E-Paper
Advertisement

“నీ ముఖానికి బంగారు గొలుసా?” అవమానంతో చనిపోవాలనిపించింది -బిగ్ బాస్ ఫేమ్

“నీ ముఖానికి బంగారు గొలుసా?” అవమానంతో చనిపోవాలనిపించింది -బిగ్ బాస్ ఫేమ్
Advertisement

Bigg Boss: రంగుల ప్రపంచంలో రాణించాలని ఎంతోమంది కలలు కంటారు, కానీ ఆ ప్రయాణం అందరికీ పూలబాట కాదు. కన్నడ నటి, బిగ్ బాస్ ఫేమ్ రాశిక శెట్టి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న దారుణమైన అవమానాలను తలచుకుని కంటతడి పెట్టారు. “నీ ముఖానికి నిజమైన బంగారు గొలుసు వేసుకునే సీన్ ఉందా?” అంటూ ఆడిషన్స్‌లో తనను ఘోరంగా హేళన చేశారని, ఆ బాధతో ఒకానొక దశలో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుదలతో పోరాడి నేడు గుర్తింపు తెచ్చుకున్న ఆమె స్ఫూర్తిదాయక జర్నీ విశేషాలు చూద్దాం..

సూటిపపోటి మాటలతో విమర్శలు..

ఆడిషన్స్‌లో ఎదురైన అవమానాల పర్వం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో రాశిక శెట్టికి ఎదురుదెబ్బలు మామూలుగా తగలలేదు. ప్రోత్సహించాల్సిన వారే సూటిపోటి మాటలతో విమర్శలు చేసేవారట. ముఖ్యంగా ఒక ఆడిషన్ సమయంలో పారితోషికం లేదా నగల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. “నీ ముఖానికి నిజమైన బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా?” అని ముఖం మీదే అనడంతో ఆమె షాక్ అయ్యారు. ఆ మాటలు ఆమె మనసును తీవ్రంగా గాయపరిచాయి. ఇక అవకాశాలు ఇవ్వకపోగా, ఇలాంటి వెటకారపు మాటలతో వేధించడం ఆమెను మానసికంగా ఎంతో కుంగదీసింది.

చేజారిన అవకాశాలు.. గుండెకోత:

Advertisement

కేవలం మాటలతోనే కాకుండా, పరిస్థితులు కూడా రాశికను పరీక్షించాయి. ఎంతో కష్టపడి ఆడిషన్స్ ఇచ్చి ఒకట్రెండు అవకాశాలు దక్కించుకున్నా, షూటింగ్ మొదలయ్యే చివరి నిమిషంలో ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించేవారట. వచ్చిన ఛాన్స్ చేజారిపోవడంతో “అసలు నావల్ల అవుతుందా?” అని తనలో తానే మథనపడేవారు. ఇక రంగుల ప్రపంచం అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, దాని వెనుక ఇంతటి కఠినమైన అవమానాలు, కన్నీళ్లు ఉంటాయని ఆమె తన చేదు అనుభవాలను పంచుకున్నారు.

వెనకడుగు వేయని వైనం:

ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు పడ్డా రాశిక శెట్టి ఎక్కడా వెనకడుగు వేయలేదు. తనకంటూ ఒక రోజు వస్తుందని, తనను హేళన చేసిన వారికే తన నటనతో సమాధానం చెప్పాలని నిశ్చయించుకున్నారు. ఆ మొండి పట్టుదలే ఆమెను ఇండస్ట్రీలో నిలబెట్టింది. కన్నడ బిగ్ బాస్ 12వ సీజన్‌లో పాల్గొని తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఇక ఆ గుర్తింపుతో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ తన ఆత్మస్థైర్యాన్ని నిరూపించుకున్నారు.

Advertisement

ALSO READ:ముగిసిన వివాదం.. విడుదలకు సిద్ధమవుతున్న జననాయగన్!

విజయంతోనే తగిన బుద్ధి:

రాశిక శెట్టి కేవలం కన్నడలోనే కాకుండా, తెలుగులో కూడా ‘సందేహం’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. “నన్ను తక్కువ చేసిన వారే నేడు నా ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతున్నారు” అని ఆమె గర్వంగా చెబుతున్నారు. ముళ్ల దారిని దాటుకుని వచ్చిన ఈ బిగ్ బాస్ బ్యూటీ జర్నీ.. ఎంతోమంది వర్ధమాన నటీనటులకు ఒక గొప్ప పాఠం. ఇక ఎవరో అన్న మాటలకు కుంగిపోకుండా, మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదో ఒక రోజు విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుందని రాశిక నిరూపించారు!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×