E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణను బెదిరించి ఆస్థి రాయించుకున్న రేఖ  

Brahmamudi Serial Today February 28th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణను బెదిరించి ఆస్థి రాయించుకున్న రేఖ  
Advertisement

Brahmamudi serial today Episode:

రేఖ తన భాయ్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తుంది. గుమ్మంలో నిలబడిన రేఖను చూసిన అపర్ణ, సుభాష్‌ షాక్‌ అవుతారు. ఇంట్లోకి అడుగు పెడుతున్న రేఖ దంపతులను అపర్ణ కోపంగా ఆగు.. మళ్లీ ఎందుకు వచ్చావు నువ్వు నీ ముఖం కూడా నాకు చూపించకు అని చెప్పాను కదా..? అడుగు లోపల పడిందంటే నిన్ను చంపేస్తాను అంటుంది. అయినా వినకుండా రేఖ లోపలికి వస్తుంది. అపర్ణ కోపంగా ఏంత ధైర్యం ఉంటే నువ్వు నా మాట వినకుండా లోపలికి వస్తావు అంటూ పీక పట్టకుంటుంది. రేఖ కూల్‌గా ఆవేశపడకండి ఆంటీ నువ్వు విషయం బాగా అర్థం చేసుకోవాలి. పవర్‌లో లేని పొలిటీషియన్‌కు ఫామ్‌లో లేని క్రికెటర్‌కు అన్ని కోల్పోయిన నీలాంటి ఇంటి పెద్ద చెప్పిన మాటకు ఎటువంటి విలువ ఉండదు. ఇప్పుడు నీలాంటి వాళ్ల మాటలకు ఎవ్వరూ భయపడరు.. అలాంటప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నువ్వు ఒక్కదానివే ఎలా పాలించగలవు.. పెళ్లి చేసుకుని మంది మార్భాలంతో వచ్చాను అని చెప్పగానే..

అపర్ణ కోపంగా ఎందుకు అడుక్కుతినడానికా…? అనగానే.. రేఖ కోపంగా వదిన పవర్‌ పోయినా పొగరు మాత్రం తగ్గలేదు ఆంటీకి అంటుంది. దీంతో రేఖ వాళ్ల వదిన కూడా అదెంత పని రేఖ నువ్వు అనుకుంటే చిటికెలో తగ్గించొచ్చు అంటుంది. రేఖ నవ్వుతూ చూడండి ఆంటీ ఈ దుగ్గిరాల ప్రాపర్టీని చూసుకోవడం మీ వల్ల కాదు.. వాటన్నింటిని  నాచేతుల్లో పెట్టండి కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను.. అని చెప్పగానే.. అపర్ణ కోపంగా ఏంటి బెదిరిస్తున్నావా..? నువ్వు తలుచుకుంటే ఈ ఇంటి ముందు మొలిచిన గడ్డి పోచను కూడా పీకలేవు.. కానీ నేను అనుకుంటే నిన్ను జీవితాంతం జైలులో కూర్చోబెట్టి చిప్పకూడు తినేలా చేయగలను.. అనగానే.. రేఖ చాలా కోరికలు ఉన్నాయి ఆంటీ నేను ఎవరో ఏంటో మర్చిపోతున్నావా..? ఒక్కసారి నీ కొడుకును చంపిన మా అమ్మను గుర్తు చేసుకో..అనగానే.. సుభాష్‌ కోపంగా రేఖ అనగానే..

Advertisement

ఏంటి అంకుల్‌ మీతో కూడా మాట్లాడతాను ఉండండి.. ఆంటీతో మాట్లాడుతున్నాను కదా..? ఒక్క నిమిషం వస్తాను మీదాకా..? గుర్తొచ్చిందా ఆంటీ నీ కొడుకు తలను పగలగొట్టి తన ప్రాణాలను పంచభూతాల్లో కలిపేసిన నా తల్లి గుర్తొచ్చిందా..? మా అమ్మే అత చేసినప్పుడు తన రక్తాన్ని పంచుకుని పుట్టినదాన్ని నేనెంత చేయగలను. ఆ మాత్రం ఊహించలేవా..? కళ్ల ముందు కుటుంబం కాలిపోతున్నా.. చూస్తూ బతకగలిగావు.. కొడుకు, కోడలు ప్రాణాలు వదిలేస్తున్నా.. భరించగలిగావు.. మరి అదే కళ్ల ముందు నీ వారసురాళ్లను చంపేస్తుంటే.. ఇలాగే చూస్తూ నిలబడగలవా..? అంటూ తన భర్తకు సైగ చేయగానే.. అతను వెళ్లి రాజ్‌, కళ్యాణ్‌ ల కూతురును చంపేందుకు కత్తి పెడతాడు.. దీంతో అపర్ణ కోపంగా రేఖ అంటుంది. దీంతో రేఖ మనవరాళ్ల మెడ మీద కత్తి పెట్టగానే.. మీ గుండెల్లో కత్తి దించినట్టుగా ఉందా..? కానీ నాకు అది సరిపోదు ఆంటీ.. ఇంకా ఇంకా కావాలి.. అంటూ సైగ చేయగానే.. రేఖ వాళ్ల వదిన కర్రతో సుభాష్‌ను కొడుతుంది. సుభాష్‌ కింద పడిపోతాడు.. అపర్ణ ఏడుస్తూ.. దగ్గరకు వెళ్లి సుభాష్‌ను లేపి ఏయ్‌ నువ్వు అసలు మనిషివేనా…? అంటుంది.

రేఖ కాదు రాక్షసిని రెండు చిటికెలు వేయగానే.. నీ గుండెలు దారి చేతుల్లోకి వచ్చినట్టు ఉంది. మరి నా తల్లిని చంపిన మిమ్మల్ని ఎలా వదిలేస్తాను.. ఏడ్చింది చాలు కానీ నీతో చాలా పనుంది. నేను ఏం చేయగలనో.. ఇప్పటికే నీకు బాగా అర్థ అయింది అనుకుంటా నా మాటకు ఎదురు చెప్పకుండా వచ్చి ఈ పేపర్స్‌ మీద సంతకం చేయ్‌ అని పేపర్స్‌ ముందుకు వేస్తుంది. దీంతో అపర్ణ ఏంటివి అని అడుగుతుంది. ఆస్థి పేపర్లు నువ్వు సంతకం చేయగానే.. ఆస్థి మొత్తం నా పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది అని చెప్పగానే.. నేను సంతకం చేస్తే ఆస్థి కాదు కదా..? ఈ ఇంట్లో ఆవగింజ కూడా రాదు.. అర్థం కాలేదా..? ఆస్థి మొత్తం కావ్య పేరు మీద ఉంది. కావ్య చనిపోయింది కాబట్టి ఇందు చిన్న పాప కాబట్టి తనకు పాతికేళ్లు వచ్చే వరకు తనకు కూడా ఎటువంటి అధికారం ఉండదు.. అప్పటి వరకు నేను ఒక గార్డియన్‌గా ఉంటాను. కాదు కూడదు అని నువ్వేమైనా వేషాలు వేస్తే.. ఆస్థి మొత్తం దుగ్గిరాల ట్రస్ట్‌కు వెళ్లిపోతుంది. ఏంటి అర్తం కాలేదా..? చుట్టూ మీ అమ్మ గుంతనక్కలా తిరుగుతుందని తెలిసి నా కొడుకు కోడలు ముందే ఊహించి  అంత పకడ్దందీగా డాక్యుమెంట్స్‌ రెడీ చేశారు. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు.. అని చెప్పగానే..

Advertisement

రేఖ షాక్‌ అవుతుంది. కోపంతో అపర్ణను కర్రతో కొడుతుంది. ఆస్తికి గార్డియన్‌గా అపర్ణ చేత సంతకం చేయించుకుంటుంది. మరోవైపు స్వరాజ్‌కు గతం గుర్తు రావడానికి ప్రయత్నిస్తుంటారు.. ఇక రేఖ చేసిన మోసం గుర్తు చేసుకుని అపర్ణ, సుభాష్‌ బాధపడుతుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×