E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును ప్రేమగా బావ అంటూ పిలిచిన ఇందు  

Brahmamudi Serial Today Episode July 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును ప్రేమగా బావ అంటూ పిలిచిన ఇందు  
Advertisement

Brahmamudi serial today Episode: నందు తాను వంట చేసేదాన్ని కదా అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.. శేషు మాత్రం ఏమ్మా నీకు వంట కూడా వచ్చా అని అడగ్గానే.. భ్రమరాంబ ఏం మాట్లాడుతున్నారండి.. తాను ఇన్ని రోజులు అనాథలా ఎక్కడో ఒక్క దగ్గర పెరిగింది కదా..? అక్కడ ఇలా వంటలు చేసే బతికి ఉండొచ్చు అంటూ వెటకారంగా తిడితే శేషు కోపంగా భ్రమరం నీ మాటలు కొంచెం అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటాడు. భ్రమరాంబ మాత్రం ఏమ్మా వంటలు చేయలేదా..? నువ్వు అని అడిగితే.. అవును ఈ చేతితో చాలా మందికి వండిపెట్టాను. ఇప్పుడు మీరు ఉప్మా బాలేదు అంటున్నారు కదా..? మీకు నచ్చినట్టు చేసుకుని తీసుకొస్తాను అంటూ నందు చెప్పగానే.. భ్రమరాంబ నవ్వుతూ.. జీడిపప్పు బాగా వేసుకుని చేసుకుని రా అంటూ భ్రమరాంబ చెప్పగానే.. నందు కిచెన్‌ లోకి వెళ్లిపోతుంది.

శేషు మాత్రం నందు ఇలా మాట్లాడటంలోనే ఏదో తేడా కొడుతుంది. నందు తీసుకొచ్చే ఉప్మాలో ఏదైనా కలపొచ్చు.. నేను ఇదే లాగేస్తాను.. అని మనసులో అనుకుని ఉప్మా తింటుంటే.. భ్రమరాంబ నువ్వెందుకు ఈ ఉప్మా తింటున్నావు.. నందు రుచిగా తీసుకొస్తానంది కదా..? అంటూ చెబితే నేను ఆకతికి ఆగలేను మీరు అది తినండి.. నేను ఇదే తినేస్తాను అంటాడు. కిచెన్‌లోకి వెళ్లిన నందు ఉప్మాలో ఏదో కలిపి రెడీ చేసి తీసుకెళ్తుంది. ఉప్మా స్మెల్‌ చూసిన భ్రమరాంబ ఆహా గుమగుమలాడిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.. చూశావా..? చూసి నేర్చుకో.. ఎన్నో సంవత్సరాలుగా వంట చేస్తున్నావు.. ఎప్పుడైనా ఇలా చేశావా.?అంటూ అపర్ణను తిడుతూ.. ఉప్మా వడ్డించుకుని తిటుంది భ్రమరాంబ. ఐశ్వర్య మాత్రం నాకేంటి గుమగుమలు కాకుండా వేరే స్మెల్‌ వస్తుంది అని అడగ్గానే.. ఇదో రకమైన ఉప్మా ఐశ్వర్య ఒక కొత్త రకమైన ఇంగ్రిడియేంట్‌ కలిపాను అని చెప్పగానే..

Advertisement

ఐశ్వర్య అయితే పిన్ని ముందు నువ్వు తిను అని చెప్తుంది. తింటాను అంటూ భ్రమరాంబ ఉప్మా తింటుంది. భ్రమరాంబ నోరు అలాగే మూసుకుపోతుంది. ఐశ్వర్య మాత్రం పిన్ని టేస్ట్‌ ఎలా ఉంది మీరు ఎక్స్‌ఫెక్ట్ చేసినట్టే ఉందా..? అని అడగ్గానే.. శేషు కల్పించుకుని ఎక్స్‌ఫెక్ట్‌ చేసిన దానికంటే ఎక్కువే ఉన్నట్టుందమ్మా.. అందుకే కళ్లు చక్రాల్లాగా చేసుకుని చూస్తుంది అని చెప్పగానే.. ఐశ్వర్య అయితే నేను కూడా తింటాను అంటూ తిని సేమ్‌ భ్రమరాంబలాగే ఐశ్వర్య చూస్తుంది. శేషు ఏంటమ్మా నువ్వు అలాగే చూస్తున్నావు.. నోరు అతుక్కుపోయిందా..? అనగానే.. ఐశ్వర్య కోపంగా నందును చూస్తుంది. నందు కోపంగా నేను మీకు ముందే చెప్పాను.. ఇందు అక్క విషయంలో వార్నింగ్‌ ఇచ్చినా మీకు బుద్ది రాలేదు.. ఇదేం రాజరికం కాదు.. మీరు రాజులు కాదు.. ఇక నుంచి మా నాన్నమ్మ జోలికి వచ్చినా ఒక్క మాట తూలినా ఇప్పుడు జస్ట్‌ గమ్ము మాత్రమే కలిపాను.. నెక్స్‌ వేరే లెవెల్‌ ఉంటుంది పద నాన్నమ్మ అంటూ అపర్ణను తీసుకుని వెళ్లిపోతుంది నందు.

చలపతి ఇంట్లో అందరూ టీ తాగుతుంటే.. ఇందు చూస్తూ ఉంటుంది. రాజు కోపంగా ఏయ్‌ ఏంటలా చూస్తున్నావు.. టీ కావాలా..? అని అడగ్గానే.. ఏం కాదు నువ్వు త్వరగా తాగేస్తే.. మనం రూంలోకి వెళ్దాం అంటుంది. ఇందు మాటలకు అందరూ షాక్ అవుతారు. ఇందు మాత్రం మీ కాలికి కట్టు విప్పి కొత్తగా కట్టాలి అని చెప్తుంది. నువ్వు కట్టడం ఏంటి మా అమ్మ ఉంది కదా..? మా అమ్మ కడుతుంది అంటాడు రాజు. లక్ష్మీ నీకు పెళ్లాం వచ్చాక కూడా నేను కట్టు కట్టడం ఏంటి..? నేను కట్టను అంటూ లక్ష్మీ వెళ్లిపోతుంది. రాజు కోపంగా నీతో మాత్రం కట్టు కట్టించుకోనే అనగానే.. ఎలా కట్టించుకోవో నేను చూస్తాను.. అంటుంది ఇందు.. ఏం చేస్తావే.. నువ్వు అంటూ రాజు అడిగితే

Advertisement

నీ రెండో కాలు విరగొడతాను అప్పుడు ఎలా చేయించుకోవో నేను చూస్తాను అంటూ కర్ర తీసుకొస్తే రాజు భయంగా నాన్న నువ్వైనా చెప్పు నాన్న అంటూ ప్రాధేయపడుతుంటే.. చలపతి నేను చెప్పనురా ఇన్ని రోజులకు నీలో ఒక రకమైన మార్పు చూశాను అంటూ నవ్వుతుంటాడు. కనీసం తనను ఇక్కడి నుంచైనా పంపించు అంటే కదురదు అమ్మా నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేసుకో నేను వెళ్లిపోతున్నాను అంటూ చలపతి ఇంట్లోకి వెళ్లిపోతాడు. రాజు భయంతో కట్టు చేంజ్‌ చేయించుకుంటాను కానీ రూంలో కాదు బయట చేయించుకుంటాను అని చెప్పగానే.. రాజును తీసుకుని బయటకు వెళ్తుంది ఇందు.

బయటకు తీసుకెళ్లిన ఇందు, రాజుకు కట్టు మారుస్తుంటే.. ఇందు మళ్లీ తమ ఇంటికి రమ్మని అడుగుతుంది. ఎలా రావాలి మళ్లీ నీ మెడలో తాళి కట్టి రమ్మంటావా..? అనగానే.. అది నీ ఇష్టం అంటుంది ఇందు. అందుకు రాజు చాన్సే లేదు.. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడమా..? అంటూ అనుమానంగా తిడుతూ.. నన్ను వదిలేయ్‌ అంటాడు. దీంతో ఇందు బాధగా నిన్ను అసలు వదిలేయని బావ అంటుంది. ఆ మాటకు రాజు షాక్‌ అవుతాడు. బావ అని ప్రేమ కురిపిస్తే.. నీ కొంగు పట్టుకుని వస్తాను అనుకున్నావా..? అసలు రాను డ్రామాలు ఆపి మీ ఇంటికి వెళ్లిపో అంటాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×