E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖను తీసుకెళ్లి నిజం చూపించిన ఐశ్వర్య  

Brahmamudi Serial Today Episode June 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖను తీసుకెళ్లి నిజం చూపించిన ఐశ్వర్య  
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు, రాజు ఇద్దరూ పార్టీ గురించి మాట్లాడుకుంటూ గొడవపడతారు. గొడవలో ఇందు రాజును ఏరా అంటుంది. రాజు ఇందును పోయే అంటాడు. ఇద్దరూ ఘోరంగా తిట్టుకుంటుంటే.. ఐశ్వర్య వచ్చి చూసి ఆశ్చర్యపోతుంది. వీళ్లిద్దరి మధ్య ఏదో సీక్రెట్‌ ఉంది అనుకుంటూ వెంటనే ఆంటీకి చెప్పాలి. ఇక్కడ జరుగుతున్నదేంటో చూపించాలి. అప్పుడు వీళ్ల అసలు మ్యాటర్‌ ఏంటో బయటపడుతుంది అనుకుంటూ ఐశ్వర్య పరుగెత్తుకుంటూ రేఖ దగ్గరకు వెళ్తుంది. మనల్ని ఆ రాజు ఇందు మోసం చేస్తున్నారు ఆంటీ. మీకు ఈ విషయం తెలియక ఆ ఇందును మీరు సీఈవోను చేశారు. అది మామూలుది కాదు అని చెప్పగానే..

రేఖ ఏంటి ఐషు ఇది నేను అసలే చాలా ఇరిటేషన్‌లో ఉన్నాను. ఏదో అనవసరమైన టెన్షన్‌లో ఉన్నాను అని చెప్పగానే.. అసలు వాళ్లు ఇద్దరు భార్యాభర్తలేనా అని అనుమానంగా ఉంది. వాళ్లు భార్యాభర్తలుగా నటిస్తున్నారేమో అని డౌటుగా ఉంది అని చెప్పగానే.. నటించాల్సిన అవసరం వాళ్లకేంటి అంటూ రేఖ అడుగుతుంది. అది నాకేం తెలుసు వాళ్లకే తెలియాలి అంటుంది ఐశ్వర్య. దీంతో రేఖ వాళ్లిద్దరికీ నిజంగానే పెళ్లి అయింది అని చెప్పగానే.. అయితే కొత్తగా పెళ్లైనా భార్యాభర్తలు ఎలా ఉంటారు.. ఇద్దరూ కలిసి ఒకే బెడ్‌ మీద పడుకుంటారు కదా..? అని ఐశ్వర్య అడగ్గానే.. రేఖ కోపంగా ఏయ్‌ నీకేమైనా మతి ఉందా..? అసలు వాళ్ల సంసారం గురించి నాకెందుకు చెప్తున్నావు అంటూ తిడుతుంది. అయినా ఐశ్వర్య వినకుండా రేఖను ఇందు రూంలోకి తీసుకెళ్తుంది. అక్కడ అంతా మామూలుగానే ఉంటుంది. రూంలో ఇందు, రాజు ఉండరు.. ఇద్దరూ గార్డెన్‌లో ఉంటారు. రేఖ ఇక్కడేం లేదు అయినా వీళ్ల గురించి నీకెందుకు వెళ్లి పడుకో అంటుంది రేఖ.

Advertisement

ఇంతలో గార్డెన్‌లోంచి రాజు మాటలు వినిపిస్తే.. వాళ్లు గార్డెన్‌లో ఉన్నట్టున్నారు..? చూడండి అంటుంది. గార్డెన్‌లో కూర్చున్న ఇందును రాజు ఏదో విషయం గురించి బతిమాలుతుంటాడు. అది గమనించిన రేఖ కోపంగా ఐశ్వర్యను తిడుతుంది.  వాళ్లిద్దరు ఏదో పర్సనల్‌ విషయం మాట్లాడుకుంటుంటే నువ్వేదో అపార్థం చేసుకున్నావు అంటూ తిట్టగానే.. ఐశ్వర్య ఇంకెంచెం ఆగండి ఆంటీ అసలు విషయం తెలుస్తుంది అని చెప్పగానే.. రేఖ అలాగే చూస్తూ ఉంటుంది. కింద రాజు మాత్రం ఇందును బతిమాలుతుంటే.. ఇందు కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అది చూసి రేఖ కోపంగా ఐశ్వర్యను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తర్వాత ఐశ్వర్య లక్కీకి ఫోన్‌ చేస్తుంది. ఒకసారి అర్జెంట్‌గా కలవాలని చెప్తుంది. దీంతో లక్కీ హ్యాపీగా ఇదే కదా నేను నీ నుంచి కోరుకునేది ఇంతకీ ఎక్కడికి రావాలి అని లక్కీ అడగ్గానే… ఐశ్వర్య నేను నీకొక లొకేషన్‌ షేర్‌ చేస్తాను అక్కడికి వచ్చేయ్‌ అని చెప్తుంది. లక్కీ సరే అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. కట్‌ చేస్తే.. ఇద్దరూ ఒక ప్లేస్‌లో కలుసుకుంటారు. లక్కీ, ఐశ్వర్యను చూసి వంకరటింకర తిరుగుతుంటాడు. రాజు, ఇందుల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడితో కొంచెం ప్రేమగా ఉన్నట్టు నటించాలి అని మనసులో అనుకుంటూ.. ఇందును కిడ్నాప్‌ చేసిన తర్వాత ఏం జరిగింది అని ఐశ్వర్య అడిగితే ఏం జరిగింది మాకు ఇందు వండిపెట్టేది. మేం తినేవాళ్లం అని చెప్పగానే.. అంతేనా మరి అలాంటి వాళ్లు ఎలా పెళ్లి చేసుకున్నారు అని అడగ్గానే.. నాకు కూడా అర్థం కాలేదు.. అసలు ఎవడో చెబితే నాకు కూడా వాళ్ల పెళ్లి విషయం తెలిసింది అనగానే..

Advertisement

వీడికి కూడా నిజం తెలియదు.. కానీ వాళ్లది నాటకం అని మాత్రం అర్థం అవుతుంది. కానీ ఎలా ఫ్రూవ్‌ చేయాలి అని మనసులో అనుకుంటుంది ఐశ్వర్య. లక్కీని మాటల్లో పెట్టి ఇందును రాజు ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకుని తనకు చెప్పాలని అడుగుతుంది. లక్కీ తెలుసుకుంటానని వెంటనే రాజుకు ఫోన్‌ చేస్తాడు లక్కీ. వెంటనే ఇద్దరం కలుద్దామని సిట్టింగ్‌ వేద్దామని చెప్తాడు. రాజు హ్యాపీగా ఇప్పుడే వస్తున్నాను మామ అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. మరోవైపు డెలివరీ జాబ్‌ కంప్లీట్‌ చేసుకుని ఇంటికి వెళ్తాడు వెంకట్‌. అందరూ కలిసి భోజనం చేస్తుంటే.. కందిపోయిన వెంకట్‌ కాళ్లు చూసి చలపతి, లక్ష్మీ భయపడతారు. అసలు నువ్వు సాప్ట్‌వేర్‌ జాబే చేస్తున్నావా..? అంటూ అడగ్గానే.. వెంకట్‌ షాక్‌ అవుతాడు. అదేం లేదని చెప్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×