E-Paper
Advertisement

OTT Movie : ఫ్రెండ్ తో ప్రేమ ప్రియుడితో రొమాన్స్ … ట్రయాంగిల్ లవ్ లో హీటెక్కించే సీన్స్

OTT Movie : ఫ్రెండ్ తో ప్రేమ ప్రియుడితో రొమాన్స్ … ట్రయాంగిల్ లవ్ లో హీటెక్కించే సీన్స్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఈ ఏడాది వచ్చిన ఒక మరాఠీ రొమాంటిక్ కామెడీ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇందులో బిగ్ బాస్ మరాఠీ సీజన్ 5 విన్నర్ సురాజ్ చవణ్ కథానాయకుడిగా నటించాడు. ఒక పొలిటికల్ లీడర్ కూతురి ప్రేమను దక్కించుకోవడానికి హీరో చేసే అడ్వెంచర్ తో ఈ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రొమాంటిక్ కామెడీ సినిమాని చూసి ఎంచక్కా ఎంటర్టైన అవ్వచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే 

2025లో విడుదలైన ఈ మరాఠీ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘జపుక్ జుపుక్’ (Zapuk Zupuk). కేదార్ షిండే డైరెక్షన్ లో ఇది తెరకెక్కింది. ఇందులో సురాజ్ చవణ్ (బిగ్ బాస్ మరాఠీ సీజన్ 5 విన్నర్), జూయి భగవత్ (నారాయణి ) లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2025 ఏప్రిల్ 25న థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మరాఠీ రొమాంటిక్ కామెడీ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : హాంటెడ్ హౌస్ లో మోడ్రన్ భూతాలు… సినిమా డైరెక్టర్ తో మంతనాలు… వాటి జోలికెళ్తే దబిడి దిబిడే

స్టోరీ ఏమిటంటే

సూరజ్ అనే ఒక సామాన్యమైన, అమాయక యువకుడు ప్రేమలో పడతాడు. అయితే అతను శక్తివంతమైన రాజకీయ నాయకుడి కుమార్తె అయిన నారాయణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. సూరజ్ పెద్ద కలలు ఉన్న అబ్బాయి. కానీ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. నారాయణి హృదయాన్ని గెలుచుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే వాళ్ళ అంతస్తులు , సామాజిక అంతరాలలో చాలా తేడా ఉంటుంది. దీంతో సూరజ్ తన స్నేహితుల సహాయంతో, నారాయణి ప్రేమను గెలుచుకోవడానికి ఒక సరదా ప్రయాణం మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో వీళ్ళు ఊహించని సవాళ్లతో విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. సూరజ్ తన ప్రేమను నిజాయితీ, ధైర్యంతో గెలుచుకోవడానికి నానా తంటాలు పడుతాడు.

Advertisement

అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి సూరజ్ ని రౌడీలతో బెదిరిస్తాడు. నారాయణికి వేరొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. దీంతో స్టోరీ క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్లు ఇస్తుంది.  చివరికి నారాయణి ప్రేమను సూరజ్ దక్కించుకుంటాడా ? ఆమె తండ్రి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? సూరజ్ కి ఫ్రెండ్స్ ఏ విధంగా సహాయం చేస్తారు ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ మరాఠీ రొమాంటిక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×