E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ధాన్యలక్మీకి సపోర్ట్ చేసిన కావ్య  

Brahmamudi Serial Today February 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ధాన్యలక్మీకి సపోర్ట్ చేసిన కావ్య  
Advertisement

Brahmamudi serial today Episode: 

ధాన్యలక్ష్మీని అందరూ తిడుతుంటే.. కావ్య అడ్డుపడుతుంది. చిన్నత్తయ్యని ఎవరూ ఏమీ అనొద్దు.. తన స్థానంలో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు. అప్పూ, కళ్యాణ్‌లు కనిపించకపోయేసరికి అలా ప్రవర్తించిందే కానీ, మరొకటి కాదు.. అనగానే రాజ్ కూడా ఆ వీడియో చూడగానే నాకే ఏమీ తోచలేదు.. అలాంటిది పిన్ని ఎలా తట్టుకుంటుంది? తల్లి మనసు కదా? ఆ మాత్రం కంగారు ఉంటుంది.. అందుకే కళ్యాణ్, అప్పూలని ఎలాగైనా తీసుకురావాలని మేమే ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పగానే.. ధాన్యక్ష్మీ ఎమోషనల్‌ అవుతూ రాజ్‌కు సారీ చెప్తుంది. మీరేంటో తెలిసి కూడా నిన్ను, కావ్యని అనరాని మాటలు అన్నాను అంటూ బాధపడుతుంది. ఇంతలో కావ్య ఏంటి చిన్నత్తయ్యా మీరు మరీనూ.. అప్పూ కాసేపట్లో పురుడు పోసుకుంటోంది. నీకు కాసేపట్లో మనవడో, మనవరాలో పుట్టబోతున్నారు.. ఇలాంటి సమయంలో సంతోషంగా ఉండాలి అని చెప్తుండగానే.. డాక్టర్ వచ్చి అప్పూకి ఆడపిల్ల పుట్టిందని చెప్తుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

తర్వాత రాజ్‌, కళ్యాన్‌కు సారీ చెప్తాడు. ట్రస్ట్ గురించి మన ఫ్యామిలీ ముందు చెప్పకుండా ఉండాల్సింది.. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. కారణం ఏదైనా ఎవరో మిమ్మల్ని కిడ్నాప్ చేసే వరకు వచ్చారంటే ఆలోచించాల్సిన విషయమే అంటాడు. కావ్య కూడా సరైన సమయానికి మేం అక్కడికి వెళ్లాం కాబట్టి అప్పూ, కళ్యాణ్‌లను ఇలా చూడగలుగుతున్నాం అంటుంది. అవును కళ్యాణ్‌ మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్లని మీరు చూశారు కదా? వాళ్ల మాటల్లో దీని వెనుక ఎవరున్నారో మీరు గమనించారా? అంటూ రాజ్ అడగ్గానే.. రౌడీలు చాలాసార్లు ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు.. అవతలి వాళ్ల మీద అనుమానం రాకుండా నీ పేరు వాడారు. కానీ దీని వెనుక ఎవరో శత్రువులు ఉన్నారని అనిపిస్తోంది అంటూ కళ్యాణ్‌ చెప్తాడు. దీంతో అందరూ ఆలోచిస్తుంటారు.

Advertisement

తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు. అప్పు, కళ్యాణ్‌, పాపకు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు. అందరూ సంతోషంగా పిల్లల బారసాల గురించి మాట్లాడుకుంటుండగా.. అప్పుడే మినిస్టర్‌ ధర్మేంద్ర వస్తాడు. ధర్మేంద్రను చూసిన అందరూ షాక్‌ అవుతారు. ధర్మేంద్ర మాత్రం నవ్వుతూ అందరిని పలకరిస్తాడు. తన పాపకు బారసాల చేస్తున్నానని.. అందుకోసం మిమ్మల్ని ఇన్వైట్‌ చేయడానికి వచ్చానని చెప్తాడు. అన్ని సమస్యలు తీరిపోయాక.. నా పాపకు నేను చేస్తున్న తొలి పండుగ ఇది. నా భార్య మీరు తప్పకుండా వచ్చి పాపని ఆశీర్వదించాలని పట్టుబడుతోంది. కావ్యగారు మీరే కాదు.. మీ కుటుంబమంతా నా ఆప్తులే, అందుకే మీరందరూ తప్పకుండా బారసాలకు రావాలి అంటూ ఇన్వైట్‌ చేసి వెళ్లిపోతాడు. మినిస్టర్‌ వెళ్లిపోయాక రాజ్ సంతోషంగా మినిస్టర్ గారింట్లో బారసాలకు మనందరం వెళ్దాం అంటాడు. దీంతో ఇంద్రాదేవి కోపంగా మేం ఎక్కడికీ రాలేము అని చెప్తుంది. అప్పుడే అపర్ణ కూడా తెలిసి చేసినా తెలియక చేసినా నా కోడలి కష్టానికి కన్నీటికీ కారణం అయినవాడు కదా? ఎలా వెళ్తాం.. అనగానే.. అవును రాజ్‌ అతని మీద కోపం లేదు.. కానీ అలాంటి వాళ్లకి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది అంటుంది ఇద్రాదేవి.

రుద్రాణిని కలిసిన రాహుల్‌, రేఖ తిడుతుంటారు. కావ్యకి కూతురిని దూరం చేసి దానిని పిచ్చిదానిని చేసి రాజ్‌ని నా సొంతం చేస్తానని చెప్పావు కానీ అందుల ఫెయిల్ అయ్యావు. ఆఖరికి కళ్యాణ్, అప్పూలని చంపి అది రాజ్, కావ్యల మీద వేస్తానని చెప్పి ఫెయిల్ అయ్యావు. అక్కడ వాళ్ల వంశానికి ఇద్దరు మహాలక్ష్ములు పుట్టారని బారసాల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ రేఖ బాధపడుతుంది. రాహుల్‌ కూడా కోపంగా వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. కానీ మళ్లీ ట్రస్ట్ పెడతాం, ఆస్తిలో సగం వాటా ట్రస్ట్‌కు ఇచ్చేస్తామని అంటేనే మనకు ప్రాబ్లమ్ అంటాడు. దీంతో రుద్రాణి కోపంగా చూస్తూ.. అక్కడి వరకు నేనేందుకు రానిస్తాను, త్వరలోనే తిరిగి ఆ ఇంట్లో అడుగుపెట్టబోతున్నాను.. వాళ్ల ఆశల్ని, ఆశయాల్ని నాశనం చేస్తాను అనగానే..

Advertisement

రాహుల్‌ కోపంగా చూస్తూ.. వాళ్లు నువ్వంటేనే కోపంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో  వాళ్లు నిన్ను క్షమిస్తారా..? అని అడగ్గానే.. రుద్రాణి వెటకారంగా నవ్వుతూ.. రెండు కన్నీటి బొట్లు రాల్చేసరికి మినిస్టరే కరిగిపోయాడు.. వాళ్లు కరగారా? శత్రువుని కూడా దుగ్గిరాల ఫ్యామిలీ క్షమిస్తుంది. ఆ మినిస్టర్ అందరినీ బారసాలకి పిలిచాడు కదా? నేను కూడా అక్కడికి వస్తాను.. అని చెప్పగానే.. రాహుల్‌ కోపంగా నిన్ను చూడగానే అమ్మమ్మ చంపాలన్నంత కోపంగా ఉంది అనగానే.. ఎస్‌ అవును అదే మనుక కావాల్సింది. వాళ్లతో పాటు మీరు కూడా నన్ను అసహ్యించుకోండి. ఆ తర్వాత మిగతాది నేను చూసుకుంటాను అని రుద్రాణి చెప్పగానే.. రాహుల్‌, రేఖ సరే అంటారు.

దుగ్గిరాల ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. ట్రస్ట్‌ పెట్టడానికి ధాన్యలక్ష్మీ ఒప్పుకుందని అపర్ణ, ఇద్రాదేవి అప్పును మెచ్చుకుంటారు. ఇంతలో స్టేషన్‌ నుంచి పోలీసులు అప్పుకు ఫోన్‌ చేసి మొన్న పట్టుకున్న రౌడీలను ఏం చేయాలని అడుగుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×