E-Paper
Advertisement

Prerana Kambam: గుడ్ న్యూస్ చెప్పిన బుల్లితెర నటి ప్రేరణ.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Prerana Kambam: గుడ్ న్యూస్ చెప్పిన బుల్లితెర నటి ప్రేరణ.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!
Advertisement

Prerana Kambam: ప్రేరణ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఈమె బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రేరణ ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత కెరియర్ పరంగా ప్రేరణ పెద్దగా అవకాశాలను అందుకోలేదని చెప్పాలి .కేవలం బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే ప్రేరణ తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ప్రేరణ సోదరి ప్రాకృతి..

ప్రేరణకు ఒక చెల్లెలు ప్రాకృతి(Prakruthi) ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నారు. ఇటీవల పలు బుల్లి తెర కార్యక్రమాలలో కూడా ప్రాకృతి సందడి చేశారు. అలాగే ఆహాలో ప్రసారమైన డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ప్రాకృతికి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రాకృతికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ప్రేరణ తెలియజేశారు. తన చెల్లెలు ప్రాకృతి ఆమె ప్రేమించిన వ్యక్తి సుదర్శన్(Sudarshan) తో కలిసి ఏడు అడుగులు నడిచినట్టు తెలుస్తుంది ఇలా వీరిద్దరి పెళ్లి ఫోటోలను ప్రేరణ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ప్రియుడిని పెళ్లి చేసుకున్న ప్రాకృతి..

Advertisement

ప్రాకృతి సుదర్శన్ పెళ్లి వేడుకలలో భాగంగా సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ప్రాకృతి తన జీవితంలో దొరికిన ప్రేమ సుదర్శన్ కలిసి ఏడడుగు వేశారని, మీరిద్దరూ జీవితాంతం ఇంతే ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ వీరి పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలపై అభిమానులు కూడా స్పందిస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి దుస్తులలో కొత్తజంట ఎంతో చూడముచ్చటగా ఉంది అంటూ కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక ప్రేరణ గత రెండు సంవత్సరాల క్రితం ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. తన కాలేజ్ ఫ్రెండ్ శ్రీపాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో ప్రేరణ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక ఈమె పెళ్లైన రెండు సంవత్సరాలకి తన చెల్లెలు కూడా కొత్త జీవితంలోకి అడుగుపెట్టడంతో తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక పెళ్లయిన వెంటనే ప్రేరణ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు ఈ కార్యక్రమం అనంతరం ఈమె తన భర్తతో కలిసి ఇస్మార్ట్ జోడిలో పాల్గొని ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే.

Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడి, ఎన్టీఆర్ కలిసి చదువుకున్నారా?బయట పెట్టిన డైరెక్టర్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×