E-Paper
Advertisement

గుడ్ న్యూస్ చెప్పిన తమన్నా… బేబీ బంప్ ఫోటోలు వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన తమన్నా… బేబీ బంప్ ఫోటోలు వైరల్!
Advertisement

Tamanna Simhadri: తమన్నా సింహాద్రి పరిచయం అవసరం లేని పేరు. ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు పొందిన ఈమె బిగ్ బాస్ సీజన్ 3(Bigg Boss 3) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని ఎంతో మంచి ఆదరణ పొందారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్న తమన్నా సింహాద్రి ఇటీవల తన అభిమానులకు వరుసగా షాకింగ్ న్యూస్ తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా ట్రాన్స్ జెండర్ గా ఉన్నటువంటి వారిని ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు కానీ ఈమె ఇటీవల పెళ్లి చేసుకున్నట్లు తెలియజేశారు.

ప్రెగ్నెన్సీ ప్రకటించిన తమన్నా..

తమన్నా సింహాద్రి తన భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తనకు వివాహమైన విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి ఒక పల్లెటూర్లో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నానని తన భర్త గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇలా ఈమెకు పెళ్లి జరిగిందని చెప్పిందో లేదో అప్పుడే మరో గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా బేబీ బంప్(Baby Bump) ఫోటోలను షేర్ చేస్తూ తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించారు.

స్పెషల్ ట్రీట్మెంట్ ద్వారా తల్లి కాబోతున్న తమన్నా..

Advertisement

ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ద్వారా తమన్న తల్లి కాబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ట్రాన్స్ జెండర్ ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటే ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పాలి. తమన్నా తల్లి కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. మరి కొంతమంది ఇది ఎలా సాధ్యం అంటూ కూడా సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా తమన్నా తల్లి కాబోతున్నాననే విషయాన్ని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత కొద్దిరోజుల క్రితం ఈమె తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఆయన ఎవరు? ఏంటి? అనే వివరాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.

Advertisement

ఇక తమన్నా లింగమార్పిడి చేయించుకోవడానికి గల కారణాలను పలు సందర్భాలలో తెలియజేశారు. ఈమె అసలు పేరు మస్తాన్. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. నాన్నకు అబ్బాయి కావాలని కోరిక ఉండేది అమ్మకు అమ్మాయి కావాలని కోరిక ఉండేది దీంతో ఇద్దరు దర్గా వద్ద మొక్కుకున్నారని, అయితే తాను అమ్మాయి లక్షణాలతో అబ్బాయిగా పుట్టానని తెలియజేశారు. ఇలా తనకు అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముంబై వెళ్లి లింగ మార్పిడి చేయించుకున్నానని ఇలా లింగ మార్పిడి తర్వాత మస్తాన్ గా ఉన్న తన పేరును కాస్త తమన్నగా మార్చుకున్నానని తెలియజేశారు. ఇక ఈమె ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత బిగ్ బాస్ 3 లో అవకాశాన్ని అందుకున్నారు .అక్కడ యాంకర్ శ్రీముఖి(Sreemukhi)తో చాలా మంచి పరిచయం ఏర్పడింది. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తనను శ్రీముఖి ఆదరించిందని, ఆమె వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ శ్రీముఖితో తన బంధం గురించి పలు సందర్భాలలో బయటపెట్టారు.

Also Read: పెద్ది స్పెషల్ సాంగ్.. రంగంలోకి బాలయ్య బ్యూటీ.. ఈసారైనా ఫైనల్ అయ్యేనా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×