E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 18th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి నిజం చెప్పిన రాహుల్‌

Brahmamudi Serial Today November 18th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి నిజం చెప్పిన రాహుల్‌
Advertisement

Brahmamudi serial today Episode:   

దెబ్బలతో డబ్బులతో ఇంటికి వచ్చిన రాహుల్‌ను ఇంట్లో వాళ్లు అందరూ అనుమానిస్తారు. ధాన్యలక్ష్మీ ఏకంగా ఇదో కొత్త నాటకం మొదులు పెట్టావా అని తిడుతుంది. దీంతో స్వప్న బాధపడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన సుభాష్‌ కోపంగా అందరినీ తిడతాడు. రాహుల్‌ చెప్తుంది నిజమే డబ్బుల కోసం రాహుల్‌ దొంగల చేతుల్లో దెబ్బలు తినడం నేను చూశాను.  అక్కడ రాహుల్‌ పరిస్థితి చూసి నేను డబ్బులు పోయాయేమో అనుకన్నాను. కానీ ఆ డబ్బులను కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు అని సుభాష్‌ చెప్పగానే.. స్వప్న కోపంగా ఇప్పుడేమంటారు మీరంతా ఇంకా నా భర్త దొంగలా నేరస్థుడిలా కనిపిస్తున్నాడా మీకు ఏం ఆంటీ మాట్లాడరేంటి.? నోరు రావడం లేదా.? లేక సుభాష్ అంకుల్ చెప్పింది కూడా నాటకం అంటారా..? అంటూ నిలదీయడంతో ధాన్యలక్ష్మీ కోపంగా ఇది మరీ బాగుంది స్వప్న ఇరవై లక్షల డబ్బులు డ్రా చేసిన వాడు సరైన టైంలో టెండర్‌ ఆఫీసుకు వెళ్లకపోతే ఏమనుకుంటాం.? నీ భర్త గతాన్ని చూస్తే అనుమానించకుండా ఎలా ఉంటాము అని చెప్పగానే..

మారిన మనషి గురించి ఆలోచించకుండా.. అవతల ఏం జరిగిందో తెలుసుకోకుండా మనుషుల మీద నిందలు వేసి అవమానించడం కాదు. మీరంతా చూడాల్సింది నా భర్త గతాన్ని కాదు మనిషిగా మారాలనుకున్న అతని అభిమతాన్ని. మారిన మనిషిని మీరు గమనించరు..? అతని కనీసం ఒక మనిషిగా పరిగణించరు..? రెప్పపాటు కాలం కూడా అతన్ని నమ్మకపోతే అతను ఎలా మారతాడు అని స్వప్న అడుగుతుంటే.. రుద్రాణి కల్పిచుకుని అదంతా వాళ్లకు ఎందుకు స్వప్న నా కొడుకును అవమానించాలి. వాడు నా కడుపున పుట్టినందుకు వాళ్లు నన్ను నిందించాలి. అంతే అంతే తెలుసు వాళ్లకు.. గతంలో తప్పులు చేసిందే కనిపిస్తుంది కానీ ఇప్పుడు వాడు మారి.. ప్రాణాలను పణంగా పెట్టి డబ్బులు తెచ్చాడే అది ఎవ్వరికీ కనిపించదు.. అంటూ రుద్రాణి ప్రశ్నిస్తుంటే ఎవ్వరూ మాట్లాడరు.

Advertisement

ఇంతలో రాహుల్‌ కూడా మమ్మీ నువ్వేం మాట్లాడకు.. ఇంట్లో వాళ్లు ఎవర్ని ఒక్క మాట కూడా అనే హక్కు నీకు లేదు.. అవును మమ్మీ వాళ్లు నన్ను అనుమానించడంలో తప్పు లేదు. గతంలో నేను చేసిన పనులు అలాంటివి.. నన్ను నేను ఫ్రూవ్‌ చేసుకుంటున్నాను.. ఇందులో నువ్వు కలగజేసుకోవద్దు.. అని చెప్పగానే.. అపర్ణ, ధాన్యలక్ష్మీ డబ్బు తెచ్చావు కానీ కాంట్రాక్ట్‌ పోయింది కదా..? అంటాడు. అవును డబ్బు తెచ్చాను కాంట్రాక్ట్ పోయింది అందుకే రాజ్‌ను క్షమాపణ అడుగుతున్నాను. అని చెప్పగానే.. రాజ్‌ రాహుల్ నువ్వేం బాధపడకు..కాంట్రాక్ట్‌ ఏమీ పోలేదు మనకే వచ్చింది. అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.  ఎలా వచ్చింది అని అడగ్గానే.. రాజ్‌ తాను ప్రకాష్‌కు డబ్ఉ ఎలా పంపింది చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు..

తర్వాత రాహుల్‌ దెబ్బలకు ఆయిట్‌మెంట్‌ పూస్తూ స్వప్న ఎందుకు ఇంత రిస్క్‌ చేశావని అడగ్గానే.. నేను ఇప్పుడు ఈ రిస్క్‌ చేయకపోతే నన్ను ఎవ్వరి జీవితంలో నమ్మేవారు కాదు.. అని చెప్తాడు. దీంతో స్వప్న ఇక నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను అని చెప్తుంది. రాహుల్‌ ఎమోషనల్ అవుతూ.. నువ్వు నా జీవితంలో నాకు దొరికిన అదృష్టానివి స్వప్న అంటూ బాధపడుతుంటాడు. మరోవైపు కావ్య, రాజ్‌తో రాహుల్‌ గురించి మాట్లాడుతుంది. ఈ రోజు జరిగిన సంఘటనతో రాహుల్‌ తన నిజాయితీని నిరూపించుకున్నాడు కదా అని చెప్పడంతో రాహుల్ సీరియస్‌గా చూడు కళావతి నిజాయితీ అనేది మాటి మాటికి నిరూపించుకునేది కాదు అది మన ఒంట్లోనూ మనసులోనూ శాశ్వతంగా ఉండాలి అని చెప్పగానే.. నిజమే అండి కానీ రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వాలి.

Advertisement

రాహుల్‌ దురదృష్టం తనను వెక్కిరిస్తూనే ఉంది తనకు మరో అవకాశం ఇవ్వండి అని చెప్తుంది. దీంతో రాజ్‌ ఆ పొరపాటు నేను మరోసారి చేయను కళావతి అంటాడు రాజ్‌. దీంతో కావ్య తన మాటలతో రాజ్‌ను కన్వీన్స్‌ చేస్తుంది. రాహుల్ కు ఏదైనా పని అప్పజెప్పండి అని చెప్తుంది. రాజ్‌ సరే అంటాడు. ఇంకోవైపు రుద్రాణి, రాహుల్‌ దగ్గరకు వెళ్లి ఆ డబ్బు కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా..? అని తిడుతుంది. దీంతో రాహుల్‌ నవ్వుతూ ఇవాళ జరిగిన దొంగతనం, దొంగలు మొత్తం నేను సెట్‌ చేసినవే అని చెప్తాడు. దీంతో రుద్రాణి షాక్‌ అవుతుంది. తర్వాత అందరూ భోజనం చేస్తుంటే.. రాహుల్‌, స్వప్న రారు దీంతో రుద్రాణి అందరినీ తిడుతుంది. దీంతో రాజ్‌, రాహుల్‌ ను పిలిచి నీతో మాట్లాడాలి అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×