E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ప్లాన్ సక్సెస్ – ట్రాప్ లో పడిపోయిన రాజ్, కావ్య

Brahmamudi Serial Today December 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ప్లాన్ సక్సెస్ – ట్రాప్ లో పడిపోయిన రాజ్, కావ్య
Advertisement

Brahmamudi serial today Episode:  

యాక్టింగ్‌ పిచ్చి ఉన్న ఒక పరోటాలు చేసుకునే వాడి దగ్గరకు వెళ్లి యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ గా యాక్టింగ్‌ చేయమని అందుకోసం పది వేలు అడ్వాన్స్‌ ఇస్తాడు. దీంతో పరోటాలు చేసే మణివర్మను సంతోషంగా యాక్టింగ్‌ ఇరదీస్తాను సార్‌ అంటూ వెళ్లిపోతాడు. రాహుల్‌ మేనేజర్ కు ఫోన్‌ చేసి రాజ్‌ దగ్గరకు పరోటాలు వేసుకునే మణి వర్మను పంపించాలని చెప్తాడు. అలా పంపినందుకు మేనేజర్‌కు పాతిక వేలు ఇస్తానని చెప్తాడు. మేనేజర్‌ సరే అంటాడు. తర్వాతి రోజు రాజ్‌ నిద్ర లేచి రాగానే కిచెన్ లో ఉన్న కావ్య గుడ్‌ మార్నింగ్‌ చెప్తుంది. రాజ్ కూడా గుడ్‌ మార్నింగ్‌ కళావతి అంటూ దగ్గరకు వెళ్తాడు. కావ్య ఏవండి కాఫీ తాగుతారా అని అడుగుతుంది. కాఫీ గీఫీ ఏమీ వద్దు కానీ కళావతి నిన్న నేను చెప్పింది ఏమి ఆలోచించావు అని అడుగుతాడు.. కావ్య దేని గురించి అండి అని అడగ్గానే.. ఏంటి కళావతి అప్పుడే మర్చిపోతే ఎలా మన యాడ్‌ ఫిల్మ్‌లో  మోడల్‌ గా నటించాలని చెప్పాను కదా..? అని రాజ్‌ చెప్పగానే..

ఏవండి.. చూడండి.. ఆ మోడలింగ్‌ నా వల్ల కాదండి.. మీకు నిన్నే చెప్పాను కదా అంటుంది. దీంతో రాజ్‌ కళావతి ఫ్లీజ్‌ టైం లేదు కళావతి.. ఈ ఒక్కసారి ఓకే చెప్పు ఫ్లీజ్‌ ఇంకా చాలా పనులు ఉన్నాయి.. కాదనకు కళావతి అంటూ బతిమాలితే.. నాకు ఇష్టం లేదు.. నన్ను ఎక్కువ బలవంతం చేయకండి అంటూ కళావతి హాల్లోకి వెళ్లిపోతుంది. రాజ్‌ వెనకాలే వెళ్లి కావ్యను బతిమాలుతుంటాడు. ఇంద్రాదేవి కోపంగా రేయ్‌ ఆగరా..? చేయను చేయను అంటుంటే.. దాని వెనకాల పడతావేంట్రా.. అని తిడుతుంది. నాన్నమ్మ నువ్వు ఆగు. నాకు మోడల్‌ దొరక్కా నేను కష్టపడుతుంటే.. మధ్యలో నువ్వు ఆగు అంటాడు.. రాజ్‌. దీంతో ఇంద్రాదేవి మోడ్‌ నీ ఎదురుగానే ఉంది కదరా..? అని చెప్తుంది. దీంతో రాజ్‌ నా ఎదురుగ ఉందా..? ఏది ఎక్కడ ఉంది…? అని అడగ్గానే.. బాగా చూడరా..? నన్ను చూడు.. నేను మోడల్‌ గా పనికిరానా.? నన్ను వాడుకోరా..? అంటూ ఇంద్రాదేవి, సీతారామయ్య ఒక యాక్టింగ్‌ చేసి చూపిస్తారు.

Advertisement

రాజ్‌ ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంటాడు. ఇంతలో అపర్ణ కల్పించుకుని అత్తయ్య నేను చెప్పలేదా.? మీ కాన్సెప్ట్‌ వాడికి నచ్చదని.. మీదంతా ఓల్డ్‌ కాన్సెప్ట్‌ ఇప్పుడు చూడు మేము చూపిస్తాము.. అని అపర్ణ చెప్పగానే.. రాజ్‌ మరింత ఇరిటేటింగ్‌గా మమ్మీ నువ్వు కూడానా..? అంటాడు. అవును రాజ్‌ చూడు మా కాన్సెప్ట్‌ చాలా ట్రెండీగా ఉంటుంది. మాతో యాడ్‌ చేస్తే.. మన కంపెనీ సేల్స్‌ ఎక్కడికో వెళ్లిపోతాయి. అంటూ అపర్ణ, సుభాస్‌ ఒక కాన్సెప్ట్‌ చేస్తారు. యాక్టింగ్‌ అయిపోయాక అపర్ణ ఎలా ఉంది నాన్న మా కాన్సెప్ట్‌ అని అడుగుతుంది. దీంతో రాజ్‌ ఏడుస్తూ.. మమ్మీ ఏమైందే మీకు ఇలా బెదరగొడుతున్నారేంటి..?  నా కంపెనీని ఉంచుతారా..? మూయిస్తారా..? అంటూ బాధపడుతుంటాడు.

ఇంతలో ప్రకాష్‌ వస్తాడు. రేయ్‌ రాజ్‌ వీళ్లందరూ నిన్ను దివాలా తీయించడానికే పూనుకున్నారురా..? ఒక్కసారి నా కాన్సెప్ట్‌ వింటావా..? దిమ్మ తిరిగ పోద్ది అని చెప్పగానే.. రాజ్‌ ఆశ్చర్యంగా బాబాయ్‌ నువ్వు కూడా కాన్సెప్ట్‌ రెడీ చేశావా అని అడుగుతాడు. అవున్రా.. ఒక్కసారి విను.. అదిరిపోతుంది మన కాన్సెప్ట్‌.. అని ప్రకాష్‌ చెప్తాడు. రాజ్‌ ఇరిటేటింగ్‌ గానే.. సరే చెప్పు బాబాయ్‌ అని చెప్పగానే.. ప్రకాష్‌ తన కాన్సెప్ట్‌ మర్చిపోయి ఉంటాడు.. గుర్తుకు రాక ఇబ్బంది పడుతుంటాడు.  రాజ్‌ కావ్యను యాడ్‌ ఫిల్మ్‌కు ఒప్పుకోమని బతిమాలుతాడు.. దీంతో కావ్య మన ఫ్యామిలీ అంతా కలిసి నటిద్దామని చెప్తుంది. రాజ్‌ అందరినీ ఒప్పిస్తాడు.

Advertisement

ఇంతలో రాహుల్‌ అరెంజ్‌ చేసిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ మణివర్మ దుగ్గిరాల ఇంటికి వచ్చి హడావిడి చేస్తుంటాడు. కావ్య అతన్ని అనుమానిస్తుంది.  రుద్రాణి కూడా అనుమానంగా ఒరేయ్‌ రాహుల్ పరోటాలు వేసుకునే వాడిని తీసుకొస్తానని చెప్పావు.. వీడేంటి ఇన్ని కబుర్లు చెప్తున్నాడు అని అడగ్గానే.. స్టేజీ ఆర్టిస్ట్‌ మమ్మీ అందుకే కొంచెం ఓవర్ యాక్టింగ్‌ చేస్తున్నాడు అని చెప్పగానే.. వాడు ఎలా చేస్తే మనకేంటి ఏదో ఈ యాడ్‌ కంప్లీట్‌ అవ్వకుండా చూడటమే కదా మనకు కావాల్సింది అని చెప్తుంది.  మణివర్మ నిజంగానే ఎక్ట్రా చేస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×