E-Paper
Advertisement

ఇష్టంలేని పెళ్లి… కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్… పెళ్ళయిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ

ఇష్టంలేని పెళ్లి… కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్… పెళ్ళయిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ
Advertisement

Feel Good Telugu Series : మనసుకు హత్తుకునే ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా – పెళ్లి అవ్వగానే ప్రేమ పుడుతుందా? ఎవరో తెలియకుండా పక్కనే పడుకొని కాపురం చేస్తామా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కథలు టాలీవుడ్‌లో కాస్త ఎక్కువే వచ్చాయి. వీటిలో ఏ సినిమా స్టైల్‌ ఆ సినిమాకి ఉండగా… ఇటివల కాలంలో వెబ్‌సిరీస్‌ల్లో కూడా ఇదే తరహా కథలు వస్తున్నాయి. అందులో మనసుకు హత్తుకునే ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా కథే ‘జస్ట్ మ్యారీడ్‌'(Just Married)

సహజ నటనతో మెప్పించారు:

యూట్యూబ్‌లో ఇన్ఫినిటమ్ మీడియా నిర్మించిన ఈ సిరీస్ చిన్న చిన్న ఎపిసోడ్ల రూపంలో విడుదలై భారీ ఆదరణ పొందింది. తర్వాత ఫుల్ మూవీ వెర్షన్‌గా కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రధాన పాత్రల్లో షీటల్ గౌతమన్, రిషి నారాయణ్ నటించారు. వీరిద్దరి సహజమైన నటన, పక్కింటి అబ్బాయి అమ్మాయిలా కనిపించే పాత్రలు ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. ఈ వెబ్‌సిరీస్‌ని వెంకట్ డైరెక్ట్ చేయగా.. కళ్యాణ్.ఎం రచించారు. ఇక ఇన్ఫినిటమ్ మీడియా బ్యానర్ క్రింద వందన బండారు ఈ వెబ్‌సిరీస్‌ను ప్రొడ్యూస్ చేశారు. .ఇన్ఫినిటమ్ మీడియా యూట్యూబ్ ఛానెల్‌లో ఈ సిరీస్‌ ఉచితంగా స్ట్రీమ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

ఆరేంజ్‌ మ్యారెజ్ కపుల్‌ రిఫ్లెక్షన్:

Advertisement

విశ్వ హైదరాబాద్‌లో ఉద్యోగం చేసే సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతనికి వర్క్‌పై ఫోకస్‌ ఎక్కువ. అయితే కుటుంబం ఒత్తిడి కారణంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు. మరోవైపు సుందరి చాలా అమాయకురాలు. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో, కొత్త ఇంట్లో ఎలా కలిసిపోవాలో పెద్దగా తెలియని అమ్మాయి. కుటుంబ సభ్యులు నిర్ణయించిన పెళ్లి తర్వాత ఇద్దరూ భార్యాభర్తలుగా ఒకే ఇంట్లోకి అడుగుపెడతారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. మొదటి రాత్రి మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి, ఒకరి అలవాట్లు మరొకరు అర్థం చేసుకునే దశ వరకు వారి ప్రయాణాన్ని ఎంతో సహజంగా చూపించారు. చిన్న చిన్న అపార్థాలు, సరదా గొడవలు, కొత్త ఇంట్లో సుందరి ఎదుర్కొనే ఇబ్బందులు, ఆఫీస్ ఒత్తిడితో విశ్వ పడే టెన్షన్, బంధువుల సలహాలు, కుటుంబ అంచనాలు అన్నీ కథలో భాగమవుతాయి.

రోజులు గడుస్తూ, మాటలు పెరుగుతూ, అవగాహన ఏర్పడుతూ, స్నేహం ప్రేమగా మారే విధానాన్ని చాలా అందంగా చూపించారు. అందుకే ప్రతి ఎపిసోడ్ చూసేటప్పుడు ఇది మన ఇంట్లో జరిగిన కథలా అనిపిస్తుంది. కామెడీ, ఎమోషన్, రొమాన్స్ లాంటి అంశాలు ఎంత ఉండాలో అంతే ఉండటంతో జస్ట్ మ్యారీడ్ కేవలం వెబ్ సిరీస్‌గా కాకుండా అనేక మంది కొత్త దంపతుల జీవితాలకు అద్దంలా నిలిచింది. ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నవాళ్లు ఈ కథలో తమని తాము చూసుకునే అవకాశముంది. లైట్ హార్టెడ్ రొమాంటిక్ కంటెంట్ ఇష్టపడేవారికి ఇది యూట్యూడ్‌లో ఉన్న అత్యుత్తమ తెలుగు వెబ్ సిరీస్‌లలో ఒకటిగా చెప్పొచ్చు.

Advertisement

Read Also : ‘ఏపెక్స్’ నుండి ‘ది రిప్’ వరకు… 2026లో విడుదలైన 5 కొత్త సస్పెన్స్ థ్రిల్లర్స్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×