E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును తిట్టి  లక్ష్మీని తీసుకుని వెళ్లిపోయిన చలపతి

Brahmamudi Serial Today Episode July 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును తిట్టి  లక్ష్మీని తీసుకుని వెళ్లిపోయిన చలపతి
Advertisement

Brahmamudi serial today Episode: రాజు కోసం చలపతి, లక్ష్మీ దుగ్గిరాల ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకున్నావా..? అంటూ నిలదీస్తారు. రాజు పెళ్లి చేసుకున్నానని చెబితే.. చలపతి, లక్ష్మీ ఎమోషనల్‌ అవుతూ.. ఏడుస్తూ.. రాజును తమతో రమ్మని పిలుస్తారు. రాజు అందుకు ఒప్పుకోడు.. ఇందును పెళ్లి చేసుకున్నానని తనను మధ్యలో వదిలేసి రావడం కరెక్ట్‌ కాదని చెప్తాడు. దీంతో చలపతి నీలాంటి కన్న కొడుకు ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే కోట్ల ఆస్తిని చూడగానే వీడు పూర్తిగా మారిపోయాడు లక్ష్మీ.. మనల్ని బికారొల్లుగా చూస్తున్నాడు అంటూ ఏడుస్తాడు చలపతి.

లక్ష్మీ కూడా ఏడుస్తూ.. ఒరేయ్‌ రాజు నువ్వు లేకుండా మేము ఉండలేమురా మాతో రారా అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది. రాజు ఉలకడు పలకడు.. దీంతో చలపతి ఏడుస్తూనే వాడు రాడు లక్ష్మీ మనిద్దరం వాడి కాళ్లు పట్టుకున్నా రాడు.. ఎందుకంటే వాడికి కావాల్సింది కోట్ల ఆస్తి.. చూడు నువ్వు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఏదో ఒకరోజు తప్పు అని తెలుస్తుంది. కానీ అది తెలుసుకున్న రోజున ఈ తడ్రి నీకు ఉండడురా అంటాడు. దీంతో రాజు మనసులోనే బాధపడుతుంటాడు. చలపతి కోపంగా ఓరేయ్‌ ఇప్పుడు చెప్తున్నాను చూడు నేను చచ్చిన తర్వాత కూడా నువ్వు నాకు తలకొరివి పెట్టడానికి కూడా మా ఇంటికి రాకూడదు అంటూ లక్ష్మీని తీసుకుని వెళ్లిపోతాడు. రాజు మాత్రం బాధగా చూస్తుంటాడు.

Advertisement

ఇంటికి వెళ్లిన తర్వాత లక్ష్మీ, చలపతిని మీరెందుకు అంత ఆవేశంగా మాట్లాడారు.. వాడి మనసు ఎంత గాయపడిందో అని అడగ్గానే.. అలా మాట్లాడితేనైనా వాడు మనసు చంపుకుని వస్తాడేమోనని ఆశతో అలా మాట్లాడాను.. కానీ వాడు ఆ ఇంటికి వదిలి రానంటున్నాడు.. వాడు అక్కడ ఉంటే వాడి ప్రాణాలు పోతాయని కానీ.. వాడు ఆ ఇంటి వారసుడు అని చెప్పలేం.. ఎందుకంటే నిజం తెలియకుండానే వాడు ఆ ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం లేదు.. ఇక నిజం తెలిస్తే. వాడు అసలు రాడు లక్ష్మీ అంటాడు. దీంతో లక్ష్మీ మాత్రం మనం ఎందుకో రాజు విషయంలో తప్పు చేస్తున్నామోననిపిస్తుంది.. అనగానే.. ఏంటి లక్ష్మీ నువ్వు మాట్లాడేది అనగానే.. అవునండి మనం వాడిని ఆ ఇంటికి ఎంత దూరం చేయాలనుకుంటున్నామో వాడు ఆ ఇంటికి అంత దగ్గర అవుతున్నాడు.. ఇదంతా ఆ దేవుడు ఆడించే నాటకంలా ఉంది అంటుంది లక్ష్మీ. కానీ మనం చేసేది వాడి బాగుకోసమే.. వాడు అక్కడే ఉంటే వాడు బతకడు లక్ష్మీ.. వాడు లేకపోతే మనం బతకలేము.. అంటూ చలపతి ఏడుస్తుంటాడు. లక్ష్మీ కూడా ఏడుస్తుంది.

రేఖ, భ్రమరాంబ.. రాజు పర్మినెంట్‌గా ఇంట్లోనే ఉండిపోతాడని ఆలోచిస్తారు. భూషణ్‌ కూడా రాజును ఇలాగే ఉండనిస్తే ఆస్థి మనకు దక్కేలా లేదని.. మనం ఇరవై ఏళ్ల నుంచి ఈ ఆస్థి కోసం ఎదురుచూస్తున్నాము అంటూ చెప్తాడు. దీంతో రేఖ ఎలాగైనా రాజును బయటకు పంపించాలని చెప్తుంది. వాడు డబ్బుల కోసం ఇక్కడే ఉండాలని చూసినా ఇందు ఒప్పుకోదు.. ఇప్పుడు ఇందు ఎమోషనల్‌ అవుతుంది. తన వల్లే రాజు అమ్మా నాన్నలకు బాధ వచ్చింది అనుకుంటుంది. తనే పట్టుపట్టి రాజును ఇక్కడి నుంచి పంపిచేస్తుంది అని చెప్పగానే.. ఐశ్వర్య మాత్రం ఆ ఇందును నువ్వు ఎక్కువ నమ్ముతున్నావు ఆంటీ.. అని చెప్పగానే.. ఒకవేళ ఇందు రాజును పంపించకపోతే.. మనం ఊరుకుంటామా..? ఎలాగోలా రాజును పంపిచేస్తాము అంటంది రేఖ.

Advertisement

రూంలో ఉన్న రాజుతో ఇందు బాధగా మీ అమ్మా నాన్నలను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పగానే.. ఎందుకు నీకు తోడుగా ఉండమని నువ్వు ప్రామిస్‌ చేయించుకున్నావు కదా..? అనగానే.. ఇందు ప్రామిస్‌ చేయించుకున్న నేనే చెప్తున్నాను.. ఇక నువ్వు మీ అమ్మానాన్నల దగ్గరకు వెళ్లిపో అని చెప్తే రాజు ఒప్పుకోడు.. కానీ ఇందు ఏడుస్తూ.. రాజును కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×