E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 22nd:‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్ కొత్త కంపెనీ గురించి తెలుసుకున్న రాహుల్

Brahmamudi Serial Today November 22nd:‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్ కొత్త కంపెనీ గురించి తెలుసుకున్న రాహుల్
Advertisement

Brahmamudi serial today Episode:  

స్వరాజ్ గ్రూప్‌ అఫ్‌ కంపెనీస్‌కు సంబంధం లేకుండా వేరే కంపెనీ లోగో డిజైన్స్‌ రెడీ చేయండని మేనేజర్‌కు చెప్తుంటాడు రాజ్‌. ఇంతలో కావ్య వచ్చి ఎవరితో కొత్త కంపెనీ మేనేజర్ తో మాట్లాడుతున్నారా..? అని అడగ్గానే.. అవును కళావతి ఒక్క పని టైంకు అవ్వడం లేదు అని చెప్తాడు. దీంతో కావ్య నాకెందుకో భయంగా ఉందండి.. ఇన్ని ఏండ్లుగా తాతయ్య గారు స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ అని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. అందరు ఒకే చెట్టు నీడలో ఉండాలి అన్నట్టు అందరూ ఒకే కంపెపీలో పని చేశారు. కానీ ఇప్పుడు మీరు దానికి సంబంధం లేకుండా కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నారు.. ఒకవేళ తాతయ్య గారికి ఈ విషయం తెలిస్తే బాధపడతారేమో అనిపిస్తుందండి.. తాను సృష్టించిన కంపెనీ కాకుండా కొత్త కంపెనీ ఎందుకు పెడుతున్నావని అడిగితే ఏం సమాధానం చెప్తారు అని కావ్య అడగ్గానే..

ఏంటి కళావతి అలా మాట్లాడుతున్నావు అసలు ఈ కొత్త కంపెనీ ఎందుకు పెడుతున్నామో నీకు తెలుసు కదా..? మళ్లీ ఇలా అడుగుతున్నావేంటి..? అని చెప్పగానే.. ఏవండి తాతయ్య గారు మన కుటుంబం ఎప్పుడూ ఉమ్మడి కుటుంబంలా కలిసే ఉండాలి అంటుంటారు. అలాంటిది ఇప్పుడు కంపెనీ విషయంలో వేరు చేస్తున్నారు అని తెలిస్తే.. అని చెప్పగానే.. ఎలా తెలుస్తుంది. ఒకటి నువ్వు చెప్పాలి లేదంటే నేను చెప్పాలి.. కాబట్టి డోంట్‌ వర్రీ అలా ఏం జరగదు.. అని రాజ్‌ చెప్పగానే.. ఒకటి చెప్పండి మనం చేస్తున్నది కరెక్టేనా..? అని కావ్య అడగ్గానే.. మన మనసుకు ఏది అనిపిస్తే అది చేయాలని నువ్వే అంటుంటావు కదా కళావతి.. పైగా దీని వల్ల ఎవ్వరికీ నష్టం కూడా లేదు కదా అని రాజ్‌ చెప్పగానే..

Advertisement

కానీ కొత్త కంపెనీ వల్ల ఫ్యామిలీలో ఎదైనా గొడవలు వచ్చి అని అనుమానిస్తే.. కళావతి అలా ఏం జరగదు.. నువ్వే ఇలా టెన్షన్‌ పడి అందరికీ చెప్పేసేలా ఉన్నావు.. గుర్తుంది కదా కంపెనీ పూర్తిగా ఎస్టాబ్లిష్‌ అయ్యే వరకు ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని రాజ్‌ చెప్పగానే.. సరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రాహుల్‌కు మన ఆఫీసులో ఏదైనా కొంచెం ఫ్రీడమ్‌ ఇద్దామా..? అక్క ఫీల్‌ అవుతుంది కదా..? అని కావ్య చెప్పగానే.. నో అప్పుడే వద్దు రాహుల్ కు ఇంకా బాధ్యత తెలియాలి.. తను పూర్తిగా హ్యాండిల్‌ చేయగలడు అన్న నమ్మకం నాకు రావాలి అని రాజ్‌ చెప్పగానే.. కావ్య సరే అంటుంది.

రాహుల్ ఆఫీసులో శృతిని పిలిచి ఏదేదో మట్లాడుతుంటే.. శృతి తిట్టుకుంటుంది. రాహుల్ ఆడిటింగ్‌ ఫైల్‌ అడగ్గానే.. మేనేజర్‌ రాగానే తీసుకొచ్చి ఇస్తాను సార్‌ అని చెప్తుంది శృతి. తర్వాత మేనేజర్‌ వచ్చి ఫైల్‌ ఇవ్వగానే.. అందులో రాజ్‌ కొత్త కంపెనీ ఓపెనింగ్‌ చేసే డీటెయిల్స్‌ ఉంటాయి. అవి తెలుసుకోవాలని రాహుల్‌ అనుకుంటాడు.  అందుకోసం ఆర్‌ కంపెనీ పనులు జరిగే చోటికి రాహుల్ వెళ్తాడు. అక్కడి మేనేజర్‌ మీరు ఏంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పగానే.. ఏం లేదు కొత్త కంపెనీ పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చాను రాజ్‌ పంపించాడు..వర్క్‌ ఎంత వరకు వచ్చింది అని అడగ్గానే..

Advertisement

మేనేజర్‌ పార్టిషన్‌ పనులు మూడు రోజుల్లో పూర్తి అవుతాయి. ఇంటీరియల్‌, ఆఫీస్‌ పనులు ఇంకో పది రోజుల్లో పూర్తి అవుతాయి సార్ అని చెప్పగానే.. ఓ చాలా త్వరగా పూర్తి చేస్తున్నారు అని రాహుల్ అనగానే.. రాజ్‌ సార్‌ ఇప్పటికే చాలా లేట్‌ అయింది అని రాజ్‌ సార్‌ కోప్పడుతున్నారు సార్‌ అని మేనేజర్‌ చెప్పగానే.. అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అని రాహుల్‌ అడగ్గానే.. మేనేజర్‌ మొత్తం వివరాలు చెప్తాడు దీంతో రాహుల్‌ సీక్రెట్‌గా ఇంత పెద్ద వ్యవహారమే నడుపుతావా రాజ్.. ఇది చాలు నేనేంటో నీకు చూపిస్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

దుగ్గిరాల ఇంట్లో అందరూ సుభాష్‌, అపర్ణల పెళ్లి రోజు వేడుకలో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇంతలో రాహుల్‌ ఇంటికి ఇరిటేటింగ్‌ గా వస్తాడు. రుద్రాణిని తిట్టి లోపలికి వెళ్లిపోతుంటే పై నుంచి చూసిన స్వప్న ఏంటి రాహుల్ ఇంత మూడీగా ఉన్నాడు ఏంటో అడగాలి అని లోపలికి వెళ్తుంది. రాహుల్‌ను ఏమైంది రాహుల్ ఎందుకు అలా ఇరటేట్‌ అవుతున్నావు ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా అని స్వప్న అడగ్గానే.. రాహుల్‌.. రాజ్‌, కావ్య కలిసి కొత్త ప్రాజెక్టు స్టార్ట్‌ చేస్తున్నారు అని అది నాకు గండం తెచ్చేలా ఉందని భయపడతుంటాడు రాహుల్‌. దీంతో స్వప్న రాజ్‌ను లాప్‌టాప్‌ తీసుకొస్తాను అందులో అసలు విషయం తెలుస్తుంది అని స్వప్న వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×