E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తను చేస్తున్న మోసం గురించ రుద్రాణికి చెప్పిన రాహుల్

Brahmamudi Serial Today December 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తను చేస్తున్న మోసం గురించ రుద్రాణికి చెప్పిన రాహుల్
Advertisement

Brahmamudi serial today Episode:

కావ్యకు లోపల గురూజీ వైద్యం చేస్తుంటే.. రాజ్‌ బయట నిలబడి ఉంటాడు. ఇంతలో రౌడీలు వస్తారు. పెన్‌ డ్రైవ్‌ రాజ్‌ దగ్గరే ఉండొచ్చు అనుకుని రాజ్‌ దగ్గరకు వెళ్లి పెన్‌ డ్రైవ్‌ అడుగుతారు. దీంతో రాజ్‌ కోపంగా ఇక్కడికి ఎందుకు వచ్చారురా అని అడుగుతాడు. మీ దగ్గర ఉన్నది నాకు ఇచ్చేయాలి అని రౌడీలు అడగ్గానే.. ఇప్పుడే ఇచ్చేయాలా..? అని రాజ్‌ అడుగుతాడు. ఇప్పుడే ఇచ్చేయాలి అని రౌడీలు చెప్పగానే.. రాజ్‌ లాగి పెట్టి కొడతాడు. ఇంకా కావాలా..? ఇంకోటి ఏమైనా కావాలా..? అని అడగ్గానే.. రౌడీ బాధగా చంప పగిలింది. అయినా పర్వాలేదు ఒక పని మీద వచ్చాం అది కామనే కదా అనుకుంటాడు. చచ్చినవాడితో సంబంధం లేదన్నావు.. కానీ ఇందాక వాడి అన్నతో ఏం మాట్లాడావు..? ఏందుకు మాట్లాడావు.. అని రౌడీ అడగ్గానే..

అరేయ్‌ చచ్చిన వాడే నాకు తెలియదు అంటే ఆ వచ్చిన వాడు ఎలా తెలుస్తాడురా..? అంటూ రాజ్‌ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. రౌడీ రాజ్‌ను బెదిరిస్తాడు. దీంతో రాజ్‌ మళ్లీ కొడతాడు దీంతో రౌడీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో కావ్య, గురువు లోపలి నుంచి బయటకు వస్తారు. వాళ్లను చూస్తూ… గురువు గారు ఏమైంది చెప్పండి అని అడగ్గానే.. కంగారు పడాల్సిన అవసరం లేదు నాయన.. నేను ఇచ్చి మందులు బాగా పని చేస్తున్నాయి. నేను ఇచ్చిన గుళికలు, కషాయాలు క్రమం తప్పకుండా వాడండి మరో ఐదు రోజుల్లో మీరు వెళ్లిపోవచ్చు అని చెప్పి గురువు వెళ్లిపోతాడు. రాజ్‌, కావ్య చాలా హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

మరోవైపు స్టేషన్‌లో రేణుక బిడ్డ కేసు ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంటే.. సీఐ వచ్చి అప్పును ఆ కేసు వదిలేయమని చెప్తాడు. దీంతో అప్పు షాకింగ్‌ గా ఆపేయడం ఏంటి సార్‌.. ఇప్పుడు ఆ పాప రీ పోస్ట్‌మార్టమ్‌ గురించి అడుగుదామనే వచ్చాను అని చెప్తుంది. దీంతో సీఐ కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా..? నేను ఆ కేసు వదిలేయమని చెప్తుంటే.. రీ పోస్ట్‌మార్టం అంటావు.. అని చెప్పగానే.. సార్‌ అప్పుడు ఏదో పొరపాటు జరిగింది సార్‌ రీ పోస్ట్‌ మార్టం జరిపిస్తే కొన్ని క్లూస్‌ దొరికే చాన్స్‌ ఉంది అంటుంది అప్పు. దీంతో సీఐ మరింత కోపంగా చూడమ్మా ఇన్ని రోజులు ఆ కేసు పట్టుకుని టైం వేస్ట్‌ చేసుకున్నావు.. ఇప్పుడు మళ్లీ రీ పోస్ట్‌మార్టం అని చెప్పి కాంప్లికేట్‌ చేయకు అని చెప్పగానే.. అప్పు అది కాదు సార్‌ అంటూ ఏదో చెప్పబోతుంటే..

ఏది కాదమ్మా..? అప్పుడు అన్ని పార్మాలిటీస్‌ జరిగాయి. ఆ పాప రేణుక గారి కూతురు అన్న కన్ఫం అయింది. ఇంకా ఏదో డిపార్ట్‌మెంట్‌ తప్పు చేసినట్టు మాట్లాడతావు అంటూ కోప్పడగ్గానే.. అప్పు అది కాదు సార్‌ పాప డీఎన్‌ఏతో రేణుక డీఎన్‌ఏ మ్యాచ్‌ అవుతుందో లేదో చూడాలి అని చెప్పగానే.. మ్యాచ్‌ అయినందుకే కదా కేసు క్లోజ్‌ చేశాం. మళ్లీ దాన్ని పట్టుకుని ఎందుకు లాగుతున్నావు.. నువ్వు తప్పు చేస్తున్నావు.. అని చెప్పగానే.. ఒక్కసారి సెకండ్‌ ఓపినీయన్‌ తీసుకుందాం.. ఒకవేళ మ్యాచ్‌ కాకపోతే రేణుక గారు చెప్పింది నిజం అవుతుంది కదా అనగానే.. సీఐ మరింత కోపంగా షటప్‌ అనవసరంగా రేణుక మాటలు నమ్మి రాంగ్‌ రూట్లో వెళ్తున్నావు. ఇక ఈ కేసు గురించి మర్చిపో.. చూడమ్మా ఇప్పుడు నీకు ఒక కొత్త కేసు అప్పగించబోతున్నాను. ఆ కేసు టేకప్‌ చేయ్‌ లేదంటే మళ్లీ లీవ్‌ పెట్టి ఇంటికి వెళ్లిపో.. ఉదయ్‌ నా కాబిన్‌లో ఫైల్‌ ఉంది తీసుకురా.. అని చెప్పి ఆ కేసుకు సంబంధించిన ఫైల్ ఇచ్చి అప్పుకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు.

Advertisement

పెన్‌ డ్రైవ్‌ దొరకలేదని పెద్ద రౌడీ దగ్గరకు వెళ్లిన చిన్న రౌడీలను పెద్ద రౌడీ చితక్కొడతాడు. చిన్న పెన్‌ డ్రైవ్‌ తీసుకురాలేరు మీరు రౌడీలారా..? అంటూ తిడతాడు. మరోవైపు రాజ్‌, కావ్య హ్యాపీగా మాట్లాడుకుంటుంటే.. అపర్ణ ఫోన్‌ చేసి ఎలా ఉన్నారని అడుగుతుంది. ఇంద్రాదేవి మాట్లాడుతుంది. తర్వాత రాహుల్‌ తాను దొంగతనంగ కావ్య డిజైన్స్‌ మళ్లీ వేయించిన విషయం రుద్రాణికి చెప్తాడు. రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×