Aswini Sree:అశ్విని శ్రీ పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టెంట్ గా సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన అశ్విని పలు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అలాగే ఈమె సినిమాలలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇలా వెండితెరపై బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అశ్విని సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.
అశ్విని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొందని తెలుస్తుంది. అశ్విని శ్రీ ఎంతో ఇష్టంగా పెంచుకున్న తన పెంపుడు కుక్క సోను(Sonu) మరణించినట్లు ఈమె తెలియజేశారు. సోను చనిపోవడంతో ఆ బాధ భరించలేనంటూ ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తన పెట్ డాగ్ సోనూ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయినట్లు తెలియచేశారు. అయితే తన పెంపుడు కుక్కకు ఏ విధమైనటువంటి సింటమ్స్ కానీ బయటపడలేదని అందుకే తాను సోను పట్ల నెగ్లెట్ చేశానని, సోను కూడా చాలా ఆరోగ్యంగా కనిపించేదని తెలిపారు.
సోను చాలా ఆరోగ్యంగా కనిపించినప్పటికీ లోపల మాత్రం తన కండిషన్ బాగాలేదని ఈ విషయాన్ని తాము ముందుగానే గ్రహించి ఉంటే కాపాడుకునే వాళ్ళం ఇప్పుడు నాకు మరో దారి లేకుండా పోయింది. ఎవరు కూడా ఇలాంటి పొరపాటు చేయద్దని తప్పకుండా రెగ్యులర్ హెల్త్ చెకప్ కి తీసుకెళ్లండి అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా తన పెట్ డాగ్ మరణించడంతో అశ్విని కన్నీరు మున్నీరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఏం బాధపడకండి సోను ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుంది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం బయట స్ట్రీట్ డాగ్స్ చాలా ఉంటాయి వాటిని అడాప్ట్ చేసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా తన పెంపుడు కుక్క మరణించడంతో అశ్విని శ్రీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. అలాగే సోనుకు చాలా సాంప్రదాయపద్ధంగా అంత్యక్రియలను కూడా నిర్వహించారని తెలుస్తోంది. ఇక అశ్విని కెరియర్ విషయానికి వస్తే ఈమె నటిగా కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించారు కానీ ఆ సినిమాలు పెద్దగా పేరు ప్రఖ్యాతలను మాత్రం అందించలేకపోయాయి. పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అశ్విని శ్రీ అనంతరం బిగ్ బాస్ 7 కార్యక్రమం ద్వారా మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈమె స్టార్ హీరోలైన బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.
Also Read: మల్టీస్టారర్ సినిమాకు హీరోయిన్లను సెట్ చేసిన అనిల్ రావిపూడి..ఆ ఇద్దరు ఎవరంటే?