E-Paper
Advertisement

Beauty Juices: వేసవిలో ఈ జ్యూసులు రోజూ తాగారంటే చర్మం మెరిసిపోతుంది

Beauty Juices: వేసవిలో ఈ జ్యూసులు రోజూ తాగారంటే చర్మం మెరిసిపోతుంది
Advertisement

వేసవి కాలం మొదలైతే చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. ఎండ తీవ్రత వల్ల చర్మం పొడిబారడం, పేలవంగా మారడం, ట్యాన్ పట్టడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. అప్పుడు క్రీములు, లోషన్లు తెగ వాడేస్తూ ఉంటారు. కానీ శరీరాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం కొన్ని సహజ పండ్ల జ్యూసులు వేసవిలో చర్మానికి సహజమైన కాంతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పదార్థాలతో తయారు చేసిన జ్యూసులు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

పుచ్చకాయ – పుదీనా జ్యూస్
పుచ్చకాయ-పుదీనా జ్యూస్ వేసవిలో ఉత్తమ పానీయం అని చెప్పవచ్చు. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉండటం వల్ల శరీరం చల్లబడుతుంది, డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. ఇందులో ఉన్న లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. అలాగే పుదీనా జీర్ణక్రియను మెరుగుపరచి చర్మం క్లియర్‌గా ఉండటానికి సహాయపడుతుంది. అదే విధంగా కీరదోసకాయ,సెలరీ జ్యూస్ కూడా మంచిదే. ఇందులో చక్కెర తక్కువగా ఉండటంతో మొటిమల సమస్య ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కీరదోసకాయలోని సిలికా చర్మాన్ని బిగుతుగా ఉంచుతే, సెలరీ శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపిస్తుంది.

Advertisement

Also read: Cashew: జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా? నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు

క్యారెట్ – బీట్ రూట్ జ్యూస్
క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ చర్మానికి సహజ గ్లో ఇచ్చే మరో మంచి డ్రింక్. క్యారెట్‌లో ఉన్న బీటా కెరోటిన్, బీట్‌రూట్‌లో ఉన్న ఐరన్ రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీని వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే ఆరెంజ, నిమ్మ జ్యూస్‌లో విటమిన్ C అధికంగా ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మృదువుగా మారుతుంది. పిగ్మెంటేషన్ తగ్గి చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇవి వృద్ధాప్య లక్షణాలను కూడా ఆలస్యం చేయడంలో సహాయపడతాయి.

Advertisement

Also read: Papaya: ఖాళీ పొట్టతో నెలరోజులు బొప్పాయి తింటే… శరీరంలో జరిగే మార్పులు ఇవే

అలోవెరా – ఆమ్లా జ్యూస్
అలొవెరా, ఆమ్లా జ్యూస్ కూడా చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇది పొట్ట హెల్త్‌ను మెరుగుపరచి దాని ప్రభావాన్ని చర్మంపై చూపిస్తుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి చర్మ రక్షణ పొర బలపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మొత్తంగా చూస్తే, ఈ సహజ జ్యూసులను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. వేసవిలో కూల్‌డ్రింక్స్, కాఫీ లాంటి వాటికి బదులుగా ఈ జ్యూసులను తీసుకోవడం మంచిది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×