E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన రాజు 

Brahmamudi Serial Today Episode July 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన రాజు 
Advertisement

Brahmamudi serial today Episode: రాజుకు ఈ ఇంటికి సంబంధం లేదని… అందుకే ఈ ఊబిలోకి ఎందుకు దించాలి. మేమంటే అక్కా చెళ్లెల్లం కాబట్టి మేము తప్పదు రాజును వాళ్ల అమ్మానాన్నలకు ఎందుకు దూరం చేయాలి అంటూ ఇందు చెబితే అపర్ణ తను నీ భర్త జీవితాంతం నీకు తోడుంటానని నీ మెడలో మూడుముళ్లు వేసిన భర్త. అలాంటిది అతన్ని పట్టుకుని సంబంధం లేదు అంటావేంటి…? అంటూ ప్రశ్నిస్తుంది. సుభాష్‌ కూడా రాజును ఇలా దూరం చేయడం కరెక్ట్‌ కాదమ్మ అని చెప్తాడు. ఇందు మేము పిలిస్తే తను రాడు.. నువ్వు పిలిస్తేనే రాజు వస్తాడు అని అపర్ణ చెబితే తాను రాజును పిలవలేనని వెళ్లిపోతుంది ఇందు. నిజంగానే రాజు అక్కకు భర్త అయితే పిలిచేది. కానీ రాజు అద్దె మొగుడు కదా..? అందుకే పిలవడం లేదు.. అని నందు మనసులో అనుకుంటుంది. అపర్ణ మాత్రం బాధపడుతుంది ఇందు జీవితం ఏమవుతుందోనని ఆందోళన చెందుతుంది. నందు మాత్రం నేను ఉన్నాను కదా నాన్నమ్మ అక్కను మార్చి బావను ఇంటికి తీసుకొస్తాను అంటూ ఓదారుస్తుంది.

రాజు, రేఖకు ఫోన్‌ చేసి తాను ఇచ్చిన షాక్‌ ఎలా ఉందని అడుగుతాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఇప్పుడు ఎలా ఉంది మన స్ట్రోక్‌.. నీది మామూలు తెలివి కాదు పిన్ని నాకు తెలియకుండా నాతోనే సంతకం పెట్టించుకున్నావంటే.. నువ్వు మామూలు దానివి కాదు.. పిన్ని నన్ను కూడా లైట్‌ తీసుకోకు.. నేను ఉండగా నీకు ఆస్థి మాత్రం అసలు దక్కదు. చూశావు కదా..? నేను ఇంట్లో ఉంటే నీకు ఆస్థి దక్కదు.. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించక ఇందుకు దూరంగా ఉంటున్నాను కానీ ఇప్పుడు ఎప్పుడూ ఇందు నా భార్య. ఆ ఇల్లు నాదే ఆ కంపెనీ నాదే.. ఆ ఇంటి మనుషులను కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే.. ఏమాటకు ఆ మాట పిన్ని మిస్‌ యూ పిన్ని ఈ టైంలో నీ ఫేస్‌ చూడాలని ఉంది. కానీ ఏం చేద్దాం.. రాలేకపోతున్నాను.. అయినా నువ్వు ఇలాంటి ప్లాన్స్‌ ఎన్ని వేసినా ఇలాగే ఫెయిల్‌ అవ్వడం తప్ప ఏమీ ఉండదు పిన్ని ఉంటాను అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు.

Advertisement

తర్వాత నెత్తిన తడిగుడ్డ వేసుకుని బాధగా కూర్చుని ఉంటుంది భ్రమరాంబ. రేఖ కోపంగా అటూ ఇటూ తిరుగుతుంది. ఆస్థి దక్కలేదన్న ఉక్రోషం రేఖలో కనిపిస్తుంది. అప్పుడే భ్రమరాంబ అసలు మనం అనుకున్నది ఈ జన్మలో జరుగుతుంది అంటావా..? రేఖ అని అడగ్గానే.. అసలు జరగదు అంటూ శేషు వస్తాడు. శేషును భ్రమరాంబ, భూషణ్‌ తిడతారు. తర్వాత రాజు, లక్కీ మందు తాగుతుంటారు. రాజు.. ఇందును తలుచుకుని బాధపడుతుంటే.. లక్కీ మీ పెళ్లి పెటాకులైంది.. ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అంటూ ఓదారుస్తూ.. నీకెందుకురా నీకంటే ఒక బంధమైతే ఏర్పడింది. నీకు అమ్మానాన్న ఉన్నారు.. కానీ నాకే ఎవ్వరూ లేరు.. నా బతుకు తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుంది. అమ్మానాన్న ఎవరో తెలియకుండా బతకడం అంటే అది పరమ దరిద్రం అంటూ బాధపడుతుంటాడు. రాజు ఓదారుస్తాడు. లక్కీ బాధపడుతూనే ఫుల్లుగా తాగి పడిపోతాడు.

రూంలో ఉన్న ఇందు దగ్గరకు వెళ్లిన ఐశ్వర్య కోపంగా తిడుతుంది. రాజే లేనప్పుడు ఇక నీకు ఈ రూం ఎందుకు..? వెళ్లి ఏ స్టోర్‌ రూంలోనో కిచెన్‌లోనో పడుకోపో అంటూ తిడుతుంటే.. అప్పుడే నందు వచ్చి ఆ అవసరం మా అక్కకు లేదు.. మా అక్కకు తోడుగా ఉన్నాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఐశ్వర్య నువ్వేంటే నిన్నటి దాకా రోడ్డు మీద ఉన్న నీకు ఏసీ రూం కావాలా..? అంటూ ఎగతాళి చేస్తుంటే.. చూడు నేను ఉన్నంత వరకు మా అక్కను ఏమైనా అంటే బాగుండదు.. అప్పుడు పబ్బు దగ్గర తప్పించుకున్నావు.. ఇప్పుడు తప్పించుకోలేవు.. అంటూ చెప్పగానే.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇందు ఇద్దరిని పక్కకు లాగేసి ఐశ్వర్యను రూంలోంచి పంపించేస్తుంది. ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×