E-Paper
Advertisement

Windows 11 shortcuts: విండోస్ 11లో టాప్ 10 కీబోర్డ్ షార్ట్‌కట్స్.. మీ పని సూపర్ ఫాస్ట్ చేసే ట్రిక్స్

Windows 11 shortcuts: విండోస్ 11లో టాప్ 10 కీబోర్డ్ షార్ట్‌కట్స్.. మీ పని సూపర్ ఫాస్ట్ చేసే ట్రిక్స్
Advertisement

Windows 11 keyboard shortcuts| కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు మన రోజువారీ పనులు త్వరగా చేయడానికి సాయం చేస్తాయి. కానీ చాలా మంది సిస్టమ్‌లో మెనూలు నావిగేట్ చేస్తూ ఉండడతో పని చాలా ఆలస్యం అవుతుంది. అందుకే కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఉపయోగిస్తే.. పనులు వేగంగా, స్మార్ట్‌గా పూర్తి అవుతాయి. విండోస్ 11లో రోజువారీ వర్క్‌కి ఉపయోగపడే పవర్‌ఫుల్ షార్ట్‌కట్స్ ఉన్నాయి. కొన్ని కీస్ ఒకేసారి నొక్కితే ఫీచర్స్ ఇన్‌స్టంట్‌గా ఓపెన్ అవుతాయి. దీని మౌస్ క్లిక్స్ తగ్గి ప్రొడక్టివిటీ పెరుగుతుంది.

వాయిస్‌తో టైప్ చేయాలంటే?

షార్ట్‌కట్: Win + H
ఈ షార్ట్‌కట్‌తో వాయిస్ టైపింగ్ స్టార్ట్ అవుతుంది. మైక్‌తో మాట్లాడితే టెక్స్ట్‌గా మారుతుంది. లాంగ్ కంటెంట్ రాసేటప్పుడు టైమ్ సేవ్ అవుతుంది.

డెస్క్‌టాప్ త్వరగా చూడాలంటే ఏం చేయాలి?

Advertisement

షార్ట్‌కట్: Win + D
ఈ షార్ట్‌కట్ ఒక్కసారి నొక్కితే అన్ని ఓపెన్ విండోలు మినిమైజ్ అయి డెస్క్‌టాప్ కనిపిస్తుంది. మళ్లీ నొక్కితే విండోలు తిరిగి వస్తాయి. మల్టీటాస్కింగ్ లేదా ప్రెజెంటేషన్ సమయంలో చాలా ఉపయోగం.

ఓపెన్ యాప్స్ మధ్య త్వరగా స్విచ్ చేయాలంటే?

షార్ట్‌కట్: Alt + Tab
ఈ షార్ట్‌కట్‌తో అన్ని ఓపెన్ యాప్స్ కనిపిస్తాయి. Alt నొక్కి పట్టుకుని Tab నొక్కుతూ యాప్స్ మధ్య మారవచ్చు. టాస్క్‌బార్ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్‌ఫ్లో వేగంగా అవుతుంది.

కంప్యూటర్ త్వరగా లాక్ చేయాలంటే?

Advertisement

షార్ట్‌కట్: Win + L

ఈ షార్ట్‌కట్ ఇన్‌స్టంట్‌గా కంప్యూటర్ లాక్ చేస్తుంది. డెస్క్ వదిలి వెళ్తున్నప్పుడు.. ఈ షార్ట్‌కట్ ఉపయోగపడుతుంది. డేటా సురక్షితంగా ఉంటుంది. ప్రైవసీ, సెక్యూరిటీ పెరుగుతుంది.

ఫైల్ ఎక్స్‌ప్లోరర్ త్వరగా ఓపెన్ చేయాలంటే?

షార్ట్‌కట్: Win + E
ఈ షార్ట్‌కట్‌తో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఇన్‌స్టంట్‌గా ఓపెన్ అవుతుంది. ఫోల్డర్స్, డ్రైవ్స్ త్వరగా యాక్సెస్ చేయొచ్చు. ఫైల్స్ హ్యాండిల్ చేసేవాళ్లకి టైమ్ సేవ్ అవుతుంది.

విండోస్ సెట్టింగ్స్ డైరెక్ట్‌గా ఓపెన్ చేయాలంటే?

షార్ట్‌కట్: Win + I
ఈ షార్ట్‌కట్‌తో సెట్టింగ్స్ యాప్ ఇన్‌స్టంట్‌గా ఓపెన్ అవుతుంది. మెనూలు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ అడ్జస్ట్‌మెంట్స్ సులువు అవుతాయి.

టాస్క్ మేనేజర్ త్వరగా ఓపెన్ చేయాలంటే?

షార్ట్‌కట్: Ctrl + Shift + Esc
ఈ షార్ట్‌కట్ డైరెక్ట్‌గా టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తుంది. Ctrl + Alt + Delete స్క్రీన్ అవసరం లేదు. ఫ్రీజ్ లేదా స్లోడౌన్ సమయంలో ఉపయోగం.

క్లిప్‌బోర్డ్ హిస్టరీ సులువుగా చూడాలంటే?

షార్ట్‌కట్: Win + V
ఈ షార్ట్‌కట్‌తో క్లిప్‌బోర్డ్ హిస్టరీ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. రీసెంట్ కాపీ చేసిన టెక్స్ట్, ఇమేజెస్ కనిపిస్తాయి. రిపీటెడ్ కాపీ పని తగ్గుతుంది.

కస్టమ్ స్క్రీన్‌షాట్ త్వరగా తీయాలంటే?

షార్ట్‌కట్: Win + Shift + S
ఈ షార్ట్‌కట్‌తో స్నిప్పింగ్ టూల్ ఓపెన్ అవుతుంది. కస్టమ్ ఏరియా సెలెక్ట్ చేసి స్క్రీన్‌షాట్ తీయొచ్చు. ఇమేజ్ డైరెక్ట్‌గా క్లిప్‌బోర్డ్‌లో సేవ్ అవుతుంది.

Also Read: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

ఈమోజీ, సింబల్స్ ప్యానెల్ ఓపెన్ చేయాలంటే?

షార్ట్‌కట్: Win + . (పీరియడ్)

ఈ షార్ట్‌కట్‌తో ఈమోజీ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. సింబల్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా దొరుకుతాయి. చాట్స్, డాక్యుమెంట్స్‌లో ఉపయోగం.

ఈ షార్ట్‌కట్స్ ఎందుకు ముఖ్యం?

విండోస్ 11 షార్ట్‌కట్స్ రోజువారీ ప్రొడక్టివిటీ పెంచుతాయి. పనులు త్వరగా పూర్తి అవుతాయి. నేర్చుకుంటే గంటలు సేవ్ అవుతాయి. కంప్యూటర్ వినియోగం స్మూత్ అవుతుంది. ప్రతి విండోస్ 11 యూజర్ ఈ షార్ట్‌కట్స్ మాస్టర్ చేయాలి.

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×