E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన ఇందు – నవ్వుకున్న రాజు  

Brahmamudi Serial Today Episode June 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన ఇందు – నవ్వుకున్న రాజు  
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు ఇక నుంచి తమ మాట వింటుందో లేదోనని భ్రమరాంబ, భూషణ్‌ కంగారుపడుతుంటారు. శేషు మాత్రం మీరే కాదు చెల్లెమ్మ కూడా అదే కంగారు పడుతుంది అంటూ చెప్పగానే.. రేఖ కోపంగా బుద్దుందా మీకు.. మీ నోరు కాస్త అదుపులో పెట్టుకోండి.. ఆ రేఖ ఎప్పటికీ తోక జాడించడదు.. ఇక ఆ రాజు గాడిని ఏం చేయాలో అది చేస్తాను. కంపెనీ సీఈవో మాత్రమే మారింది. అంతే కానీ కంపెనీలో కానీ ఈ ఇంట్లో కానీ అందరూ ఈ రేఖ చెప్పిందే తూచా తప్పకుండా పాటిస్తారు. ఆ విషయం మీకు ఈ రోజే అర్థం అవుతుంది అని చెప్పగానే.. శేషు మాత్రం మనసులో మాకు కాదు నీకే అర్థం అవుతుంది. అక్కడ అల్లుడు ఎంట్రీతో ఫర్మామెన్స్‌ అదరగొడతాడు. మీరు నవ్వుకుంటూ వెళ్లి ఏడ్చుకుంటూ వస్తారు. జరిగేది ఇదే అనుకుంటాడు.

నందు స్కూటీ మీద వెళ్తుంటే.. స్కూటీ ఫంశ్చర్‌ అవుతుంది. వెంటనే వెంకట్‌కు మెసేజ్‌ చేస్తుంది. వెంకట్‌ రిప్లై ఇవ్వడు.. వెంటనే ఫోన్‌ చేస్తుంది. మెసేజ్‌ పెట్టినా రిప్లై లేదేంటి..? అనగానే.. ఈ డెలివరీ బాయ్‌ జాబ్‌ జాయిన్‌ అయ్యాక మెసేజ్‌ కాదు కదా కనీసం ఫోన్‌ చూసే టైం కూడా లేదు.. ఏంటో చెప్పు అనగానే.. నందు జరిగింది చెప్పాక వెంకట్ ఇప్పుడే వస్తున్నాను అంటూ నందు దగ్గరకు వెళ్తాడు. నందును పికప్‌ చేసుకుని డెలివరీ ఇవ్వడానికి వెళ్తారు.

Advertisement

ఇందు ఆఫీసులో తాము కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీటింగ్‌ పెడుతుంది. అందులో కాంట్రాక్ట్‌ ఇచ్చిన వ్యక్తి తాము వంద టెంపుల్స్‌ లో దేవతల విగ్రహాలకు కావాల్సిన నగల తయారీ కాంట్రాక్ట్‌ మీకే ఇస్తున్నామని.. మేము అనుకున్నట్టు ట్రెడీషనల్‌ నగలు చేసి ఇస్తే.. మిగతా కాంట్రాక్ట్‌ కూడా మీకే ఇస్తామని చెప్తాడు. దీంతో రాజు, రేఖ, ఇందు చాలా హ్యాపీగా ఫీలవుతారు. దీంతో రాజు చాలా ఎక్స్‌ట్రా మాట్లాడుతుంటే.. ఇందు నోరు మూసుకోమని ఉండమని చెప్పి ఎలాంటి డిజైన్స్‌ కావాలో చెప్పండి అని అడుగుతుంది. ఆ కాంట్రాక్టర్‌ తమకు కావాల్సిన డిజైన్స్‌ మొత్తం ఇందుకు ఇస్తాడు. ఆవి ఇందు చూస్తుంటుంది. రేఖ మాత్రం భూషణ్‌తో ఇతను ఏదో చిన్న కాంట్రాక్ట్‌ ఇస్తాడనుకున్నాను కానీ ఇంత పెద్ద కాంట్రాక్ట్‌ ఇస్తాడనుకోలేదు అని చెప్తే.. భూషణ్‌ వీడికి చాలా పెద్ద బిజినెస్‌ నెట్‌వర్క్‌ ఉన్నట్టు ఉంది రేఖ అని చెప్పగానే.. రేఖ వీడిని మనం గ్రిప్పులో పెట్టుకుంటే మనకు చాలా బిజినెస్‌ వస్తుంది అని అనుకుంటుండగానే..

కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ మీద సంతకం చేయండని… అగ్రిమెంట్‌ పేపర్స్‌ ఇందుకు ఇస్తాడు. అవి ఇందు చదువుతుంటే.. రేఖ షాక్ అవుతుంది. భూషణ్ రేఖ అది నిజం కాదు చదివినట్టు బిల్డప్‌ ఇస్తుంది అంటాడు. రాజు మాత్రం అది నిజంగానే చదువుతుంది.. కొద్ది నిమిషాల్లో మీకో షాక్‌ తగులుతుంది అని మనసులో అనుకుంటాడు. ఇంతలో కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ పేపర్స్‌ మీద సంతకం చేయండి అని చెప్పగానే.. ఇందు పెన్ను తీసుకుని సంతకం చేస్తుంది. అది చూసిన రేఖ, భూషణ్‌ షాక్ అవుతారు. రాజు నవ్వుతుంటాడు. చెప్పా కదా మైండ్‌ దొబ్బుది అని రేఖ హార్ట్‌ బ్రేక్‌ అయ్యి ఉంటుంది అనుకుంటాడు. భూషణ్‌ మాత్రం ఇందు ఎలా సైన్‌ చేస్తుంది. తనకు చదవడం కూడా వస్తుందా..? అని అడగ్గానే.. అది ప్లే స్కూల్‌కు కూడా వెళ్లలేదు కదా..? అయినా క్లయింట్‌ ముందు కాదు తర్వాత అడుగుదాం అంటుంది రేఖ.

Advertisement

ఇంతలో క్లయింట్‌ అడ్వాన్స్‌గా 50లక్షలు ఇచ్చి వర్క్‌ స్టార్ట్ చేయమని చెప్పి వెళ్లిపోతాడు. రేఖ వెంటనే ఆ డబ్బులు నేను హ్యాండిల్‌ చేస్తాను అంటూ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తే.. రాజు అడ్డుపడతాడు. ఈ డబ్బులు నేను మేనేజ్‌ చేస్తాను ఇవ్వు అనగానే.. ఇందు ఇద్దరిని తిట్టి ఇప్పుడు మన కంపనీ ఎంప్లాయీస్‌కు సాలరీ ఇవ్వాలి అంటూ డబ్బులు తీసుకుని ఇందు వెళ్లిపోతుంది. భూషణ్‌ చూడు రేఖ డబ్బులు రాగానే ఎలా మారిపోయింది. ఇక నిన్ను నన్ను ఎవ్వరూ పట్టించుకోరు అంటూ బాధపడుతుంటాడు. అయినా తను ఎలా సైన్‌ చేసింది. ఇంత సడెన్‌గా సీఈవో అవ్వగానే సైన్‌ ఎలా చేసింది అంటూ ప్రశ్నిస్తుంటే.. ఆ విషయం ఇంటికి వెళ్లి తెలుసుకుందాం పద అంటూ ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.

వెంకట్‌ డెలివరీ తీసుకుని వెళ్లి డెలివరీ ఇస్తుంటే.. వెంకట్‌ మాజీ లవర్‌ వస్తుంది. వెంకట్‌ను గోరంగా తిడుతుంది. తన మాటలతో అవమానిస్తుంది. నిన్ను నేను ప్రేమించి ఉంటే నీతో పాటు నేను కూడా ఇలా డెలివరీలు ఇస్తూ ఉండేదాన్ని అంటూ అవమానిస్తుంది. దీంతో నందు కోపంగా ఆమెను తిట్టి అక్కడి నుంచి వెంకట్‌ను తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు ఆఫీసులో ఇందు అందరూ ఎంప్లాయీస్‌ను పిలిచి ఎవరెవరికి ఎంత శాలరీ ఇవ్వాలో తెలుసుకుని అందరికీ మొత్తం శాలరీలు ఇచ్చేస్తుంది. దీంతో ఎంప్లాయీస్‌ హ్యాపీగా ఫీలవుతారు. రేఖ, భూషణ్‌ షాకింగ్‌గా చూస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×