E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఇందుకు ధైర్యం చెప్పిన కావ్య ఆత్మ

Brahmamudi Serial Today Episode April 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  ఇందుకు ధైర్యం చెప్పిన కావ్య ఆత్మ
Advertisement

Brahmamudi serial today Episode:  కావ్య జీవిత చరిత్ర చదివి అలాగే నిద్రలోకి జారుకున్న ఇందు దగ్గరకు కావ్య ఆత్మ వస్తుంది. ఇందును నిద్ర లేపుతుంది. నిద్ర లేసిన ఇందు కావ్యను చూసి ఎమోషనల్‌ అవుతుంది. అమ్మా అంటూ చేయి పట్టుకుని ఏడుస్తుంది. దీంతో కావ్య ఆత్మ ఏమైందమ్మా ఇప్పుడెందుకు అలా బాధపడుతున్నావు అని అడగ్గానే.. ఇందు అమ్మ నన్ను వదిలేసి ఎందుకు వెళ్లిపోయావు అమ్మ అని అడుగుతుంది. దీంతో కావ్య నేను ఎక్కడికి వెళ్లాను.. నీ మనసులోనే ఉన్నాను. నీ ప్రతి ఆలోచనలోనూ నేను ఉన్నాను.. అని చెప్పగానే.. ఇందు ఏడుస్తూనే.. నాకు భయంగా ఉందమ్మా..? అనగానే.. ఎందుకు భయపడుతున్నావు ఇందు అంత కష్టం ఇప్పుడు ఏమి వచ్చింది అని అడగ్గానే..

ఇందు ఏడుస్తూనే.. అమ్మా ఆ రేఖ తాతయ్య వాళ్లను చంపేస్తాను అంది. ఆస్థి కోసం సంతకం పెట్టాలని బెదిరిస్తుంది అంతే కదా అనగానే.. ఇందు ఏడుస్తూనే అంతే అంటావేంటి అమ్మా.. వాళ్లను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదమ్మ అని చెప్పగానే.. కావ్య జవాబు లేని ప్రశ్న అంటూ ఈ లోకంలోనే లేదు ఇందు. నువ్వు ప్రయత్నిస్తే ఈ సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పగానే.. ఇందు ఏడుస్తూనే లేదమ్మా నీ అంత ధైర్యం కానీ నీ అంత తెలివి కానీ నాకు లేవు.. నీలా కష్టం వస్తే నేను యుద్దం చేయలేను అని చెప్పగానే.. కావ్య అలా అని ఎవరన్నారు. నువ్వు నా రక్తానివి నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు.. అని చెప్పగానే.. ఇందు ఏడుస్తూనే లేదమ్మా నేను ఓడిపోయాను.. వాళ్లను కాపాడుకోవడం కోసం ఆస్థి మొత్తం ఇచ్చేయాలని డిసైడ్‌ అయిపోయను. మీ ఆశయాలను ఆశలను నాశనం చేసేశాను. నేను ఈ యుద్దంలో ఓడిపోయాను అమ్మ. నీ కూతురుగా ఉండే అర్హత నాకు లేదమ్మా అని ఏడుస్తుంటే..

Advertisement

కావ్య ఇందును ఓడిలో పడుకోబెట్టుకుని ఇందు అన్ని యుద్దాలు గెలవాలని ఎందుకు అనుకుంటున్నావు..పోనీ నేను ఏమైనా అన్ని యుద్దాలు గెలిచాను అనుకుంటున్నావా..? కొన్నిసార్లు మనకు పోరాడే అవకాశం కూడా ఉందు. కాలం కలిసి రానప్పుడు కలిసొచ్చే వరకు ఎదురుచూడాలి. నువ్వు ఇప్పుడు సంతకం పెట్టినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నీకంటూ ఓ రోజు వస్తుంది. నువ్వు చేసే పనిలో న్యాయం ఉన్నప్పుడు ఈ ప్రకృతే నీకు అండగా నిలబడి నిన్ను గెలిపిస్తుంది. అని చెప్పగానే.. ఇందు అమ్మా తప్పకుండా గెలిపిస్తుందా..? అని అడుగుతుంది.

దీంతో కావ్య తప్పకుండా గెలిపిస్తుంది. కానీ అది జరగాలంటే ముందు నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వు అనుకున్నది సాధించగలను అని నమ్మాలి. అప్పుడు నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఇందు కాస్త జాగ్రత్తగా ఆలోచించు.. ఒక వెలుగులా నీకు మార్గం దొరుకుతుంది నీ మీద నమ్మకం పెట్టుకుని ఆలోచించు అని చెప్పి కావ్య మాయమైపోతుంది.. ఇందు ధైర్యం తెచ్చుకుని అమ్మా నా భయాన్ని దూరం చేయడానికి వచ్చావా..? అమ్మ.. సరే అమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తాను.. నా సమయం వచ్చే వరకు ఎదురుచూస్తాను. కానీ ఆ రేఖను మాత్రం గెలవనివ్వను.. అనుకుని నిద్రపోతుంది ఇందు.

Advertisement

మరుసటి రోజు ఉదయమే ఇందు నిద్రపోతుంటే.. రూంలోకి రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ వెళ్తారు.  గట్టిగా హ్యాపీ బర్తుడే అని చెప్పగానే.. ఇందు ఉలిక్కిపడి నిద్ర లేచి దొంగ దొంగ అంటూ అరుస్తుంది. శేషు వచ్చి ఏంటమ్మా మీ పిన్ని ముఖం దగ్గర నుంచి చూసి దొంగ అనుకుని భయపడ్డావా… అంటాడు. భ్రమరాంబ కోపంగా శేషును తిడుతుంది. తర్వాత అందరూ ఇందుకు బర్తుడే విశెష్‌ చెప్తారు. అపర్ణ మాత్రం కోపంగా చూస్తుంటుంది. ఏంటి రేఖ ఈ దొంగ ప్రేమలు. ఇన్ని రోజుల ఈ ప్రేమ ఎక్కడికి పోయింది అంటూ నిలదీస్తుంది. ప్రేమ చూపిస్తే.. దొంగ ప్రేమ అంటారు. చూపించకపోతే తిడతారు ఏంటి అంటూ వెళ్లిపోతుంది రేఖ. రేఖ వెళ్లిపోయాక ఈ ఆస్థిని ఆ రాక్షసి చేతిలో మాత్రం పెట్టకు అంటూ అపర్ణ చెప్పి వెళ్లిపోతుంది. స్వామి మాత్రం ఏం చేయబోతున్నావు అక్కా అని అడగ్గానే.. తాను సంతకం పెట్టనని కేక్‌ కట్‌ చేశాక పార్టీలోంచి వెళ్లిపోతానని తనను తానే కిడ్నాప్‌ చేసుకుంటానని చెప్తుంది. స్వాతి మాత్రం కన్ఫీజ్‌లో ఉంటుంది.

మరోవైపు అందరూ గెస్ట్‌హౌస్‌ కు వెళ్తారు. అక్కడికి రాజు, లక్కీ వెళ్తారు. ఐశ్వర్యను కలుస్తారు. కిడ్నాప్‌ గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు లోపల బర్తుడే పార్టీకి అందరూ వస్తుంటారు. వారికి రేఖ, భూషణ్‌ స్వాగతం పలుకుతుంటారు. ఇంతలో చక్రి వచ్చి తన అప్పు గురించి గుర్తు చేసి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. దీంతో భూషణ్‌ భయంగా అందరూ వార్నింగ్‌ ఇస్తున్నారు. ఆ ఇందు సంతకం పెడుతుందది కదా అంటాడు. అపశకునం మాట్లాడొద్దని రేఖ తిడుతూ లోపలికి వెళ్తుంది. మరోవైపు రాజు, లక్కీ వెయిటర్స్‌ వేషం వేసుకుని పార్టిలో జాయిన్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×