E-Paper
Advertisement

దేశమంతా రుతుపవనాల జోరు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు, హైదరాబాద్ మాటేంటి?

దేశమంతా రుతుపవనాల జోరు..  ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు, హైదరాబాద్ మాటేంటి?
Advertisement

Weather Alert: దేశవ్యాప్తంగా రుతుపవనాల జోరు కొనసాగుతోంది. ఉత్తరాదిలో బీభత్సం చేసిన వరుణుడు, దక్షిణాదిపై ఫోకస్ చేశాడు. దేశమంతా మేఘాలు కమ్మేయడంతో ఏ ప్రాంతంలో వర్షం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. శుక్రవారం వరకు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికితోడు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా ఏపీ, తెలంగాణలకు భారీ వర్షాలు పడే అవకాశ ఉంది. హైదరాబాద్ సిటీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

దేశమంతా రుతుపవనాల జోరు- దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. వర్షాలను ఇచ్చే క్యుములో నింబస్ మేఘాలు భారీగా కనిపిస్తాయి. రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు తూర్పు, వాయువ్య, ఈశాన్య, మధ్య, ఉత్తర భారతంలో రుతుపవనాలు చురుగ్గా కదులతున్నాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ-ఐఎండీ తెలిపింది. ఉత్తర బెంగాల్ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా అరేబియా సముద్రం వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

Advertisement

ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు- తెలంగాణ వ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. ఈనెల 28 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఐదు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నా, లోటు వర్షపాతం దాదాపు 20 జిల్లాకు పైగానే ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రంగారెడ్డి జిల్లా నందిగాంలో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్ మాటేంటి? గురువారం ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. వర్షం సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ మేఘాలతో కూడిన వాతావరణం ఉంటుంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశముంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వాతావరణ కాసింత వేడిగా ఉండే అవకాశముంది. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు వర్షం అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు, బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.

Advertisement

ALSO READ: ఆర్టీఏలో ఏజెంట్ల రాజ్యానికి ఎండ్ కార్డ్?.. యాక్షన్‌లో అధికారులు!

ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు-ఇక ఏపీలో గురువారం అంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రాయలసీమలో పగలు కాస్త వేడిగా ఉన్నా, సాయంత్రం అయ్యేసరికి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×