E-Paper
Advertisement

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం.. స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యుల డిమాండ్.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమం.. స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యుల డిమాండ్.
Advertisement

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్న ఆయన కుడి కన్ను ‘సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్’ (CRVO) అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. దీనికి తక్షణమే మెరుగైన చికిత్స అందించకపోతే ఆయన శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ హెచ్చరించింది.

జైలు నిబంధనలు – వైద్యుల సూచనలు..

Advertisement

జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను పరీక్షించిన నిపుణులు, ఈ కంటి సమస్య అత్యంత సున్నితమైనదని, దీనికి ఆపరేషన్ థియేటర్, ప్రత్యేక వైద్య సదుపాయాలు అవసరమని సూచించినట్లు పీటీఐ తెలిపింది. అయితే, జైలు అధికారులు మాత్రం ఆయనను జైలు లోపలే ఉంచి చికిత్స అందించాలని పట్టుబట్టడంపై పార్టీ మండిపడింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఆయన ప్రాణాలతో, ఆరోగ్యంతో ఆడుకుంటోందని ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే ఆయనకు ఇష్టమైన ఆసుపత్రికి (షౌకత్ ఖానుమ్ ఆసుపత్రి వంటివి) తరలించాలని డిమాండ్ చేసింది.

కోర్టు ఆదేశాల ఉల్లంఘన.. 

Advertisement

ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, గత ఏడాది అక్టోబర్ నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన వ్యక్తిగత వైద్యుడు కలవకుండా అడ్డుకుంటున్నారని పీటీఐ పేర్కొంది. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లు ఆగస్టు 2025 నుండి పెండింగ్‌లో ఉన్నాయని, ఇది ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కుటుంబ సభ్యుల సందేహాలు.. 

మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖానుమ్, నొరీన్ ఖానుమ్ జైలు అధికారుల తీరును తప్పుపట్టారు. తమకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదని వారు పేర్కొన్నారు. ‘ఈ వార్తలు నిజమైతే మాకు ఎందుకు చెప్పలేదు? అసలు ఈ సమాచారం బయటకు ఎలా వచ్చింది?’ అని అలీమా ఖానుమ్ ప్రశ్నించారు. కేవలం సమాచార లీకేజీలతో గందరగోళం సృష్టించడం కాకుండా, ఆయనను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పీటీఐ చైర్మన్ బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో కొత్త పిటిషన్ వేశారు. జైలులో ఉన్న ఖాన్ మరియు ఆయన భార్య బుష్రా బీబీ ఇద్దరి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మే 9 అల్లర్ల కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు, తోషాఖానా కేసులో బుష్రా బీబీకి మధ్యంతర బెయిల్‌ను కోర్టు ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది

ALSO READ: IND VS NZ 4th T20: చెల‌రేగిన న్యూజిలాండ్…ఇండియా ముందు భారీ టార్గెట్..ఎంతంటే ?

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×