E-Paper
Advertisement

Trump On Iran: సమయం లేదు మిత్రమా.. ఒక్కరోజులో ఇరాన్ మటాష్, ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump On Iran: సమయం లేదు మిత్రమా..  ఒక్కరోజులో ఇరాన్ మటాష్, ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Trump On Iran: ఇరాన్-అమెరికా మధ్య ఏం జరగబోతోంది? వార్ తీవ్రమవుతుందా? కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ నో చెప్పేసిందా? హోర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదంటోందా? ఒక్కరోజులో ఇరాన్ ను నాశనం చేస్తామని ట్రంప్ ఎందుకన్నారు? తాజాగా పరిణామాలు జఠిలమవుతున్నాయా? అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.

అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనకు నో చెప్పిన ఇరాన్

Advertisement

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాటికి ఇరాన్‌ను తమ అధీనంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. తాము తలచుకుంటే ఒక్క రోజులో మటాష్ అవుతుందన్నారు. అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్‌ తిరస్కరించిన నేపథ్యంలో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సోమవారం రాత్రి వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడాన్ని తాను చాలా నిరాశకు గురయ్యానని వ్యాఖ్యానించారు. ఇంకా ఆలస్యం చేస్తే ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆ దేశాన్ని ఒక్క రాత్రిలో మటాష్ చేయగలమని తేల్చిచెప్పారు.

Advertisement

ఒక్కరోజులో ఇరాన్ మటాష్- ట్రంప్ కీలక వ్యాఖ్యలు

శత్రువుల ప్రాంతాల్లోకి తాము తయారు చేసిన ఎఫ్‌-15 యుద్ధ విమానం దూసుకెళ్లిందన్నారు. తాము ప్రయోగించిన వాటిలో ఒక్కటి మాత్రమే ఆదేశం కూల్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. జెట్‌ పైలట్‌ను రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి రక్షించుకున్నామని, ఈ ఆపరేషన్‌ గురించి ఇరాన్‌కు ముందే తెలిసిందన్నారు.

భూమికి సమీపంలో వచ్చిన యుద్ధ విమానం గురించి ఎవరో విషయాన్ని లీక్‌ చేశారని అన్నారు. తాము ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి 200 మందిని పంపించామని, మా పైలట్‌ను పట్టుకున్న వారికి ఇరాన్‌ బహుమతి ఇచ్చినట్టు గుర్తు చేశారు. అదే సమయంలో ఈ విషయాన్ని లీక్‌ చేసిన అధికారి కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని తేల్చి చెప్పేశారు.

ALSO READ: టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారం.. మూడు విమానాశ్రయాల ధ్వంసం.. ఇరాన్ వైమానిక దళం క్లీన్ స్వీప్..

సహాయక చర్యల కోసం 21 విమానాలను మోహరించినట్లు తెలిపారు. అవి శత్రువుల కాల్పుల మధ్య గంటల తరబడి ప్రయాణించాయని, అమెరికా వద్దనున్న ఓ హెలికాప్టర్‌లో చాలా తూటాలు ఉన్నాయన్నారు. ఇక కాల్పుల విరమణ గురించి తాము చెప్పినట్టు చేయకుంటే వారికి వంతెనలు, విద్యుత్ కేంద్రాలు ఏమీ ఉండవన్నారు.

తాను ఇంతకంటే ముందుకు వెళ్ళనని, వాటి కంటే దారుణమైన విషయాలు ఇంకా ఉన్నాయని చెప్పారు. దేశాల మధ్య పరిస్థితులు జఠిలమైనప్పుడు కాల్పుల విరమణ ప్రతిపాదన చాలా ముఖ్యమైన ముందడుగు అని, కానీ సంఘర్షణను ముగించడానికి అది సరిపోదన్నారు. కాల్పుల విరమణకు 45 రోజుల ఒప్పందం పరిశీలనలో ఉందని వైట్ హౌస్ ధృవీకరించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×