E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కట్లు విప్పేసి వెళ్లిపోమ్మన్న రాజు

Brahmamudi Serial Today Episode April 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు కట్లు విప్పేసి వెళ్లిపోమ్మన్న రాజు
Advertisement

Brahmamudi serial today Episode: స్వాతి పక్కకు వెళ్లి తాను పంపించిన బంటికి ఫోన్‌ చేసి ఓరేయ్‌ అక్క ఎక్కడరా అని అడగ్గానే.. వాడు మాకేం తెలుసు… ఎత్తుకెళ్లిన వాళ్లను అడుగు అని చెప్పగానే.. స్వాతి షాక్‌ అవుతుంది. ఏంట్రా పిచ్చిపిచ్చిగా ఉందా…? మా అక్కను కిడ్నాప్‌ చేయడం వరకే కదా నీ పని మళ్లీ ఫోన్‌ చేసి డబ్బులు అడుగుతున్నారేంటి..? అని అడగ్గానే.. అడ్వాన్స్‌ కూడా తీసుకోకుండా కిడ్నాప్‌ చేయడానికి ఒప్పుకున్నామంటే ఇంకా మా నిజాయితీ అర్తం కాలేదా..? అనగానే.. అంటే మీరు కిడ్నాప్‌ చేయలేదా..? అని స్వాతి అడగ్గానే.. తాము చేయలేదని మేము కిడ్నాప్‌ చేయాలనుకునేలోపే పొగ పెట్టి ఎవడో ఎత్తుకెళ్లాడు అని చెప్తాడు. దీంతో స్వాతి ఫోన్‌ కట్‌ చేసి అక్కను వీళ్లు కిడ్నాప్‌ చేయలేదంటే.. మరెవరు చేసినట్టు అని తిరిగి చూస్తే అపర్ణ మొత్తం విని ఉంటుంది. కోపంగా స్వాతిని కొడుతుంది.

కట్‌ చేస్తే.. రాజుకు వాళ్ల నాన్న ఫోన్‌ చేసి పిచ్చ తిట్టుడు తిడుతుంటాడు. ఆ సాహు గాడి చేత మళ్లీ చేపలు ఎందుకు పంపించావు అని చెప్పగానే.. సాహు వచ్చాడా అని రాజు కంగారుగా అడగ్గానే.. ఆ ఎధవే వచ్చి ఉంటే తిట్లతో కాదు వాతలతో పంపించేవాణ్ని అసిస్టెంట్‌ తో పంపించాడు అసలు ఇవన్నీ వాడితో ఎందుకు చేయిస్తున్నావురా అని అడగ్గానే.. ఇవేమీ నువ్వు పట్టించుకోవద్దు నాన్న నేను చూసుకుంటాను అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు రాజు. లక్కీ భయంగా రేయ్‌ ఏంట్రా ఇదంతా ఆ సాహు గాడు మళ్లీ చేపలు పంపించడం ఏంటి.? గుడిలో పూజలు చేయడం ఏంటి..? అని అడగ్గానే.. నీకు ఇంకా అర్తం కాలేదా..? వాడి పని వీలైనంత త్వరగా చేయకపోతే నీ ఫ్యామిలీ జోలికి మళ్లీ వస్తానని ఇన్‌డైరెక్టుగా వార్నింగ్‌ ఇస్తున్నాడు అని చెప్పగానే..

Advertisement

చూడటానికి రోడ్డు మీద పేపర్లు ఏరుకునే  ముష్టివాడులా ఉంటాడు వాడికి ఇన్ని తెలివితేటలా అనగానే.. రాజు రేయ్‌ ఈ కిడ్నాప్‌ డ్రామాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. డబ్బులు తీసుకుని ఆ అమ్మాయిన పంపించేయాలి అని చెప్పగానే.. ఆ ఇందు మనల్ని చూసింది. ఇప్పుడు డబ్బులు తీసుకుని మనల్ని వెళ్లనిస్తుందా..? నిన్ను చూస్తేనే తొకతొక్కిన పాములా బుస కొడుతుంది అనగానే.. అదే ఇప్పుడు రివర్స్‌ రూట్‌లో వెళ్దాం లోపలికి పద చెప్తాను అంటూ రాజు, లక్కీ లోపలికి ఇందు దగ్గరకు వెళ్తారు. ఇద్దరు కలిసి ఇందు కట్లు విప్పేసి చూడండి మా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నువ్వు ఇంకా బాధపడటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెల్లిపోవచ్చు. కానీ నువ్వు వెళ్లిపోయే ముందు ఇదంతా నేను ఎందుకు చేశానో చెప్పుకోనివ్వు ఇప్పటి వరకు నేను ఒక స్వార్థ పరుడిలాగే నీకు తెలుసు. మోసం చేసి డబ్బులు గుంజే వాడిలాగే తెలుసు. ఇప్పుడు డబ్బుల కోసం కిడ్నాప్‌ చేసే తప్పుడు మనిషిగానే తెలుసు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా..? అని చెప్పగానే..

ఇందు కూడా ఎందుకు అని అడుగుతుంది. దీంతో రాజు నా కుటుంబం కోసం నా వాళ్ల కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పగానే.. ఇందు వాళ్ల కోసం ఇలా చేయడం ఏంటి.? అనగానే.. రాజు అడ్డదారిలోనే సంపాదించాలా అని నువ్వు అనుకోవచ్చు కానీ ఏం చేయమంటావు.. లేచిపోయిన చెల్లెలు.. పారిపోయిన తమ్ముడు.. ఊరి నిండా అప్పులు, రోగిష్టి తల్లి.. పాపిస్టి తండ్రి వీళ్లందరి కష్టాలను తీర్చాలంటే నేను చేసే ఉద్యోగం కానీ శాలరీ కానీ అసలు సరిపోవు అంటూ సెంటిమెంట్‌ డైలాగులు చెప్తుంటాడు రాజు. దీంతో ఇందు నమ్మినట్టు ఇన్ని రోజులు నిన్ను వెధవ అనుకున్నాను కానీ ఈరోజే అర్థం అయింది. అనగానే.. ఏమని అర్థం అయింది అంటూ రాజు అడగ్గానే.. నువ్వు వెధవవి కాదు వెధవన్నర వెధవవి అని అంటూ అక్కడే ఉన్న చీపురు తీసుకుని ఇద్దరిని కొడుతుంది. డోర్‌ లాక్‌ చేసి బయటకు పారిపోతారు రాజు, లక్కీ.

Advertisement

స్వాతి, అపర్ణకు నిజం చెప్తుంటే.. నందు వింటుంది. దగ్గరకు వెళ్లి ఎలాగైనా అక్కను నేను పట్టుకుంటాను మీరు టెన్షన్‌ పడకండి అంటూ భరోసా ఇస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రేఖ డల్లుగా వస్తుంటే.. భ్రమరాంబ ఎందుకు డల్లుగా ఉన్నావని అడగ్గానే.. వాడు అడిగింది రూపాయి రెండు రూపాయలు కాదు కదా ఎలా అని ఆలోచిస్తున్నాను అని చెప్తుండగానే.. రాజు, రేఖకు కాల్‌ చేస్తాడు. నందు ట్రేస్‌ చేస్తుంటుంది. ఐశ్వర్య టెన్షన్‌ పడుతుంది. వీళ్లను నమ్మి ఈ కిడ్నాప్‌ డ్రామాలో ఇరుక్కుపోయేలా ఉన్నాను అని మనసులో అనుకుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×