E-Paper
Advertisement

ఉమ్మడి మెదక్ జిల్లాలో కదం తొక్కిన ఆర్‌టీసీ కార్మికులు

ఉమ్మడి మెదక్ జిల్లాలో కదం తొక్కిన ఆర్‌టీసీ కార్మికులు
Advertisement

RTC Strike: స్వేచ్ఛ బ్యూరో: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. బుధవారం అర్థరాత్రి నుంచి కార్మికులు విధులు బహిష్కరించడంతో మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాపితంగా ఉన్న ఆర్ టి సి డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని మెదక్,సంగారెడ్డి సిద్దిపేట దుబ్బాక నర్సాపూర్, జహీరాబాద్ నారాయణఖేడ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తదితర ఆర్టీసీ డిపోల వద్ద తెల్లవారుజామున జేఏసి నేతలతో కలిసి కార్మికులు పెద్ద ఎత్తున బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తుతో మోహరించారు.

డిమాండ్లు..

డిపోల నుండి బస్సులను బయటకు వెళ్లనివ్వకుండా కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని నినాదాలు చేశారు. మెదక్‌లో టీఎంయూ, జేఏసీ నేత మేడి రాధాకిషన్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 30 శాతం ఫిట్మెంట్, వేతన బకాయిల చెల్లింపు చేయాలన్నారు. పీఎఫ్, సీసీఎస్ కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. యూనియన్ల పునరుద్ధరణ చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు వినతి పత్రాలను అందించినా స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.

Advertisement

Also Read: గులాబీ కోటలో ముదురుతున్న అంతర్గత యుద్దం.. అక్కడే క్లాస్ పీకపోతున్న బాస్..!

సంగారెడ్డిలో ఉద్రిక్తత..

సంగారెడ్డి బస్ డిపో వద్ద విధులు నిర్వహిస్తున్న ఒక పోలీసు అధికారి ఆర్ టి సి కార్మికున్ని చొక్కా పట్టుకోవడంతో వివాదం చెలరేగింది.బస్టాండ్ లో బస్ టైర్ లో గాలి తీసిన కార్మికున్ని పోలీసులు నెట్టి వేయడం,చొక్కా పట్టుకోవడంతో వివాదం చెలరేగింది. కొద్ది సేపు పోలీస్ లకు వ్యతిరేకంగా ఆర్ టి సి కార్మికులు నినాదాలు చేశారు. అక్కడి డీఎస్పీ కల్పించుకొని పరిస్తితిని చక్కదిద్దారు. ఉమ్మడి జిల్లా వ్యాపితంగా పలు డిపోల్లో నీ జే ఏ సి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో కొన్ని బస్ లు డిపోలనుంచి బయటకు వెళ్ళాయి. ఈ క్రమంలో పోలీస్ లకు కార్మికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. తమమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని జే ఏ సి నాయకులు ప్రకటించారు.

Advertisement

Also read: 30 ఏళ్ల ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్ కానీ..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×