E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు దిష్టి తీసిన అపర్ణ – నవ్వుకున్న రేఖ  

Brahmamudi Serial Today Episode June 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు దిష్టి తీసిన అపర్ణ – నవ్వుకున్న రేఖ  
Advertisement

Brahmamudi serial today Episode: నందు, వెంకట్‌ను ఒక రెస్టారెంట్‌ ఓనర్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఫుడ్‌ డెలివరీ జాబ్‌ ఇవ్వమని అడుగుతుంది. దీంతో ఆ రెస్టారెంట్‌ ఓనరు వెంకట్‌ను పరిశీలించి.. ఫుడ్‌ డెలివరీలో ఉండే కష్టాలు, నష్టాలు చెబుతూ.. కస్టమర్స్‌ను సాటిఫై చేయాలని చెప్తాడు. మరీ ముఖ్యంగా బైక్‌ ఉండాలని చెప్తాడు. దీంతో కష్టపడి పని చేస్తానని.. తనకు బైక్‌ ఉందని వెంకట్‌ చెప్పగానే.. ఆ ఓనరు నీ మాటలు చూస్తుంటే.. నువ్వు పని చేసేలా లేవు అని చెప్పగానే… నందు చేస్తాడు అంకుల్‌ మరేం వర్రీ అవ్వొద్దు అని చెప్తుంది. జీతభత్యాలు మాట్లాడిన తర్వాత రేపు వచ్చి జాయిన్‌ అవ్వమని ఓనరు చెబితే సరే అంటూ నందు, వెంకట్‌ వెళ్లిపోతారు.

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన రాజు, ఇందులకు అపర్ణ హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంది. ఇందు నాన్నమ్మ ఇవ్వని ఎందుకు అని అడగ్గానే.. ఫస్ట్‌ టైం నువ్వు మన కంపెనీ సీఈవో అయ్యావు ఎంత మంది కళ్లు నీ మీద పడి దిష్టి తగిలిందో అందుకే దిష్టి తీస్తున్నాను అని చెప్పగానే.. శేషు కూడా అవును అవును ఇంట్లో వాళ్ల కళ్లు, బయటి వాళ్ల కళ్లు పడి ఉంటాయి అనగానే.. రేఖ కోపంగా చూస్తుంది. రాజు కూడా వెటకారంగా ఇందు సీఈవో అయిందని కొంతమంది కుళ్లుకుని చస్తుంటారు. అమ్మమ్మ నా భార్యకు దిష్టి తీయండి అంటాడు. అపర్ణ దిష్టి తీస్తుంది. రేఖ మాత్రం భ్రమరాంబతో చూశావా…? వదిన ఈ ఇందును మనం సీఈవోను చేశామన్న విషయం తెలియక పొంగిపోతుంది. అయినా కొద్దిసేపు సంతోషపడనిలే అంటూ చెప్తుంది.

Advertisement

అపర్ణ మాత్రం ఇందును కంపెనీ నష్టాల్లో నడవడం తనకు ఇష్టం లేదని కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్తుంది. రాజు కచ్చితంగా కంపెనీ లాభాల్లోకి వస్తుందని తాను ఉండగా ఇందు కంపెనీని జెట్‌ స్పీడుతో నడిపిస్తుందని చెప్తాడు. దీంతో భ్రమరాంబ వెటకారంగా పరుగెట్టిస్తావో.. పల్టీ కొట్టిస్తావో ముందు ఈ విషయం చెప్పు.. నువ్వు సీఈవోగా ట్రై చేశావట కదా అని అడగ్గానే.. అవును అత్త కానీ ఒక్క ఓటుతో ఓడిపోయాను.. అది రేఖ పిన్ని వల్లే అంటూ రాజు చెప్తుంటే.. రేఖ మాత్రం తనను తాను గొప్పగా ఆలోచిస్తుంది. అప్పుడే పై నుంచి వచ్చిన ఐశ్వర్య తాను చేసిన ప్లాన్‌ మొత్తం బెడిసికొట్టి ఇందు సీఈవో అయిపోయింది అని బాధపడుతుంది. రాజు మాత్రం రేఖ పిన్ని టాలెంట్‌ ఈరోజే తనకు తెలిసిందని తనకు నేను ఈరోజు నుంచి పెద్ద ఫ్యాన్‌.. అందుకే ఈరోజు నుంచి నేను తన అడుగుజాడల్లో నడుస్తానని చెప్తాడు. దీంతో శేషు గట్టిగా అల్లుడు నువ్వు మా రేఖ అడుగుజాడల్లో నడవడం ఏంటి..? అని అడగ్గానే… రాజు కొన్నిసార్లు మనం అడ్జస్ట్‌ అవ్వాల్సిందే.. అని చెప్తాడు. దీంతో శేషు ఓకే అల్లుడు నువ్వు ఏదంటే అది నీకంటూ ఒక గురి ఉంటుంది. అది ఏదో ఒకరోజు గురి తప్పదని ఆశిస్తున్నాను అని చెప్పగానే..

రాజు మాత్రం రేఖ పిన్ని నుంచి నేర్చుకున్న విద్యలేంటో.. మీకు త్వరలోనే చూపిస్తాను అంటూ చెప్పగానే.. రేఖ కోపంగా రాజు అనవసరంగా వాగకు అనగానే.. రాజు కోపంగా రేఖకు వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో శేషు కూడా చెల్లెమ్మ అల్లుడితో నీకెందుకు చెప్పు.. ఇంకా రెచ్చగొడితే ప్రాబ్లమ్‌ మనకే కదా..? అని చెప్తాడు. అలా చెప్పు మామయ్య మీ చెల్లికి అంటూ చెప్తుండగానే.. రేఖ.. ఇందు నేను నీకొక పేపర్‌ పంపిస్తాను అందులో ఒక సైన్‌ చేయ్‌ అంటుంది. ఇందు సరేలే ఆంటీ చేస్తాను అనగానే.. రేఖ అనుమానంగా నీకు సైన్‌ రాదు కదా ఎలా చేస్తావు అని అడగ్గానే.. ఇందు కంగారుపడుతుంది. రాజు మాత్రం ఇందు దృష్టిలో సైన్‌ అంటే వేలిముద్ర వేయడమే అని చెప్పగానే.. సరే పేపరు పంపిస్తాను వేలిముద్ర వేయ్‌ అని చెప్పగానే.. ఇందు అమాయకంగా అలాగే ఆంటీ మీరు ఎక్కడ వేలిముద్ర వేయమంటే అక్కడ వేస్తాను.. అని చెప్పగానే.. రేఖ అపర్ణ ఆంటీ విన్నారా..? ఇప్పుడు చెప్పు ఎవరు సీఈవో అని అడగ్గానే.. భ్రమరాంబ నువ్వే రేఖ అంటూ చెప్పగానే.. రేఖ వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత రూంలోకి వెళ్లగానే.. అపర్ణ కోపంగా ఇందును తిడుతుంది. ఇందుకేనా నువ్వు సీఈవో అయింది. ఆ రేఖ చేతిలో కీలుబొమ్మలా మారతావని అనుకోలేదు అంటూ ఎమోషనల్ అవుతుంది. దీంతో రాజు మాత్రం మీరేం భయపడొద్దు అంటూ అన్ని ఒక్కొక్కటిగా జరుగుతాయి అంటూ చెప్తాడు. కానీ అపర్ణ ఎమోషనల్ అవుతుంది. రేఖ గురించి నీకు పూర్తిగా తెలియదు. ఇదే మంచి చాన్స్‌ ఇది మిస్‌ చేసుకుంది. అసలే నా మనవరాలు అమాయకురాలు అంటూ చెప్పగానే.. రాజు నవ్వుతూ అమ్మమ్మ మీ మనవరాలు అమాయకురాలు అంటే నవ్వొస్తుంది. మీరు తనని ఒకవైపే చూశారు. రెండో వైపు చూడలేదు.. అంటూ ఇందు గురించి చెప్తుంటాడు రాజు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×