E-Paper
Advertisement

OTT Movie : పని మనిషితో సరసాలు… బట్టలు లేని చిత్రాలు… దేవతల ఫోటోలను కూడా

OTT Movie : పని మనిషితో సరసాలు… బట్టలు లేని చిత్రాలు… దేవతల ఫోటోలను కూడా
Advertisement

OTT Movie : ఇండియా మొట్టమొదటి రియలిస్టిక్ పెయింటర్ రాజా రవి వర్మ అని చెప్పుకుంటారు. అతను దేవుని బొమ్మలు గీయడంలో దిట్ట. ఇతని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘రంగ్ రసియా’. దేవుళ్ళని కొత్త కోణంలో చూపించాలనుకున్న ఇతని ప్రయత్నం జైలుకు వెళ్ళేలా చేస్తుంది. ఆ తరువాత ఏమైందనేదే ఈ కథ. కొన్ని సన్నివేశాల కారణంగా, దీనికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే

కేతన్ మెహతా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పేరు ‘రంగ్ రసియా’. ఇందులో రాజా రవి వర్మ పాత్రలో రందీప్ హుడా నటించారు.
సుగంధా పాత్రని నందన సేన్ పోషించారు. 2008 లో వచ్చిన ఈ సినిమా 132 నిమిషాల నిడివితో ఐయండిబిలో 7.0/10 రేటింగ్ ని పొందింది. ఇప్పటికీ ఒక కల్ట్ ఆర్ట్ ఫిల్మ్ గా ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం Zee 5, యూట్యూబ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : చచ్చినోడు చేసే హత్యలు… అంతుపట్టని కేసు… బుర్రకు పదును పెట్టే తమిళ థ్రిల్లర్

స్టోరీఏమిటంటే

19వ శతాబ్దం చివర్లో రాజా రవి వర్మ ఒక గొప్ప పెయింటర్. దేవుడు దేవతల ఫోటోలు మొదటిసారిగా రియలిస్టిక్‌గా పెయింట్ చేసి, పూజా గదుల్లో పెట్టేలా చేసిన ఘనత ఇతనిదే. కానీ రవి వర్మ మైండ్ వేరు. మనుషుల నగ్న చిత్రాలు కూడా గీయాలని అనుకుంటాడు. ముందుగా తన భార్యతో స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ భార్య ఒప్పుకోదు. పని మనిషితో గీయడం మొదలు పెడతాడు. ఆమెతో సన్నిహితంగా కూడా గడపాతాడు. ఇక ఇది తెలిసి భార్య అతనికి దూరంగా ఉంటుంది. ఇక ఇతని టాలెంట్ దేవుడు మీద కూడా పడుతుంది. ఒక రోజు ముంబైలో సుగంధా అనే అందమైన యువతిని కలుస్తాడు. సుగంధా ఒక రిచ్ అమ్మాయి. రవి వర్మ ఆమెను చూసి మైమరిచిపోతాడు. ఆమెను తన మ్యూజ్‌గా ఎంచుకుంటాడు. సుగంధా మొదట్లో ఇష్టపడదు కానీ, రవి వర్మ ప్యాషన్, ఆర్ట్ మీద ఆబ్సెషన్ చూసి ప్రేమలో పడిపోతుంది. ఇక రవి వర్మ సుగంధాని న్యూడ్ పెయింటింగ్స్‌కి మోడల్‌గా నిలబెడతాడు.

Advertisement

దీనికి తోడుగా దేవతలను కూడా సెన్సువల్‌గా పెయింట్ చేస్తాడు. లక్ష్మి, సరస్వతి, ఊర్వశి, మేనక… అన్నీ సుగంధా బాడీతోనే ఉంటాయి. ఆ పెయింటింగ్స్ బయటకు వచ్చాక బ్రిటిష్ ప్రభుత్వం, హిందూ సంప్రదాయవాదులు, పండితులు ఫుల్ ఆందోళన చేస్తారు. దేవతలను నగ్నంగా చూపించడం పాపం అని కేసులు పెడతారు. రవి వర్మని అరెస్ట్ కూడా చేస్తారు. కానీ రవి వర్మ వెనక్కి తగ్గడు. శరీరం అందమైనది, దేవుడు కూడా అందంగానే ఉండాలి అని కోర్టులో గట్టిగా ఫైట్ చేస్తాడు. సుగంధా కూడా పూర్తి సపోర్ట్ ఇస్తుంది. తన లవర్ కోసం సమాజాన్ని ఎదిరించి నిలబడుతుంది. చివరికి రవి వర్మ కేసు గెలుస్తాడు. ఇండియాలో మొట్టమొదటి “ఫ్రీడమ్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెషన్” కేసు ఇది. ఆ తర్వాత రవి వర్మ పెయింటింగ్స్ దేశమంతా పాపులర్ అవుతాయి. పూజా గదుల్లో ఇప్పటికీ రవి వర్మ దేవుడు ఫోటోలు దర్శనం ఇస్తుంటాయి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×