E-Paper
Advertisement

Bigg Boss syed Sohel: అమ్మను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ సోహెల్…భరోసా ఇచ్చిన అలీ..

Bigg Boss syed Sohel: అమ్మను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న బిగ్ బాస్ సోహెల్…భరోసా ఇచ్చిన అలీ..
Advertisement

Bigg Boss syed Sohel: బుల్లితెర నటుడుగా పలు సీరియల్స్ లో నటించి అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సయ్యద్ సోహెల్(Syed Sohel) ఒకరు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈయన అనంతరం పలు సినిమాలలో హీరోగా అవకాశాలను అందుకున్నారు అయితే సోహెల్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి ఈ నేపథ్యంలోని ఈయన తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ(Seidevi Drama Company) కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో భాగంగా ఆలీ దంపతులతో పాటు పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొని సందడి చేశారు.

అమ్మను మిస్ అవుతున్నాను..

ఇక ఈ ప్రోమోలో భాగంగా మొదటి సారి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో రంజాన్ సెలబ్రేషన్స్ నిర్వహించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా అలీ దంపతులు అక్కడ ఉన్నవారికి బిర్యానీ షేర్ కుర్మా తయారు చేసుకొచ్చి అందరికీ కడుపునిండా పెట్టారు.. ఈ నేపథ్యంలోనే సోహెల్ తన అమ్మను తలుచుకొని ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ అమ్మను చాలా మిస్ అవుతున్నాను.. అమ్మకు సర్జరీ అయిన పది రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను. అమ్మను అలా చూసేసరికి తన బాధ ఏంటో అర్థమైందని తెలిపారు.

మా ఇంటికి రా.. మీ అమ్మ నీతోనే ఉంటుంది..

Advertisement

మనం ఇంటికి రాగానే అమ్మ ఎలా ఉన్నావురా అని అడిగితే మనిషికి వచ్చే ధైర్యమే వేరు అంటూ సోహెల్ తన తల్లి మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవ్వడంతో ఆలీ మాట్లాడుతూ ఏ పండగకైనా నువ్వు మా ఇంటికి రా.. మా ఇంటికి వస్తే మీ అమ్మ నీతోనే ఉన్నట్టు ఉంటుంది. మీ అమ్మ చేసినట్టుగానే షేర్ కూర్మా కూడా ఉంటుంది. నువ్వు అసలు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసేయ్ అంటూ అలీ సోహెల్ ను ఓదారుస్తూ తనని ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఒక భరోసా కల్పించారు.

Advertisement

ఇలా సోహెల్ తల్లి మరణంతో ఎంతో ఎమోషనల్ అయిన నేపథ్యంలో ఆలీ మాట్లాడిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా అలీ భార్య జుబేదా స్వయంగా తయారు చేసిన బిర్యానీ అందరికీ స్వయంగా ఆలీ దంపతులు వడ్డించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి రష్మి యాంకర్ గా వ్యవహరించగా ఇంద్రజ జడ్జిగా కొనసాగుతున్నారు జబర్దస్త్ కమెడియన్లు ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇక ఈవారం రంజాన్ సెలబ్రేషన్స్ జరుపుకున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై మల్లెమాల వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: Sridevi Drama Company: టీవీ చరిత్రలోనే మొదటి సారి… శ్రీదేవి డ్రామా కంపెనీ పై ప్రశంసలు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×