ్‌, రాజ్‌ మాత్రమే నీ కొడుకు కాదు కదా..? అప్పుడు నీ కొడుకు అన్యాయం కాకూడదని ఏదో చిన్న కంపెనీ పెట్టిస్తున్నాడు అని ధాన్యలక్ష్మీ చెప్పగానే రుద్రాణి కోపంతా వెళ్లిపోతుంది.  హ్యాపీగా ఉన్న రాహుల్ ను చూసి రుద్రాణి తిడుతుంది. ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావని అడుగుతుంది. నేనో కంపెనీకి చైర్మన్‌ అయ్యాను కదా అంటాడు రాహుల్‌.. దీంతో రుద్రాణి వాళ్లు వేసిన బిక్ష కు నువ్వు చైర్మన్‌ను అంటునావా..? అని రుద్రాణి అడగ్గానే.. తన అసలైన ప్లాన్‌ చెప్తాడు రాహుల్‌. ఈ ఆర్‌ కంపెనీతోనే స్వరాజ్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ కంపెనీస్‌ మొత్తం మింగేస్తాను అని చెప్తాడు.

మరోవైపు రాజ్‌ బుల్లెట్‌ తీసుకొచ్చి కావ్యను నడుపమని చెప్తాడు. కావ్య నడుపుతుంటే వెనక కూర్చున్న రాజ్‌ భయపడుతుంటాడు మెల్లగా నడుపు అని చెప్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×