E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు నిజం చెప్పిన రాజు 

Brahmamudi Serial Today Episode July 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందుకు నిజం చెప్పిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: రేఖ ఆంటీయే లక్కీకి అన్ని అంటూ రాజు చెప్పగానే.. అన్ని అంటే వాడి ఆధార్ కార్డు ఏమైనా రేఖ దగ్గర ఉందా..? అంటూ భ్రమరాంబ అడిగితే.. ఆధార్‌ కార్డు కాదు లక్కీకి అన్ని రేఖ పిన్నే అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో రాజు అంటే లక్కీకి వాళ్ల అమ్మను వెతికి పెట్టేందుకు అన్ని విధాలా సాయం చేస్తానని పిన్ని నాకు మాటిచ్చింది. అంటాడు. అప్పుడే లక్కీ ఎమోషనల్‌ అవుతూ.. అమ్మా మీ లాంటి వాళ్లు నాకు సాయం చేస్తా అన్నారంటే.. నాకు అమ్మ దొరికినట్టే.. థాంక్స్‌ మేడం అంటూ చెప్పగానే.. రాజు కోపంగా ఏయ్‌ మేడం ఏంట్రా మేడం అమ్మరా..? అంటాడు. అందరూ షాక్‌ అవుతారు.

రాజు మాత్రం  కూల్‌గా అదే పిన్ని వీడికి అమ్మను వెతికిపెడతానన్నావు కదా..? అందుకే సాక్ష్యాత్తు అమ్మ అంటున్నాను.. ఒరేయ్‌ అమ్మరా..? అని చెప్పగానే.. భ్రమరాంబ అయినా సరే వాడు ఇక్కడ ఉండటానికి నేను అసలు ఒప్పుకోను అనగానే.. మీరు కాదు చెప్పేది రేఖ పిన్నిని ఆ మాట చెప్పమనండి.. నాకు మాట ఇచ్చింది. ప్రాణాలైన వదులుకుంటుంది కానీ ఇచ్చిన మాట తప్పదు.. ఏంటి పిన్ని నువ్వు చెప్పు ఇతను ఇక్కడ ఉండకూడదు పంపించేయండి అని చెప్పు చిటికెలో పంపిచేస్తాను. అప్పుడు నేను ఒక్కడినే వీడి అమ్మను వెతికే బాధ్యతలు భుజాల మీద వేసుకుంటాను.. ఏంటి మా వాడిని ఉండిపోమ్మంటావా..? వెళ్లిపోమ్మంటారా…? చెప్పు పిన్ని నువ్వు ఏది అంటే అది అంటూ రాజు అడగ్గానే.. రేఖ ఉండమని చెప్పు అంటూ వెళ్లిపోతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. రాజు అర్థమైంది కదా.. రేఖ పిన్ని ఒప్పుకుంది. అందరూ నాకు ఇచ్చిన విలువే వీడికి ఇవ్వాలి ఇక్కడ అంటూ లక్కీని తీసుకుని పైకి వెళ్లిపోతాడు.

Advertisement

రూంలో కూర్చున్న వెంకట్‌ నందుకు ఒక లవ్‌ లెటర్‌ రాస్తాడు. దేవుడా నందు నా లవ్‌ యాక్సెప్ట్‌ చేసేలా చూడు అంటూ మొక్కుకని బయటకు వెళ్లిపోతాడు. బయట కూర్చుని చలపతి, లక్ష్మీ ఇద్దరూ రాజు గురించి ఆలోచిస్తుంటారు. చలపతి తనకు ఇష్టం లేకుండా అక్కడకు పంపించాను అని చెప్పగానే.. అది వాడి ఇల్లండి ఎలాగైనా ఉంటాడు అని చెప్పగానే.. వెంకట్‌ వచ్చి ఏంటమ్మా అది అన్నయ్య ఇల్లా..? వదిన ఇల్లు కదా..? అనగానే.. చలపతి వదిన ఇల్లు అయినప్పుడు అన్నయ్యది కూడా అవుతుంది కదా అంటూ చెప్తూనే.. వాడి విషయం సరే నీ విషయం ఏంటి..? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా..? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే మాత్రం మీ అన్నయ్యలా చేయకు ముందే మాకు చెప్పు మీ పెళ్లి మేము అంగరంగవైభవంగా జరిపిస్తాం కానీ నువ్వు ఈ సిటీలో ఏ అమ్మాయిని అయినా ప్రేమించు కానీ ఆ దుగ్గిరాల ఇంటి అమ్మాయిని మాత్రం ప్రేమించకు అంటూ చెప్పగానే.. వెంకట్‌ షాక్‌ అవుతాడు. చలపతి గట్టిగా అడగ్గానే.. వెంకట్‌ దుగ్గిరాల ఇంటి అమ్మాయిని ప్రేమించను అంటూ చలపతికి మాటిస్తాడు. అప్పుడే నందు వచ్చి వెంకట్‌ను బయటుక వెళ్దామా..? అంటూ పిలుస్తుంది. వెంకట్‌ సరే అంటూ వెళ్తాడు.

రాజును బయటకు తీసుకెళ్లిన లక్కీ నాకంతా అయోమయంగా ఉందిరా మామ. ఆ రేఖ ఏంటి మా అమ్మను వెతకడం ఏంటి అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడే ఇందు వచ్చి అవును ఆ రేఖ ఆంటీ ఏంటి లక్కీ వాళ్ల అమ్మను వెతకడం ఏంటి..? ఆవిడ ఎవరికైనా మంచి చేయడం చూశావా..? ఎప్పుడూ అందరి నాశనం కోరుకునే ఆవిడ లక్కీకి ఎందుకు మంచి చేస్తుంది అంటూ నిలదీస్తుంది ఇందు. దీంతో రాజు ఇందు ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం అనగానే.. లక్కీ ఆ విషయం తర్వాత మాట్లాడుకోవడం ఏంట్రా నాకైనా నిజం చెప్పు అంటాడు. ఇందు కూడా అసలు విషయం ఏంటో ఇప్పుడే చెప్పాలి అనగానే.. రాజు.. లక్కీని పక్కకు తీసుకెళ్లి నేను మీ అమ్మను వెతికే పనిలో ఉంటాను నువ్వు ఇక్కడ నీ లైఫ్‌ పార్టనర్‌ను సెట్‌ చేసుకునే పనిలో ఉండు అని చెప్పగానే.. లక్కీ హ్యాపీగా ఓ మామ అందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా..? అంటూ నవ్వుకుంటూ లక్కీ వెళ్లిపోతాడు.

Advertisement

లక్కీ వెళ్లిపోగానే ఏం చెప్పావు తనకు అని ఇందు అడిగితే.. ఏదో చెప్పానులే అంటూ రాజు అంటాడు. ఇందు మాత్రం అనుమానంగా నువ్వు లక్కీని ఇక్కడకు తీసుకొచ్చావంటే.. ఏదో ఒక కారణం ఉంటుంది. రేఖ ఆంటీ లక్కీ వాళ్ల అమ్మను వెతుకుతుంది అంటున్నావంటే.. అందుకు ఇంకేదో బలమైన కారణం ఉంటుంది. ఏంటది చెప్పు అంటూ గట్టిగా అడిగితే అప్పుడు రాజు అసలు నిజం చెప్తాడు. లక్కీ వాళ్ల అమ్మ ఎవరో కాదు రేఖ పిన్నియే అంటాడు. ఆ నిజం వినగానే ఇందు షాక్‌ అవుతుంది. వెళ్లి అందరి ముందు నిలబెట్టి అడిగితే రేఖ ఆంటీ ఒప్పుకోదా…? అని అడిగితే ఒప్పుకోదు ఒకవేళ ఒప్పుకున్నా ప్రేమగా చూసుకోదు.. తనంతట తానే ఒప్పుకుంటే లక్కీ మీద ప్రేమ కలుగుతుంది. ఈ విషయంలో నీ సాయం కావాలి అని అడగ్గానే.. నువ్వు అడిగితే ఎందుకు చేయను బావ.. ఏ సాయం అయినా చేస్తాను బావ అంటుంది. ముందు నువ్వు బావ.. బావ అనడం మానేయ్‌ అంటూ చిరాకు పడతాడు.

మరోవైపు నందుతో బండి మీద వెళ్తున్న వెంకట్‌ ఎలా ప్రపోజ్‌ చేయాలి. ప్రపోజ్‌ చేస్తే ఎలా రియాక్ట్‌ అవుతుందోనని మనసులో భయపడుతుంటాడు. సైడ్‌ మిర్రర్‌లో నందును చూస్తూ ఉంటాడు. వెంకట్‌ తనను చూడటం నందు గమనిస్తుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×