// // Cyber Attacks: సైబర్‌దాడులు తీవ్రతరం వ్యాపారవేత్తల్లో వణుకు, బజాజ్ ఆటో వంతు -->
E-Paper
Advertisement

దేశంలో సైబర్‌ దాడులు తీవ్రతరం.. వ్యాపారవేత్తల్లో వణుకు, బజాజ్ ఆటో వంతు

దేశంలో సైబర్‌ దాడులు తీవ్రతరం.. వ్యాపారవేత్తల్లో వణుకు,  బజాజ్ ఆటో వంతు
Advertisement

Cyber Attacks:  ప్రపంచంలోని వ్యాపారవేత్తలు భారత్ వైపు చూస్తున్నారా? వారిని అడ్డుకట్టే వేసేందుకు ప్రత్యర్థులు కొత్త స్కెచ్ వేస్తున్నారా? ఆయా దేశాల కంపెనీలపై సైబర్ దాడులు తీవ్రమయ్యాయా? నిన్న టాటా కాగా, నేడు బజాజ్ ఆటో వంతైంది. దేశంలో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అంత బలహీనంగా ఉందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

దేశంలో సైబర్ దాడులు తీవ్రతరం.. బజాజ్ ఆటో సంస్థ వంతు

Advertisement

భారత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, దాని అనుబంధ బజాజ్ ఆటో టెక్నాలజీ లిమిటెడ్-BATL సిస్టమ్‌లపై సైబర్ దాడులు జరిగాయి. రాన్సమ్‌వేర్ దాడి చేసినట్టు మంగళవారం వెల్లడించింది సదరు కంపెనీ. దేశంలోని వ్యాపార దిగ్గజాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ కంపెనీలపై సైబర్ దాడులు జరగడంతో ఏం జరుగుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది.

జూన్ 23 అంటే మంగళవారం ఉదయం 8 గంటలకు సైబర్‌ దాడి జరిగినట్టు గుర్తించారు. సైబర్ దాడిని గుర్తించిన వెంటనే కంపెనీ అంతర్గత సాంకేతిక టీమ్ అలర్ట్ అయ్యింది. వెంటనే చర్యలు చేపట్టడంతో నష్టాన్ని అరికట్టగలిగామని కంపెనీ అధికారికంగా తెలిపింది.

Advertisement

ఆటో సెక్టార్ వ్యాపారుల్లో వణుకు మొదలు,  బయటపడిన లోపాలు

సైబర్ దాడుల నుండి వ్యవస్థలను కాపాడినప్పటికీ కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు ఏమైనా అంతరాయం కలిగిందా అనే విషయాన్ని వెల్లడించలేదు. ఆ కంపెనీకి చెందిన కీలకమైన సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కిందా? లేదా? దాడుల వల్ల సరఫరా గొలుసులు ప్రభావితం అయ్యిందా? అనే విషయాలను ఆ కంపెనీ చెప్పలేదు.

ఐటీ చట్టాల నిబంధనలను ప్రకారం.. సైబర్ దాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వ అధికారిక సైబర్ భద్రతా విభాగమైన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు అధికారికంగా తెలిపింది బజాజ్ ఆటో సంస్థ. పెద్ద సంస్థలపై దాడులు జరిగిన వెంటనే రిపోర్ట్ చేయడంతో దేశంలోని మిగతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

ALSO READ: జియో సంచలనం.. రూ.800 లోపే లైవ్ లొకేషన్ ట్రాకింగ్, యూపీఐ పేమెంట్స్ ఉన్న 4G ఫోన్!

బజాజ్ ఆటో సంస్థపై జరిగిన దాడి దేశంలో పారిశ్రామిక తయారీదారులు, ముఖ్యంగా ఆటో రంగాన్ని లక్ష్యంగా చేసుకుని రాన్సమ్‌వేర్ దాడులు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దేశంలోని అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, మూడు చక్రాల వాణిజ్య వాహనాల ఉత్పత్తిదారుల్లో బజాజ్ ఆటో సంస్థ ఒకటి.

దాని ఐటీ మౌలిక సదుపాయాలకు ఏమైనా అంతరాయాలు ఏర్పడితే సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వరుసగా ఆటో రంగాన్ని టార్గెట్ చేస్తూ జరుగుతున్న దాడులు సైబర్ సెక్యూరిటీ లోపాలను బట్టబయలు చేస్తోంది. ప్రపంచ డిజిటల్ రంగానికి కేరాఫ్‌గా మారుతున్న భారత్‌లో సైబర్ ఆందోళన కలిగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×