E-Paper
Advertisement

బ్రహ్మముడి మార్చి 31: రోడ్డు మీద మళ్లీ ఇందును గుద్దేసిన రాజు 

బ్రహ్మముడి మార్చి 31: రోడ్డు మీద మళ్లీ ఇందును గుద్దేసిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: తన లవర్‌ను కలవడానికి నందుతో కలసి రెస్టారెంట్‌కు వెళ్తాడు వెంకీ. ఇయర్‌ బర్డ్‌ పెట్టుకుని నందు చెప్పే మాటలను తన లవర్‌ రోజాకు చెప్తుంటాడు. మధ్యలో నందుకు ఒక క్రిమినల్‌ను చూసి వాడిని తిడుతుంటుంది. అవే మాటలు వెంకీ ఫాలో అవుతుంటాడు. దీంతో రోజా వెంకీని ఎందుకు సడెన్ గా ఏమైంది అని అడగ్గానే.. ఏం కాలేదని చెప్పి మేనేజ్‌ చేస్తుంటాడు. నందు మాత్రం ఆ క్రిమినల్‌ను పట్టుకోవడానికి వాడు పారిపోతుంటే వెనకాలే పరుగెడుతుంది. వెంకీకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటాడు. దీంతో రోజా, వెంకీని తిట్టి వెళ్లిపోతుంది.

మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న రాజు.. బైక్‌తో వెళ్లి ఇందును గుద్దేస్తాడు. దీంతో ఇందు కోపంగా లక్కీ, రాజును తిడుతుంది. కప్పలు వర్షం పడగానే బయటకు వస్తాయి.. మీరేమో నేను రోడ్డు మీదకు రాగానే గుద్దడానికి బయటకు వస్తారు అంటూ తిడుతుంటే.. రాజు కోపంగా నిన్ను గుద్దడానికి నాకేం పని లేదనుకున్నావా..? అనగానే.. ఇందు కోపంగా పని ఉంటే ఈ పనికిమాలిన పని ఎందుకు చేస్తావు.. అంటుంది. దీంతో బుద్ది లేక అని రాజు చెప్పగానే.. అది నువ్వు మాట్లాడిన మొదటిరోజే అర్థం అయింది అంటుంది ఇందు. ఇన్ని మాట్లాడుతున్నావు కదా మరి నువ్వు ఏం చేశావు.. దేశంలో ఇన్ని బైకులు ఉంటే నా బైకే దొరికిందా అడ్డుగా రావడానికి అనగానే..

Advertisement

ఇందు కూడా నేను అదే అడుగుతున్నాను.. దేశంలో ఇన్ని కోట్ల మంది ఉండగా నువ్వు గుద్దడానికి నేనే దొరికానా..? అనగానే.. రాజు కోపంగా నువ్వు పెద్ద అప్సరస అని వెతుక్కుంటూ వచ్చి గుద్దడానికి అనగానే.. ఇందు కూడా నువ్వేమైనా మైసూర్‌ మహారాజువా..? నిన్ను వెతుక్కుంటూ అడ్డుగా రావడానికి అనగానే.. రాజు కోపంగా అయితే మైసూర్‌ మహారాజు అయితే అడ్డుగా వచ్చేస్తావా..? అనగానే.. అప్సరస అయితే నువ్వు గుద్దేస్తావా..? అంటుంది. దీంతో రాజు కోపంగా ఏయ్‌ ఇప్పుడు ఏమంటావు.. అనగానే.. ఇందు కోపంగా కళ్లు నెత్తిన పెట్టుకుని డ్రైవ్‌ చేయకూడదు అంటున్నా అనగానే.. రాజు సరే నాకు కళ్లు లేవు.. నీకు ఉన్నాయిగా నువ్వు చూసి రావొచ్చుగా అనగానే.. ఇందు కోపంగా చూడు చూడకుండా వచ్చి గుద్దింది నువ్వు అనగానే.. రాజు కోప్పడగానే.. ఇందు కోపంగా ఏయ్‌ అంటూ అరవగానే.. లక్కీ కల్పించుకుని మేడం ఆగండి మేడం బుద్ది ఉన్నోడు ఎవడైనా మీ గురించి తెలిశాక అస్తమానం గొడవపడాలి అనుకుంటాడా..? అనగానే.. రాజు బుద్ది లేకున్నా కరెక్టు మాట చెప్పావురా..? అంటాడు.

దీంతో ఇందు కోపంగా అంటే ఏంటి నీ ఉద్దేశం చూడగానే… ఏం లేదు మేడం పడింది కూరగాయలేగా.. అవి ఏరుకుంటే సరిపోతుంది కదా అనగానే.. అంటే అవి కూడా నేనే ఏరుకోవాలా అనగానే.. లక్కీ లేదు మేడం నేను ఏరిస్తాను అంటూ లక్కీ కూరగాయలు ఏరుతుంటే… రాజు, ఇందును చూస్తుంటాడు. ఇంతలో లక్కీ కూరగాయలు ఏరి ఇవ్వగానే.. ఆ కింద పడ్డ కూరగాయలు  నాకు ఏమీ వద్దు కొత్తవి కావాలి అని చెప్పగానే.. రాజు, లక్కీ వెళ్లి ఫ్రెష్‌గా కూరగాయలు కొంటుంటారు. ఇందు పక్కనే నిలబడి చూస్తుంది. ఇందు కోపంగా హలో సరిగ్గా చూసి వేయండి.. ఒక్క పుచ్చు ఉన్నా ఊరుకోను అని చెప్పగానే.. లక్కీ ఒక్క పుచ్చు కూడా లేకుండా కూరగాయలు కొనే మీ డెడికేషన్‌కు హాట్సాప్‌ మేడం అనగానే.. ఇందుకోపంగా ముందు పని చూడు నాకు టైం లేదు అనగానే.. రాజు వాచ్‌ ఉందిగా అంటాడు.. దీంతో ఇందు కోపంగా నాకు కుళ్లిపోయిన కూరగాయలే కాదు.. కుళ్లు జోకులు అన్నా కోపం అంటుంది.  దీంతో సైలెంటుగా కూరగాయలుకొనిచ్చి వెళ్లిపోతారు..

Advertisement

మరోవైపు నందు తరుముతూ వచ్చిన రౌడీ పరుగెత్తుకుంటూ వెళ్లి తన దగ్గర ఉన్న బ్యాగు పోలీసులకు దొరకకుండా చేయాలని రాజు బైకు మీద వస్తుంటే.. చెస్ట్‌ ఫెయిన్‌ వచ్చినట్టు నటిస్తూ.. రాజు, లక్కీలకు ఎదురుపడతాడు.  తనకు చెస్ట్‌ ఫెయిన్‌ వస్తుందని ఈ  బ్యాగు తాను చెప్పిన చోట ఇస్తే పది వేలు ఇస్తానని చెప్పగానే..రాజు, లక్కీ ఎగిరి గంతేస్తారు. డబ్బులు తీసుకుని బ్యాగు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. వెనకాలే పోలీసులతో  వచ్చిన నందు వాడిని పట్టుకుని వెళ్లిపోతారు. వాడి దగ్గర బ్యాగు లేకపోవడంతో పోలీసులు రాజు వాళ్ల బైక్‌ను ఫాలో అవుతుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×