E-Paper
Advertisement

బాబర్ ఆజం ముందు స‌చిన్ దేనికి ప‌నికిరాడు..వాడు పాకిస్తాన్ లోనే మొన‌గాడు

బాబర్ ఆజం ముందు స‌చిన్ దేనికి ప‌నికిరాడు..వాడు పాకిస్తాన్ లోనే మొన‌గాడు
Advertisement

Ramiz Raja: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ఒకవైపు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ మరోవైపు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇండియా పై పాకిస్తాన్ నిత్యం ఏదో ఒక విషయంలో విషం కక్కుతూనే ఉంది. అయితే తాజాగా మాజీ టీమిండియా స్టార్ ఆటగాడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ను ( Sachin Tendulkar) ఉద్దేశించి, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ( Ramiz Raja). సచిన్ టెండూల్కర్ కంటే పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం ( Babar Azam) తోపు ఆటగాడని బాంబు పేల్చాడు. బాబర్ ఆజం ఆట తీరు ముందు సచిన్ టెండూల్కర్ దేనికి పనికిరాడు అంటూ పరువు తీశాడు. దీంతో రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్నో సెంచరీలు, రికార్డులు సృష్టించిన స‌చిన్ టెండూల్క‌ర్ ను ఇలా కించ‌ప‌ర‌చ‌డంపై మండిప‌డుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్‌.

Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్ల‌లో ర‌బ్బ‌ర్లు…అందుకే అవ‌లీలగా సిక్సులు, బౌండ‌రీలు కొడుతున్నాడు

బాబర్ ముందు స‌చిన్ దేనికి ప‌నికిరాడు..వాడు పాకిస్తాన్ లోనే మొన‌గాడు

Advertisement

బాబర్ ఆజాం, సచిన్ టెండూల్కర్ మధ్య కోతికి కొండెంగకు ఉన్నంత తేడా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ శిఖ‌రం అయితే.. బాబర్ ఆజం బాల్ బచ్చా గాడు. అయితే అలాంటి బాల్ బచ్చా బాబర్ ఆజంను సచిన్ టెండూల్కర్ తో పోల్చుతూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు ర‌మీజ్ రాజా వివాదానికి తెర లేపాడు. సచిన్ టెండూల్కర్ కంటే భయంకరమైన ఆటగాడు బాబర్ ఆజం అంటూ వ్యాఖ్యానించాడు. ఇండియాలో సచిన్ టెండూల్కర్ ఉంటే.. పాకిస్తాన్ కు బాబర్ ఆజం ఉన్నాడని వెల్లడించాడు. బాబర్ ఆజం ముందు దేనికి పనికిరాడు అంటూ విమర్శలు చేశాడు. వరల్డ్ నెంబర్ వ‌న్‌ బౌలర్లను కూడా గజగజ వణికించాడని బాబర్ ఆజాంను మెచ్చుకున్నాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో బాబర్ ఆజం తడబడుతున్నాడని.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాడని వెల్లడించారు. త్వరలోనే మళ్లీ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అవుతాడని కూడా అంచనా వేశారు ర‌మీజ్ రాజా. దీంతో ర‌మీజ్ రాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

బాబ‌ర్‌, స‌చిన్ ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్ ?

సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేలలో 49 సెంచరీలు నమోదు చేసుకున్నాడు. మొత్తంగా 100 సెంచరీలు నమోదు చేసిన మొనగాడు సచిన్ టెండూల్కర్. అలాగే 200 టెస్టులు ఆడిన సచిన్ టెండూల్కర్… 463 వన్డేలు ఆడాడు. టీమిండియా కు ఎన్నో విజయాలు కూడా అందించాడు సచిన్. ఇక బాబర్ విషయానికి వస్తే, సచిన్ అనుభవంలో 25% కూడా బాబర్ ఎలాంటి రికార్డులు సాధించలేదు. ఇప్పటివరకు బాబర్.. వన్డేలలో 20 సెంచరీలు నమోదు చేయగా అర్థ సెంచ‌రీలు 37 చేశాడు. టి20 లలో మూడు సెంచరీలు చేసిన బాబర్.. 39 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో తొమ్మిది సెంచరీలు చేసిన బాబర్.. 30 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. ఇలాంటి నేపథ్యంలో సచిన్ రికార్డులను బాబర్ దాటడం ఏమాత్రం సాధ్యం కాదు. అలాంటి ప్లేయర్ను పట్టుకొని.. సచిన్ తో పోల్చుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: Sam Billings: న‌మాజ్ చేయాల‌ని రిజ్వాన్ టార్చ‌ర్ చేస్తున్నాడు..డ్రెస్సింగ్ రూంలో న‌ర‌కం చూపిస్తున్నాడు

 

?igsh=MXgzdGd0d3B4cWR3NA==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×