E-Paper
Advertisement

OTT Movie : ఉద్యోగం కోసం వచ్చి ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? గూస్ బంప్స్ తెప్పించే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఉద్యోగం కోసం వచ్చి ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? గూస్ బంప్స్ తెప్పించే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలోకి మరో సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ప్రతీకారం ప్రధాన అంశంగా తెరకెక్కింది. ఇది ఒక ధనవంతుల ఫ్యామిలీలోకి ఎంటర్ అయి వాళ్లను డిస్ట్రాయ్ చేయాలనుకునే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఒక్క సారి చూడటం స్టార్ట్ చేస్తే చూపు తిప్పుకోలేరు. అంత ఇంటెన్స్ గా ఈ సిరీస్ ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మస్ట్ వాచ్ స్టోరీ. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘మాలిస్’ (Malice) సీజన్ 1 2025లో విడుదలైన బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది జేమ్స్ వుడ్ క్రియేట్ చేసిన సిరీస్. ఇందులో జాక్ వైట్‌ హాల్, డేవిడ్ డచోవ్నీ, కారిస్ వాన్ హౌటెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2025 నవంబర్ 14 నుంచి 6 ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు ముప్పావు గంటకు పైగా ప్రతి ఎపిసోడ్ ఉంటుంది. ఐయండిబిలో 6.5/10 రేటింగ్ ను పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జామీ టానర్ అనే రిచ్ ఫ్యామిలీ గ్రీస్‌లో సెలవులు గడపడానికి వెళ్తుంది. అక్కడ అంతా సరదాగా గడుపుతుంటారు. ఆడమ్ అనే వ్యక్తి వెళ్ళకి పరిచయం అవుతాడు. ఇక అతను చదువుకున్న నిరుద్యోగి అని తెలుసుకుని ట్యూటర్‌గాఉద్యోగంలో చేరమంటారు. ఆ ఇంట్లో ఇప్పటికే ఉన్న ఆయా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆడమ్ లండన్ లో ఉన్న వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆడమ్ అక్కడికి ఉద్యోగం కోసం రాలేదు. ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు. అతని తండ్రి ఆర్థికంగా నాశనమై, ఆ తర్వాత చనిపోవడానికి జామీ టానర్ కారణమని అతను నమ్ముతాడు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం జామీ తన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం వల్ల తన తండ్రికి బాగా నష్టం జరిగింది. ఆ దిగులుతో అతను చనిపోయి ఉంటాడు.

Read Also : అమెరికాలో పగ తీర్చుకోవాలనుకునే అచ్చ తెలుగు లేడీ డాన్… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

Advertisement

ఇక ఈ సీజన్ మొత్తం జామీ జీవితాన్ని ఆడమ్ పద్ధతిగా ఎలా నాశనం చేశాడో చూపిస్తారు. జామీకి, అతని భార్య నాట్ కి మధ్య చిచ్చు పెట్టడం, అక్రమ సంబంధాలు ఉన్నాయని నమ్మించడం, ఆఖరికి వాళ్ళ పెంపుడు కుక్కకు విషం పెట్టి చంపేయడం వంటి పనులు చేస్తాడు. సీజన్ ముగింపులో జామీని ఆడమ్ చంపి, ఆ నేరాన్ని పొరుగువాళ్ళపై నెడతాడు. ఇక క్లైమాక్స్ అతను తన నేరాల నుండి తప్పించుకుంటాడా ? పోలీసులు పట్టుకుంటారా ? అనే విషయాలను, బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×