E-Paper
Advertisement

సిగరెట్, గాంజా తాగేవారి మెదడులో తీవ్ర మార్పులు.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

సిగరెట్, గాంజా తాగేవారి మెదడులో తీవ్ర మార్పులు.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
Advertisement

smoking brain shrinkage| పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. పొగ తాగే అలవాటు ఉన్నవారి ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అయితే ఇటీవలే జరిగిన ఒక అధ్యయనంలో ఆశ్చర్యకర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. పొగతాగడం కారణంగా మనిషి మెదడు చాలా హాని జరుగుతోంది.

ఈ అధ్యయనంలో సాధారణ పొగాకు (సిగరెట్), గాంజా తాగేవారు.. రెండు రకాల వ్యక్తులు పాల్గొన్నారు. సాధారణంగా వయసు పెరిగే కొద్ది మనిషి మెదడు సైజు తగ్గుతూ వస్తుంది. కానీ పొగతాగే వారిలో సాధారణం కంటే వేగంగా మెదడు సైజు తగ్గిపోతోంది. ఇది చాలా హానికర విషయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

పొగతాగడం మెదడును ఎలా దెబ్బతీస్తుంది?

Advertisement

సిగరెట్, గాంజా లాంటి పదార్థాల్లో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ధూమపానం చేసే సమయంలో ఈ రసాయనాలు శరీరంలోకి వెళ్తాయి. ఈ రసాయనాలు మెదడు కణాల్లో ఒత్తిడిని సృష్టిస్తాయి. దీని వల్ల వాపు, కణాలకు నష్టం జరుగుతుంది. కాలక్రమేణా మెదడు కణాలు చనిపోతాయి. ఇది మెదడు పరిమాణం తగ్గడానికి, మెదడు పనితీరు తగ్గడానికి దారితీస్తుంది. దీంతో పాటు ఆలోచించే సామర్థ్యం, జ్ఞాపకశక్తి భావోద్వేగ నియంత్రణపై ప్రభావం చూపుతుంది.

మెదడులో ముఖ్య భాగాలపై ప్రభావం

ఈ అధ్యయనం ప్రకారం గాంజా వాడకం వల్ల అమిగ్డాలా అనే భాగం చిన్నగా మారుతుంది. ఈ భాగం భావోద్వేగాలు, భయాన్ని నియంత్రిస్తుంది. అమిగ్డాలా కుచించుకుపోతే.. ఆందోళన, తప్పు నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంటుంది. పొగాకు వల్ల మెదుడులోని ఇన్సులా, పాల్లిడం భాగాలు కూడా దెబ్బతింటాయి. ఇవి శరీర కదలికలు, అవగాహనను నియంత్రిస్తాయి.

జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంపై ప్రభావం

Advertisement

పొగతాగడం హిప్పోకాంపస్ అనే భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మెదడులోని ఈ భాగం జ్ఞాపకాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సంబంధించినది. ఎక్కువ పొగతాగడం వల్ల హిప్పోకాంపస్ పరిమాణం తగ్గి జ్ఞాపకశక్తి తగ్గడం, గందరగోళం వచ్చే అవకాశం ఉంటుంది. మెదడులోని గ్రే మ్యాటర్ కూడా తగ్గుతుంది. దీని వల్ల నిర్ణయాలు తీసుకోవడం, సమాచారాన్ని ప్రాసెస్ చేయడం కష్టమవుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి సామర్థ్యం భారీగా తగ్గిపోతుంది.

Also Read: మీ పిల్లాడు గుంపులో తప్పిపోయినా సురక్షితంగా తిరిగి వస్తాడు.. తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు పాటించాలి

పొగాకు, గాంజా కలిపి ధూమపానం చేయడం మరింత హానికరం

పొగాకు, గాంజా రెండింటినీ కలిపి ధూమపానం చేయడం వల్ల నష్టం భారీ స్థాయిలో ఉంటుంది. రెండు పదార్థాలు మెదడుపై వేర్వేరు విధంగా పని చేసి మెదడు కుంచించిపోవడాన్ని వేగవంతం చేస్తాయి. ఇది మానసిక ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ అసమతుల్యత, ప్రవర్తనా సమస్యలను పెంచుతుంది.

పొగాకు, గాంజా రెండూ కూడా మెదడు ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ఇది మెదడు కుంచించిపోవడాన్ని వేగవంతం చేసి జ్ఞాపకశక్తి, భావోద్వేగాలు, ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ అలవాట్లు మానేయడం ద్వారా మీ మెదడును రక్షించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని దీర్ఘకాలం కాపాడుకోవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×