E-Paper
Advertisement

YS Jagan: కొడుకు అట్లా.. బావమరిది ఇట్లా, ఇది రాష్ట్రంలో పాలన: వైఎస్ జగన్

YS Jagan: కొడుకు అట్లా.. బావమరిది ఇట్లా, ఇది రాష్ట్రంలో పాలన: వైఎస్ జగన్
Advertisement

తెలుగుదేశం పార్టీ నేతల ప్రవర్తన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సాగుతున్న అరాచకాలను ఎండగట్టారు. రాష్ట్రంలో మహిళల భద్రత గాలికి వదిలేశారని.. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి వారికి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

పార్లమెంటు చరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ తొలి ఎంపీగా టీడీపీకి చెందిన పుట్టా మహేష్ రికార్డు సృష్టించారని జగన్ ఎద్దేవా చేశారు. ఇలాంటి ఘటనలు పుట్టా మహేష్‌తోనే ఆగిపోలేదని.. ఆదినారాయణరెడ్డి కుమారుడు సైతం డ్రగ్స్ కేసులో దొరికినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పాలకుడిగా తప్పు చేసిన వారిని కట్టడి చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నేరస్థులకు కొమ్ముకాసే మనస్తత్వం ఉండబట్టే రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

వైసీపీ హయాంలో మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తే.. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరులు రెచ్చిపోతున్నారని జగన్ పేర్కొన్నారు. కోనేటి ఆదిమూలం వంటి నేతలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే.. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి పంచాయితీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను వేధించిన కూన రవికుమార్ మీద గానీ.. అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద గానీ ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రి సంధ్యారాణి పీఏ నుంచి ప్రస్తుత టీటీడీ చైర్మన్ వరకు అందరిపై ఆరోపణలు ఉన్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం దారుణమన్నారు.

Advertisement

చంద్రబాబు కుటుంబ సభ్యుల ప్రవర్తనను కూడా జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. లోకేష్ స్విమ్మింగ్ పూల్స్ దగ్గర మద్యం తాగుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేసినా.. బాలకృష్ణ బహిరంగంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు నవ్వుతూ ఊరుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు. ‘అమ్మాయిలు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి.. కడుపైనా చేయాలి’ అని బాలకృష్ణ అంటే.. పీక మీద ఒకటి కొట్టాల్సింది పోయి.. తాను చిన్నప్పుడు ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు సమర్థించుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదని.. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని జగన్ విమర్శించారు.

ALSO READ: Moinabad Drugs Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సంచలన నిజాలు.. పోలీసులపైకి కాల్పులు జరపాలని రోహిత్ రెడ్డి ఆదేశం!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×