E-Paper
Advertisement

Neem face pack: మొటిమల కోసం వేపతో ఫేస్ ప్యాక్.. క్షణాల్లోనే రిజల్ట్

Neem face pack: మొటిమల కోసం వేపతో ఫేస్ ప్యాక్.. క్షణాల్లోనే రిజల్ట్
Advertisement

Neem face pack: మొటిమలు అనేవి దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సమస్య. దుమ్ము, కాలుష్యం ,మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా, చర్మం తన కాంతిని కోల్పోయి, మొండి మొటిమలు ముఖాన్ని ఆక్రమిస్తాయి. ఇలాంటి పరిస్థితులలో.. వేప ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి.

వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపి, మొటిమల మచ్చలను తగ్గించడంలో సహాయ పడతాయి. మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల నాలుగు బెస్ట్ వేప ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం.

Advertisement

1.వేప, పసుపు ఫేస్ ప్యాక్ :
వేప, పసుపు రెండూ వాటి ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ప్యాక్ ముఖ్యంగా ముఖంపై ఎర్రగా, నొప్పిగా ఉండే మొటిమలు ఉన్నవారికి చాలా అనువైంది.

తయారుచేసే విధానం: ఒక టేబుల్ స్పూన్ వేప ఆకు పొడి తీసుకుని, దానికి చిటికెడు పసుపు కలపండి. కొద్దిగా నీరు లేదా రోజ్ వాటర్ కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోండి. దీనిని మీ ముఖంపై ఉన్న మొటిమలపై పూసి, 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. పసుపు వాపును తగ్గిస్తుంది , వేప ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది.

Advertisement

2. వేప, ముల్తానీ మట్టి:
మీది అత్యంత జిడ్డు చర్మం అయితే, ముల్తానీ మట్టిని వేపతో కలిపి వాడటం అద్భుతంగా పని చేస్తుంది. ఈ ప్యాక్ చర్మ రంధ్రాల నుంచి అదనపు జిడ్డును పీల్చుకుని, చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది.

తయారుచేసే విధానం: ఒక స్పూన్ ముల్తానీ మట్టి, ఒక టీస్పూన్ వేప పొడి , రోజ్ వాటర్‌ను పేస్ట్ లాగా కలపండి. ఈ పేస్ట్‌ను మీ ముఖమంతా అప్లై చేయండి. ఆరిన తర్వాత, మామూలు నీటితో శుభ్రం చేయండి. ఇది ముఖంపై నూనెను నియంత్రించడానికి అంతే కాకుండా కొత్త మొటిమలు రాకుండా నివారించడానికి సహాయ పడుతుంది.

3. వేప , కలబంద ఫేస్ ప్యాక్ : కొన్నిసార్లు మొటిమల వల్ల చర్మం పొడిబారి, కాంతి హీనంగా మారుతుంది. కలబంద చర్మానికి తేమను అందించి, మొటిమలను నయం చేయడంలో సహాయ పడుతుంది.

Also Read: తక్కువ టైంలో ఎక్కువ బరువు తగ్గారా ? అయితే ఈ సమస్యలు గ్యారంటీ

తయారుచేసే విధానం: తాజా కలబంద జెల్ తీసుకుని.. దానిలో 1 టీస్పూన్ వేప పొడి కలపండి. ఈ మిశ్రమంతో మీ ముఖాన్ని 2-3 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి, ఆ తర్వాత 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఈ ప్యాక్ మొటిమల మచ్చలను తొలగించడానికి అద్భుతంగా పని చేస్తుంది.

4.వేప, పెరుగు ఫేస్ ప్యాక్ : పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా వేప ముఖంపై మలినాలను తొలగిస్తుంది. ఈ ప్యాక్ చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి కూడా సహాయ పడుతుంది.

తయారుచేసే విధానం: ఒక టేబుల్ స్పూన్ వేప పేస్ట్‌ను ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగుతో కలపండి. దీనిని మీ ముఖానికి రాసుకుని ఆరనివ్వండి. పెరుగులోని చల్లదనం మొటిమల చికాకును తగ్గించి.. మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×