E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ కొడుకే లక్కీ – నిజం గుర్తు చేసుకున్న ఆంటోని

Brahmamudi Serial Today Episode May 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ కొడుకే లక్కీ – నిజం గుర్తు చేసుకున్న ఆంటోని
Advertisement

Brahmamudi serial today Episode: నందు తాను చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన నీ చెల్లికి అక్కా అంటూ నిజం చెప్పగానే. ఇందు షాక్‌ అవుతుంది. నందును హగ్‌ చేసుకుని ఎమోషనల్ అవుతుంది. అయినా నువ్వు ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోయావే అని అడుగుతుంది. దీంతో నందు ఆ రేఖ ఆంటీ పెట్టే టార్చర్‌ భరించలేక పారిపోయాను. చిన్నతనంలో ఈ ఇల్లు చూస్తేనే భయం వేసేది.. ఆ రేఖ ఆంటీని చూస్తేనే ఇంకా భయం వేసేది అక్క అంటూ ఏడుస్తూ చెప్పగానే.. ఇందు కూడా అవునే ఆ రేఖ ఆంటీ పెట్టే టార్చర్‌ నా  కళ్లారా చూశాను. కానీ నేను చిన్నదాన్ని అయిపోయేసరికి నేను ఏం చేయలేకపోయాను. నిన్ను కాపాడుకోలేకపోయాను. కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్లకుండా నేను ఆపలేకపోయాను. నన్ను క్షమించవే అంటూ హగ్‌ చేసుకుంటుంది. ఇద్దరూ హగ్‌ చేసుకుని బాధపడుతుంటే..

నందు అక్కా నువ్వెందుకు అక్క క్షమించమని అడుగుతున్నావు. ఆ రేఖ ఆంటీ పెట్టే టార్చర్‌ భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోయాను. పోలీస్‌ అయి వచ్చి ఆ రేఖ ఆంటీ అంతు చూద్దామని వెళ్లాను అంటూ చెప్పగానే.. ఇందు హ్యాపీగా నా మనసుకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు నేను ఒంటరి దాన్ని ఆనే ఫీలింగ్‌ ఉంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు.. అది చాలు నాకు అనగానే.. నందు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అక్కా ఇన్ని రోజులు నా మనసులో దాచుకున్న నిజాన్ని.. నువ్వు నా అక్కవు అని తెలిసినా కూడా ఆ నిజాన్ని నీతో చెప్పకుండా ఉండిపోయాను. ఆ నిజాన్ని నీతో ఎప్పుడు చెబుదామా..? అనుకుంటూ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. అక్కా అసలు ఈ తాళి ఏంటి…? నువ్వు వాణ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి..?  అని నందు అడగ్గానే.. ఇందు అటూ ఇటూ చూసి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నీతో నేను చెప్పబోయే విషయాన్ని ఎవ్వరికీ చెప్పనని మాటివ్వు అనగానే..

Advertisement

నందు ప్రామిస్‌ అక్కా ఎవ్వరికీ చెప్పను అంటూ మాట ఇస్తుంది. దీంతో ఇందు నిజానికి ఇది పెళ్లి కాదు. నువ్వు గెస్‌ చేసినట్టుగానే.. ఇది నాటకం. తను నాకు అద్దె మొగుడిగా ఈ ఇంటికి వచ్చాడు. అంటూ జరిగింది మొత్తం చెప్తుంది ఇందు. దీంతో నందు ఏంటక్కా ఇదంతా వింటుంటే చాలా విచిత్రంగా ఉంది అక్కా అని అడగ్గానే.. రేఖ ఆంటీకి బుద్ది చెప్పడానికి ఇదే కరెక్టు అనిపించింది అయినా ఇందు పద నాన్నమ్మను కలుద్దాము అనగానే.. నందు నేను రాలేను అక్కా నేను పోలీస్‌ అయ్యాకే ఇంట్లోకి అడుగుపెడతాను. అప్పుడే నాన్నమ్మను కలుస్తాను. అప్పటి వరకు నువ్వు కూడ ఎవ్వరికీ నిజం చెప్పొద్దు అక్క అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది నందు.

ఆంటోనిని పక్కకు తీసుకెళ్లిన లక్కీ బీరు తాగిస్తూ.. బిర్యాని తినిపిస్తూ.. వాళ్ల అమ్మ గురించి అడుగుతాడు. దీంతో ఆంటోని నేను మీ అమ్మ ఎక్కడుందో పట్టిస్తానని.. అప్పటి వరకు నేను ఎక్కడ ఉండాలో చూడు అంటూ లక్కీని పంపిస్తాడు. లక్కీ వెళ్లిపోయాక మీ అమ్మను నీకు పట్టిస్తే.. నేను ఎలా బతుకుతానురా..? అంటూ జేబులోంచి రేఖ ఫోటో తీసి చూస్తూ.. లక్కీ రేఖకు పుట్టాడని.. రేఖ, లక్కీని ఆంటోని ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు.

Advertisement

రేఖ, భూషణ్‌లు వెళ్లి లాయరు ను కలుస్తారు. ఇందుకు పెళ్లి అయింది కదా..? ఇప్పుడు ఆస్థి తమకు ట్రాన్స్‌ఫర్‌ చేయమని అలా అవుతుందా… అని అడుగుతారు. దీంతో లాయరు ఇప్పుడు ఇందు ఎవరి పేరు మీదకైనా ట్రాన్స్‌ఫర్‌ చేయోచ్చు అని చెప్పగానే.. రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ సంతోషపడుతుంటారు. ఇంతలో లాయరు ఇందు పెళ్లి అయినట్టు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ కావాలి అని చెప్పగానే.. రేఖ పెళ్లి ఇప్పుడే అయింది కదా..? సర్టిపికెట్‌ రావాలంటే కొంత టైం పడుతుంది కదా..? అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. దీంతో రేఖ డైలమాలో పడిపోతుంది. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ తీసుకొచ్చాకైనా ఆస్థి మాకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుందా అని భ్రమరాంబ అడగ్గానే..

అప్పుడే కాదు కదా అని లాయరు చెప్తాడు. దీంతో రేఖ అదేంటండి సర్టిఫికెట్‌ ఉంటే అవుతుందని మీరే చెప్పారు కదా..? అనగానే.. లాయరు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌తో పాటు ఇందు గారి భర్త సంతకం కూడా కావాలని చెప్తాడు. ఆ మాటలకు అందరూ మరోసారి షాక్‌ అవుతారు. రేఖ కోపంగా లాయరును మీరే ఏదో కావాలని చెప్తున్నారు. ఇందులో ఏదో తిరకాసు ఉంది. అసలు ఏమనుకుంటున్నారు సార్‌ మీరు అంటూ తిట్టగానే.. లాయరు మీకు ఆస్థి కావాలి అనుకుంటే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌.. ఇందు గారి వేలి ముద్రలు, ఆమె భర్త సంతకం తీసుకుని రండి అప్పుడు మీకు ఆస్థి ట్రాన్స్‌ఫర్‌ చేస్తాను అంటూ చెప్పి వెళ్లిపోతాడు.

ఇంటికి వచ్చిన అందరూ ఎలాగైనా రాజు చేత సంతకం తీసుకోవాలిన అందుకోసం రాజును గ్రిప్పులో పెట్టుకోవాలని అందుకోసం వాడి గురించి మొత్తం తెలుసుకోవాలని డిసైడ్‌ అవుతారు. మరోవైపు రాజును కలిసిన లక్కీ  కోపంగా తిడుతుంటాడు. నీ పెళ్లి విషయం ఎవడో చెప్తే కానీ నాకు తెలియలేదు.. ఫ్రెండ్నే మోసం చేశావు కదరా.? అంటూ ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×