E-Paper
Advertisement

భారీ నిడివితో ఓటీటీలోకి ‘ధురంధర్ 2’.. నెట్‌ఫ్లిక్స్‌లో రాదా?.. ఎక్కడ చూడాలంటే?

భారీ నిడివితో ఓటీటీలోకి ‘ధురంధర్ 2’.. నెట్‌ఫ్లిక్స్‌లో రాదా?.. ఎక్కడ చూడాలంటే?
Advertisement

Dhurandhar OTT: ‘ఉరి’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ 2 ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలిసింది. అయితే ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘ధురంధర్ 2’ డిజిటల్ విడుదలపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1800 కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాను ఇంటి వద్దే వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Read also-ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. ముంబై వేదికగా ‘NTRNeel’ గ్లింప్స్ లాంచ్?

డిజిటల్ ప్లాట్‌ఫారమ్ మార్పు

Advertisement

ఈ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంటుంది. అయితే, భారతదేశంలోని ప్రేక్షకుల కోసం మాత్రం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో కాకుండా జియో హాట్‌స్టార్ (JioHotstar) ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమ్ కానుంది.

‘రా అండ్ అన్ సీన్’ వెర్షన్

ఓటీటీలో విడుదలయ్యే వెర్షన్ థియేటర్ వెర్షన్ కంటే భిన్నంగా ఉండబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ‘Dhurandhar: The Revenge (Raw & Undekha)’ అనే పేరుతో విడుదల చేస్తోంది. థియేటర్లలో సెన్సార్ కారణంగా కట్ అయిన కొన్ని కీలక సన్నివేశాలు, డైలాగులు యాక్షన్ సీన్లను ఇందులో పొందుపరిచారు.

Advertisement

Read also-Brahmamudi Serial Today Episode May 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ కొడుకే లక్కీ – నిజం గుర్తు చేసుకున్న ఆంటోని

నిడివి

థియేటర్లలో ఈ సినిమా నిడివి 3 గంటల 49 నిమిషాలు ఉండగా, ఓటీటీ వెర్షన్ సుమారు 3 గంటల 52 నిమిషాల పాటు ఉంటుంది. అంటే అదనంగా 3 నిమిషాల నిడివి గల అన్-సెన్సార్డ్ కంటెంట్‌ను ప్రేక్షకులు చూడవచ్చు. సినిమాలోని వైలెన్స్ డార్క్ థీమ్స్ ఈ వెర్షన్‌లో మరింత స్పష్టంగా కనిపిస్తాయని సమాచారం.

అంతర్జాతీయ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్‌లో మే 14-15 తేదీల నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమవుతోంది. ఇండియాలో జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ అయిన ఈ సినిమాను ఓటీటీలో అదనపు సీన్లతో చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×