E-Paper
Advertisement

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !
Advertisement

Nagabandham Review : ‘పెదకాపు’తో పరిచయమైన మన విరాట్ కర్ణ ఏకంగా పాన్ ఇండియా అని పెద్ద బండనే ఎత్తిండు. అభిషేక్ నామా సార్ తీసిన ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ ట్రైలర్లు చూసి “అబ్బో, విజువల్ వండర్, ఆస్కార్ రేంజ్” అని మనోళ్లు గట్టిగానే మురిసిపోయారు. తీరా థియేటర్ల పోయి చూస్తే… కండ్లకు గూస్‌బంప్స్ ఏమో గానీ, తలకాయకు మాత్రం గట్టిగా బంప్స్ తగిలినయ్!

అసలు ముచ్చట ఏందంటే లేదా ఏం కావాల్నంటే..

కథ:

1960లళ్ల స్టార్ట్ అవుతదట. మన జగపతి బాబు గారికి, ఆయన దోస్తులకు హిమాలయాల్లో ఓ పుస్తకం దొరుకుద్ది. అది చూడంగానే అబ్దాలీ గాడికి ప్రపంచాన్ని ఏలేయాలన్న ఆశ పుట్టుకొస్తది వీడికి వేరే పనేం లేదా భాయ్? దానికి శ్రీరంగనాథ స్వామి బొడ్డుమీద ఉన్న ‘బ్రహ్మకమలం’ కావాలట! అది తెచ్చుకోనీకి కాలవృక్షంలో బందీగా ఉన్న భైరాగితో చేతులు కలుపుతడు.

Advertisement

ఇక వీళ్ల లొల్లికి, గూడెంలో సక్కగా బతుకుతున్న మన హీరో రుద్ర (విరాట్ కర్ణ) ఫ్యామిలీ బలైపోతది. ఇక మనోడు పూనకం వచ్చినోడిలాగా బ్రహ్మకమలాన్ని ఎట్ల తెచ్చిండు? 17వ శతాబ్దం నాటి సాధువుకి వీడికి లింకేంది? మధ్యలో పార్వతి (నభా నటేశ్) ఎందుకొచ్చింది? ఇదీ మిగతా సాగతీత… థూ కథ!

బొమ్మ ఎట్లుందంటే (అదే, మన గ్రాఫిక్స్ మాయ)..

నిజం చెప్పాల్నంటే… బయట డబ్బాకు కొట్టిన పెయింట్ సూపర్‌! స్క్రీన్ మీద కెమెరా వర్క్, విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ (VFX) చూస్తే ఐదు నిమిషాలకోసారి కొత్త డెస్క్‌టాప్ వాల్‌పేపర్ చూసిన ఫీలింగ్ వస్తది. మన డైరెక్టర్ గారు గ్రాఫిక్స్ మీద పెట్టిన శ్రద్ధలో పావు వంతు, కథ మీద పెట్టినా బొమ్మ గట్టిగా ఆడేది!

Advertisement

“కథలో దమ్ము లేకపోతే ఏంది భాయ్, మా దగ్గర గ్రాఫిక్స్ ఉన్నయ్ కదా” అని ఫుల్లుగా వాడేశారు. హీరోగారు అవసరం ఉన్నా లేకపోయినా “బ్రహ్మకమలం నేనే తెస్తా” అని పోతడు. అక్కడికేదో సగం సినిమా అయిపోయిన ఫీలింగ్. మధ్యలో ఎక్కడ పడితే అక్కడ పాటలు… మన ఎమోషన్స్‌ను బ్రేక్ వేయడానికే పెట్టినట్టు ఉంటయ్.

ఇక సెకండ్ హాఫ్‌లో 17వ శతాబ్దం అంటారు. అరెరే కొత్త కథ ఏమైనా చెప్తారా అంటే… మళ్లీ అదే రొటీన్ ట్రాక్‌కి గ్రాఫిక్స్ పౌడర్ పూసి చూపించిండ్రు. పోనీలే కథ అయిపోతుంది కదా అని ఊపిరి పీల్చుకునే లోపు… దేవుడా! ఈ టార్చర్ చాలదన్నట్టు “పార్ట్-2 ఉంది, దానికి రండి” అని శుభం కార్డు వేసిండ్రు. మళ్లీ రావాల్నా? ఇంకెక్కడ భాయ్!

ఎవరెట్ల చేసిండ్రంటే:

విరాట్ కర్ణ: రెండు షేడ్స్ అట. గెటప్పులు బాగున్నాయి కానీ, పాపం ఎంత కష్టపడ్డా స్క్రిప్ట్‌లో సరుకు లేకపోయే.

నభా నటేశ్ & ఐశ్వర్య మీనన్:ఆ… కనపడ్డారులే అన్నట్టు ఉంది వాళ్ల ట్రాక్.

జగపతి బాబు:ఎప్పటిలాగే తన రెగ్యులర్ ఎక్స్‌పీరియన్స్ చూపించిండ్రు, కొత్తగా చెప్పనీకేం లేదు.

చివరి ఆఖరి మాట గా : కండ్లకు ఫుల్ మీల్స్ పెట్టి… గుండెను ఖాళీ కంచంతో పంపించిండ్రు. విజువల్స్ ప్యాకింగ్ అదిరింది కానీ, బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మిరపకాయ బజ్జీలో మిరపకాయ మిస్ అయినట్టు ఉంటది. థియేటర్‌లో గ్రాఫిక్స్ చూసి చప్పట్లు కొట్టొచ్చు, బయటకొచ్చాక నెత్తి కూడా  కొట్టుకోవచ్చు.

Nagabandham Movie Rating : 2.25/5

ఆ పావలా కూడా వాళ్ల గ్రాఫిక్స్ కష్టానికే!

Related News

కుస్తీ తక్కువ.. వినోదం ఎక్కువ!

కామెడీ వదిలి థ్రిల్లర్ తీసిన అభి.. ‘కర్మాఖ్య వర్కౌట్ అయ్యిందా?

Newtons Third Law Review : ‘న్యూటన్స్ థర్డ్ లా’ రివ్యూ..

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ!

శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ.. డెబ్యూ మూవీతో జయకృష్ణ సక్సెస్ కొట్టాడా?

Chennai LoveStory Review : ‘ చెన్నై లవ్ స్టోరీ ‘ మూవీ రివ్యూ..

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

Big Stories

Advertisement
×